Tollywood: సినిమా లవర్స్‌కు షాక్.. తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లు బంద్.. ఎప్పటినుంచంటే?
జూన్ 1 నుంచి థియేటర్లు బంద్ చేయాలని నిర్ణయం తీసుకున్నారు..తెలుగు రాష్ట్రాల ఫిల్మ్ ఎగ్జిబిటర్లు. ఇకపై అద్దె ప్రాతిపదికన సినిమాలు ప్రదర్శించలేమంటున్న ఎగ్జిబిటర్లు.. పర్సంటేజ్ రూపంలోనే చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు నిర్మాతలకు లేఖ రాయాలని ఎగ్జిబిటర్ల తీర్మానం చేశారు. ఫిల్మ్ చాంబర్‌లో జరిగిన ఎగ్జిబిటర్ల సంయుక్త సమావేశానికి..దిల్‌రాజు, సురేష్‌బాబుతో పాటు 60 మంది ఎగ్జిబిటర్లు అటెండ్ అయ్యారు.

చాలా రోజులుగా తెలుగు ఇండస్ట్రీలో ఎగ్జిబిటర్లు, నిర్మాతలకు మధ్య పర్సెంటేజ్ యుద్ధం నడుస్తూనే ఉంది. తమకు పర్సెంటేజ్ సిస్టమ్‌లో సినిమాలు విడుదల చేయాలని ఎగ్జిబిటర్లు పట్టు పడుతుంటే.. అలా చేస్తే తమకు నష్టం వస్తుందని నిర్మాతలు కూడా ఏం మాట్లాడటం లేదు. ఇప్పుడు ఈ వార్ ముదిరి పాకాన పడింది. తాజాగా ఫిల్మ్ ఛాంబర్‌లో తెలుగు రాష్ట్రాల్లోని ఎగ్జిబిటర్లు ఓ మీటింగ్ ఏర్పాటు చేసారు. ఈ మీటింగ్‌కు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి దాదాపు 60 మంది ఎగ్జిబిటర్లు హాజరయ్యారు. అందులో సురేష్ బాబు, దిల్ రాజు లాంటి అగ్ర నిర్మాతలు కూడా ఉన్నారు. ఈ మీటింగ్‌లో తమ డిమాండ్స్ ఛాంబర్ ముందు పెట్టారు ఎగ్జిబిటర్లు. ప్రస్తుతం నడుస్తున్న అద్దె ప్రాతిపదికన థియేటర్లు నడిపే పరిస్థితుల్లో తాము లేమని చెప్పేసారు థియేటర్ యాజమాన్యం. అలా చేస్తే నష్టాలు వస్తున్నాయంటున్నాయని.. థియేటర్స్ నడపలేని స్టేజీలోకి వెళ్లిపోయామని తమ కష్టాలు చెప్పుకున్నారు.
పర్సెంటేజ్ ప్రకారం అయితేనే సినిమాలను ప్రదర్శిస్తామని నిర్మాతలకు లేఖ రాయాలని ఎగ్జిబిటర్లు ఓ తీర్మానం చేసుకున్నారు. ప్రస్తుతం మల్టీప్లెక్స్‌లలో సినిమాల ప్రదర్శన పర్సెంటేజ్ ప్రకారమే జరుగుతుంది. అందులో నిర్మాతలు, మల్టీప్లెక్స్ యాజమాన్యం ఓ ఒప్పందం ప్రకారం సినిమాలు ప్రదర్శిస్తున్నారు. కానీ సింగిల్ స్క్రీన్స్‌కు ఈ ప్రతిపాదన లేదు. అక్కడంతా అద్దె సిస్టమే నడుస్తుంది. అలా చేస్తే పెద్ద సినిమాలు విడుదలైనపుడు తమకు నష్టం వస్తుందంటున్నారు ఎగ్జిబిటర్లు. అప్పుడు నిర్మాతలకే లక్షలకు లక్షలు చెల్లించాల్సి వస్తుందంటున్నారు. ఈ మేరకు ఛాంబర్ కూడా స్పందించి నిర్మాతలకు లేఖ రాయనుంది. ఈ క్రమంలోనే జూన్ 1 నుంచి థియేటర్స్ బంద్ చేయాలని నిర్ణయించుకున్నారు ఎగ్జిబిటర్లు. మరి దీనిపై నిర్మాతల రియాక్షన్ ఎలా ఉండబోతుందో చూడాలి. అన్నట్లు ఈ మీటింగ్‌కు ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది నిర్మాతలు కమ్ ఎగ్జిబిటర్లు హాజరు కాలేదు. సురేష్ బాబు, దిల్ రాజు మాత్రమే హాజరయ్యారు. మరి ఈ చర్చలు ఫలిస్తాయా.. జూన్ 1 నుంచి థియేటర్స్ ఫ్యూచర్ ఎలా ఉండబోతుందో చూడాలి.
జూన్ నెలలో రిలీజవుతోన్న సినిమాలివే..
కాగా జూన్ నెలలో స్టార్ హీరోల సినిమాలు రిలీజ్ కానున్నాయి. అందులో ప్రధానంగా చెప్పుకోవాల్సింది. ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన హరి హర వీర మల్లు మూవీ. గత ఐదేళ్లుగా షూటింగ్ జరుపుకొంటోన్న ఈ మూవీ జూన్ 12న విడుదల కానుంది. ఈ విషయాన్ని మేకర్స్ ఇటీవలే అధికారికంగా ప్రకటించారు. ఇప్పుడు థియేటర్లు మూత పడితే వీరమల్లు మళ్లీ ఆగాల్సిందే. దీంతో పాటు నాగార్జున, ధనుష్ నటించిన కుబేర సినిమా జూన్ 20న విడుదల కానుంది. శేఖర్ కమ్ముల తెరకెక్కిస్తోన్న ఈ మూవీపై కూడా భారీ అంచనాలు ఉన్నాయి. ఇక మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప కూడా జూన్ 27నే విడుదల కానుంది. వీటితో పాటు జులై 4న విజయ్ దేవర కొండ కింగ్ డమ్ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఒక వేళ థియేటర్లు మూతపడితే మాత్రం ఈ సినిమాల పరిస్థితి అగమ్య గోచరంగా మారుతుంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..