Mahesh Babu: సినిమా ఇండస్ట్రీలో కరోనా కలకలం.. వైరస్ బారిన పడ్డ ప్రముఖ నటి
ప్రపంచ వ్యాప్తంగా మళ్లీ కరోనా కలకలం రేపుతోంది. మన దేశంలోనూ కొవిడ్ కేసులు నమోదవుతున్నాయి. తాజాగా సినిమా ఇండస్ట్రీలోనూ కరోనా కలవరం మొదలైంది. బాలీవుడ్ కు చెందిన ఒక ప్రముఖ నటి వైరస్ బారిన పడింది. ఈ విషయాన్ని ఆమెనే స్వయంగా వెల్లడించింది.

దేశంలో మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్నాయి. సామాన్యులతో పాటు సెలబ్రిటీలు ఈ వైరస్ బారిన పడుతున్నారు. ఇప్పటికే ఐపీఎల్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ స్టార్ ప్లేయర్ ట్రావిడ్ హెడ్ కరోనా బారిన పడ్డాడు. తాజాగా బాలీవుడ్ కు చెందిన ఒక ప్రముఖ నటి ఈ మహమ్మారి బారిన పడింది. ఆమె మరెవరో కాదు టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు మరదలు శిల్పా శిరోద్కర్. తనకు కరోనా సోకిందన్న విషయాన్ని ఆమెనే సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. ‘మిత్రులారా! నాకు కొవిడ్ పరీక్షలో పాజిటివ్ అని తేలింది. మీరు జాగ్రత్తగా ఉండండి.. ముందు జాగ్రత్తగా మాస్క్ ను ధరించండి’ అని ఇన్ స్టా గ్రామ్ లో పోస్ట్ పెట్టింది. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది. దీనిని చూసిన బాలీవుడ్ సినీ పప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు శిల్పా కు ధైర్యం చెప్పారు. ఆమె త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
నమ్రతా ఏమన్నదంటే?
కాగా తన సోదరి కరోనా బారిన పడిన విషయాన్ని తెలుసుకున్న నమ్రతా ఆమె త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించింది. ఈ మేరకు శిల్పా పోస్టుకు స్పందించిన ఆమె లవ్ ఎమోజీలతో రిప్లై ఇచ్చింది. నమ్రతాతో పాటు సోనాక్షిసిన్హా, సోనాలి బింద్రే, డయానా పాండే తదితర సినీ ప్రముఖలు శిల్పా కోలుకోవాలని ఆకాంక్షించారు.
శిల్పా శిరోద్కర్ పోస్ట్..
View this post on Instagram
కాగా నమ్రత లాగే శిల్పా శిరోద్కర్ కూడా పలు సినిమాల్లో హీరోయిన్ గా నటించింది. తెలుగులో కలెక్షన్ మోహన్ బాబు తో కలిసి బ్రహ్మ అనే సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఇక హిందీలోనూ పలువురు స్టార్ హీరోలతో ఆడిపాడింది. అలాగే బిగ్ బాస్ రియాలిటీ షోలోనూ సందడి చేసింది.హిందీ బిగ్‌బాస్ 18వ సీజన్‌లో కంటెస్టెంట్ గా అడుగు పెట్టిన ఆమె ఫైనలిస్ట్ అయ్యే అవకాశాన్ని ఒక్క అడుగు దూరంలో మిస్ చేసుకుంది. ఈ రియాలిటీ షో ద్వారానే శిల్పా మరింత క్రేజ్ సొంతం చేసుకుంది. ఇక సోషల్ మీడియాలోనూ ఈ అందాల తారకు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఆమె ఫొటోలు, వీడియోలకు నెటిజన్ల నుంచి మంచి స్పందన వస్తుంటుంది.
శిల్పా శిరోద్కర్ లేటెస్ట్ ఫొటోస్..
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.