AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

OTT Movie: బాక్సాఫీస్ షేక్ చేసిన హారర్ మూవీ.. 3 కోట్లతో తీస్తే రూ.70 కోట్ల కలెక్షన్స్.. 2 గంటలు నాన్‏స్టాప్ సస్పెన్స్..

ప్రస్తుతం ఓటీటీల్లో ఉత్తేజకరమైన సినిమాలు, వెబ్ సిరీస్ సినీప్రియులను ఆకట్టుకుంటున్నాయి. హారర్ కామెడీ థ్రిల్స్, మర్డర్ మిస్టరీలు ఎక్కువగా ట్రెండ్ అవుతున్నాయి. కానీ ఇప్పుడు ఓటీటీలో ఓ హారర్ కామెడీ థ్రిల్లర్ మూవీ తెగ ట్రెండ్ అవుతుంది. కేవలం రూ.3 కోట్లతో నిర్మిస్తే.. బాక్సాఫీస్ వద్ద ఏకంగా రూ.70 కోట్లు రాబట్టి సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. ఇంతకీ ఈ హారర్ మూవీ ఏంటో తెలుసుకుందామా..

OTT Movie: బాక్సాఫీస్ షేక్ చేసిన హారర్ మూవీ.. 3 కోట్లతో తీస్తే రూ.70 కోట్ల కలెక్షన్స్.. 2 గంటలు నాన్‏స్టాప్ సస్పెన్స్..
Romancham
Rajitha Chanti
|

Updated on: May 20, 2025 | 3:47 PM

Share

హారర్ సినీప్రియుల కోసం ఓటీటీల్లో ఎప్పటికప్పుడు సరికొత్త సినిమాలు, వెబ్ సిరీస్ లు స్ట్రీమింగ్ అవుతున్న సంగతి తెలిసిందే. నిత్యం సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలను అందుబాటులోకి తీసుకువస్తున్నారు మేకర్స్. ప్రేక్షకులకు ఆధ్యంతం ఉత్కంఠభరితమైన సస్పెన్స్ కొనసాగించే చిత్రాలు ఇప్పుడు దూసుకుపోతున్నాయి. ప్రస్తుతం ఓటీటీ ప్లాట్ ఫామ్ లో ట్రెండింగ్ అవుతున్న సినిమా రోమాంచం. 2023లో విడుదలైన ఈ సినిమా ఆద్యంతం ప్రేక్షకులను కట్టిపడేసింది. జీతు మాధవన్ దర్శకత్వం వహించిన ఈ మలయాళ హారర్ కామెడీ సినిమాలో సౌబిన్ షాహిర్, అర్జున్ అశోకన్, సజిన్ గోపు , సిజు సన్నీ ప్రధాన పాత్రలు పోషించారు. బెంగుళూరులో ఒక గదిలో అద్దెకు ఉన్న ఏడుగురు స్నేహితుల చుట్టూ ఈ కథ తిరుగుతుంది.

ఒకరాత్రి.. ఆత్మలను పిలిపించడానికి ఊజా బోర్డుతో ప్రయోగాలు చేస్తారు. కానీ అది ఊహించని సంఘటనలకు దారితీస్తుంది. భయంతోపాటు కడుపుబ్బా నవ్వించే కామెడీ సీన్స్ తో దాదాపు 2 గంటల 9 నిమిషాలు ఈ సినిమా ప్రేక్షకులను అలరిస్తుంది. నిజ జీవిత సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. కేవలం రూ.3 కోట్ల బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమా రూ.70 కోట్లు వసూలు చేసి బాక్సాఫీస్ వద్ద ఊహించని విజయాన్ని సాధించింది. IMDB రేటింగ్ 7.5లో ఈ సినిమా ఇప్పుడు హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతుంది.

ప్రస్తుతం ఈ సినిమా మలయాళంలోనే కాకుండా తమిళం, తెలుగు, కన్నడ, హిందీ భాషలలోనూ స్ట్రీమింగ్ అవుతుంది. హారర్ కామెడీ సినిమాలను ఇష్టపడేవారికి రోమాంచం సినిమా బెస్ట్ ఛాయిస్. ఈ సినిమాను హిందీలో కప్కపి పేరుతో రీమేక్ చేశారు. ఇందులో తుషార్ కపూర్, శ్రేయాస్ తల్పాడే ప్రధాన పాత్రలు పోషించారు. ఈనెల 23న ఈ సినిమా అడియన్స్ ముందుకు రానుంది.

