AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rana Naidu 2: ఇట్స్ అఫీషియల్.. రానా నాయుడు సీజన్ 2 స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్.. ఈసారి ఆ స్టార్ నటులు కూడా

టాలీవుడ్ స్టార్ హీరోలు దగ్గుబాటి వెంకటేశ్, రానా కలిసి నటించిన వెబ్ సిరీస్ రానా నాయుడు. సీజన్ 1 సూపర్ హిట్ కావడంతో సీజన్ 2 కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తాజాగా ఈ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ కొత్త సీజన్ స్ట్రీమింగ్ తేదీని అనౌన్స్ చేశారు.

Rana Naidu 2: ఇట్స్ అఫీషియల్.. రానా నాయుడు సీజన్ 2 స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్.. ఈసారి ఆ స్టార్ నటులు కూడా
Rana Naidu Season 2
Basha Shek
|

Updated on: May 20, 2025 | 5:20 PM

Share

రానా నాయుడు.. ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ లో రెండేళ్ల క్రితం వచ్చిన ఈ వెబ్ సిరీస్ ఎంతటి సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. టాలీవుడ్ కు చెందిన ఇద్దరు స్టార్ హీరోలు, అందులోనూ బాబాయ్ అబ్బాయ్ లు వెంకటేశ్, రానా నటించిన ఈ వెబ్ సిరీస్ పై ఎన్నో అంచనాలు ఉన్నాయి. కానీ వాటన్నిటినీ తలకిందులు చేస్తూ సిరీస మొత్తం బూతులు, అడల్ట్ సీన్స్, బోల్డ్ కంటెంట్ నింపారు. దీంతో వెంకీ ఫ్యాన్స్, అందులోనూ ఫ్యామిలీ ఆడియెన్స్ షాక్ అయ్యారు. రానా అందులోనూ వెంకీ మామ ఇలాంటి సిరీస్ చేయడమేంటి? అని విమర్శలు కురిపించారు. అయితే ఎన్ని విమర్శలు వచ్చినా రానా నాయుడు సిరీస్ ను మాత్రం ఎగబడి చూశారు. దీంతో నెట్ ఫ్లిక్స్ లో అత్యంత ప్రజాదరణ పొందిన సిరీస్ గా ఇది నిలిచింది. కాగా ఈ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ కు కొనసాగింపు ఉంటుందని మొదటి పార్ట్ లోనే క్లారిటీ ఇచ్చారు. అనుకున్నట్లే ఇప్పుడు రానా నాయుడు సీజన్ 2 రాబోతుంది. తొలి సీజన్ పై విమర్శల నేపథ్యంలో ఇందులో అలాంటి కంటెంట్ తక్కువే ఉంటుందని గతంలోనే వెంకటేశ్ చెప్పుకొచ్చారు. కాబట్టి ఈ కొత్త సీజన్ పై కొంచెం ఆసక్తి పెరిగిపోయింది.

కాగా రానా నాయుడు సీజన్ 2 టీజర్ కూడా ఇప్పటికే రిలీజ్ చేసారు. తాజాగా ఈ క్రైమ్ సిరీస్ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ని అధికారికంగా ప్రకటించారు. రానా నాయుడు సీజన్ 2 నెట్ ఫ్లిక్స్ ఓటీటీలో జూన్ 13 నుంచి స్ట్రీమింగ్ అవ్వబోతున్నట్టు అఫీషియల్ గా అనౌన్స్ చేశాడు రానా. హిందీతో పాటు తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కు రానుంది.

ఇవి కూడా చదవండి

జూన్ 13 నుంచి స్ట్రీమింగ్..

రానా నాయుడు సీజన్ 2 లో రానా దగ్గుబాటి, వెంకటేష్ దగ్గుబాటి, అర్జున్ రాంపాల్, సుర్వీన్ చావ్లా, కృతి ఖర్బందా, సుశాంత్ సింగ్, అభిషేక్ బెనర్జీ, డినో మోరియాలాంటి స్టార్ యాక్టర్లు నటించారు. దీంతో ఈ సెకెండ్  సీజన్ మరింత ఆసక్తికరంగా ఉండనుందని తెలుస్తోంది. త్వరలోనే ఈ సిరీస్ ట్రైలర్ రానుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఈ మహిళ సక్సెస్ స్టోరీ వింటే సెల్యూట్ చేయాల్సిందే
ఈ మహిళ సక్సెస్ స్టోరీ వింటే సెల్యూట్ చేయాల్సిందే
పవర్‌ఫుల్ గ్రహాల ఎంట్రీ.. డబుల్ రాజయోగంతో ఈ 4 రాశులకు డబుల్...
పవర్‌ఫుల్ గ్రహాల ఎంట్రీ.. డబుల్ రాజయోగంతో ఈ 4 రాశులకు డబుల్...
వారెవ్వా అదిరే బైక్.. ఎక్కువ మైలేజ్.. చాలా తక్కువ ధర.. సూపర్..
వారెవ్వా అదిరే బైక్.. ఎక్కువ మైలేజ్.. చాలా తక్కువ ధర.. సూపర్..
ఇంకెన్నాళ్లు జుట్టుకు రంగు వాడతారు.. దానిమ్మ తొక్కల్ని ఇలా వాడితే
ఇంకెన్నాళ్లు జుట్టుకు రంగు వాడతారు.. దానిమ్మ తొక్కల్ని ఇలా వాడితే
30 ఏళ్ల క్రితం సినిమా క్లాసిక్ హిట్.. ఇప్పటికీ ట్రెండ్ అవుతున్న ప
30 ఏళ్ల క్రితం సినిమా క్లాసిక్ హిట్.. ఇప్పటికీ ట్రెండ్ అవుతున్న ప
రేపటితో టీమిండియా 5 ఏళ్ల రికార్డు మటాష్ అవుతుందా?
రేపటితో టీమిండియా 5 ఏళ్ల రికార్డు మటాష్ అవుతుందా?
ఓటీటీలో సుదీప్ లేటెస్ట్ సూపర్ హిట్ మూవీ.. తెలుగులోనూ స్ట్రీమింగ్
ఓటీటీలో సుదీప్ లేటెస్ట్ సూపర్ హిట్ మూవీ.. తెలుగులోనూ స్ట్రీమింగ్
మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్లు ఖరారు.. మహిళలు, బీసీలకు..
మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్లు ఖరారు.. మహిళలు, బీసీలకు..
మరోసారి పోలీస్ పాత్రలో రాణీ ముఖర్జీ.. మ్యాజిక్ రిపీట్ అవుతుందా?
మరోసారి పోలీస్ పాత్రలో రాణీ ముఖర్జీ.. మ్యాజిక్ రిపీట్ అవుతుందా?
బిగ్ బ్రేక్ కోసం ఎదురుచూస్తున్న షాలిని పాండే
బిగ్ బ్రేక్ కోసం ఎదురుచూస్తున్న షాలిని పాండే