ఇవి కూడా చదవండి :  

Genelia : ఆ ఒక్కటి తినడం మానేసిందట.. 37 ఏళ్ల వయసులో జెనీలియా ఫిట్నెస్ రహాస్యం ఇదే..

Tollywood: రస్నా యాడ్‏లో కనిపించిన ఈ చిన్నారి రాజమౌళీ సినిమాలో హీరోయిన్.. ఇంతకీ ఎవరీ బ్యూటీ..?

Tollywood: అప్పుడు ఐశ్వర్య రాయ్‏కే చెమటలు పట్టించింది.. కట్ చేస్తే.. ఇప్పుడు సన్యాసిగా మారిన హీరోయిన్..

Suriya : 100 రోజుల్లోనే సిక్స్ ప్యాక్.. 49 ఏళ్ల వయసులో కుర్రాడిలా సూర్య.. డైట్ ప్లాన్ చెప్పిన హీరో..

అల్లాటప్ప రాయి కాదు ఇది.! పొలాన్ని నాగలితో దున్నుతుండగా..
అల్లాటప్ప రాయి కాదు ఇది.! పొలాన్ని నాగలితో దున్నుతుండగా..
పొగమంచుపై వాతావరణశాఖ కీలక అప్డేట్.. ప్రజలకు హెచ్చరికలు
పొగమంచుపై వాతావరణశాఖ కీలక అప్డేట్.. ప్రజలకు హెచ్చరికలు
షూటింగ్‏లో యాక్సిడెంట్.. 2 ఏళ్లు నరకం అనుభవించా..
షూటింగ్‏లో యాక్సిడెంట్.. 2 ఏళ్లు నరకం అనుభవించా..
దానిమ్మ పండు ఎవరు తినొద్దు.. ఎర్రని గింజల వెనుక దాగి ఉన్న అసలు..
దానిమ్మ పండు ఎవరు తినొద్దు.. ఎర్రని గింజల వెనుక దాగి ఉన్న అసలు..
ఈ ఏడాదిలో రెండు చంద్ర గ్రహణాలు, బ్లడ్ మూన్ ఎప్పుడు కనిపిస్తాడంటే?
ఈ ఏడాదిలో రెండు చంద్ర గ్రహణాలు, బ్లడ్ మూన్ ఎప్పుడు కనిపిస్తాడంటే?
రోజంతా ఉత్సాహంగా ఉండాలంటే దీనికి మించిన సూపర్ ఫుడ్ లేదు!
రోజంతా ఉత్సాహంగా ఉండాలంటే దీనికి మించిన సూపర్ ఫుడ్ లేదు!
రీల్స్ స్టార్లు ఖబర్దార్.! అలా చేస్తే సెలబ్రిటీలైనా వదిలేది లేదు.
రీల్స్ స్టార్లు ఖబర్దార్.! అలా చేస్తే సెలబ్రిటీలైనా వదిలేది లేదు.
'ధురంధర్'లో విలన్‌ రోల్‌ను మిస్ చేసుకున్న టాలీవుడ్ హీరో ఎవరంటే?
'ధురంధర్'లో విలన్‌ రోల్‌ను మిస్ చేసుకున్న టాలీవుడ్ హీరో ఎవరంటే?
చచ్చాంరా బాబోయ్...అసలే ఉప్పు తినొద్దంటుంటే అందులోనూ కల్తీనా?
చచ్చాంరా బాబోయ్...అసలే ఉప్పు తినొద్దంటుంటే అందులోనూ కల్తీనా?
కష్టాలను తట్టుకుని పట్టుదలే పెట్టుబడిగా.. పర్పుల్ డ్రీమ్స్‌తో..
కష్టాలను తట్టుకుని పట్టుదలే పెట్టుబడిగా.. పర్పుల్ డ్రీమ్స్‌తో..