OTT Movie: కోడళ్ల చావుకు కారణమెవరు? ఓటీటీని షేక్ చేస్తోన్న ఇంటెన్స్ క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ చూడొచ్చు
ఎప్పటిలాగే ఈ వారం కూడా పలు ఆసక్తికర సినిమాలు, వెబ్ సిరీస్ లు స్ట్రీమింగ్ కు వచ్చాయి. తెలుగుతో పాటు వివిధ భాషల్లోని సినిమాలు, వెబ్ సిరీస్ లు కూడా ఓటీటీలో సందడి చేస్తున్నాయి. ఇందులో ఓ ఇంటెన్స్ క్రైమ్ థ్రిల్లర్ కూడా ఉంది.

ప్రస్తుతం ఓటీటీల్లో తెలుగుతో పాటు ఇంగ్లిష్, హిందీ, తమిళ్, మలయాళ భాషలకు చెందిన వెబ్ సిరీస్‌లు ఆడియెన్స్ ను అలరిస్తున్నాయి. అయితే కన్నడలో మాత్రం వెబ్ సిరీస్ లు రావడం చాలా అరుదు. అయితే ఇటీవల విడుదలైన ఓ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ మాత్రం ఓటీటీని షేక్ చేసింది. అతి తక్కువ సమయంలోనే అత్యధిక వ్యూస్ సాధించిన కన్నడ వెబ్ సిరీస్ గా రికార్డుల కెక్కింది. ఏప్రిల్ 25న ఓ ప్రముఖ ఓటీటీలోకి వచ్చేసిన ఈ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ అతి తక్కువ కాలంలోనే 50 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ ను చేరుకుంది. ఒక రీజినల్ వెబ్ సిరీస్ ఈ స్థాయిలో వ్యూస్ సొంతం చేసుకుందంటే మాములు విషయం కాదు. కన్నడతో పాటు హిందీ, తమిళ భాషల్లోనూ ఈ వెబ్ సిరీస్ సంచలన విజయం సాధించింది. ఇప్పుడీ గ్రిప్పింగ్ ఫ్యామిలీ థ్రిల్లర్ తెలుగులోకి కూడా అందుబాటులోకి వచ్చేసింది. శుక్రవారం (మే16) అర్ధరాత్రి నుంచే ఈ సిరీస్ తెలుగులో కూడా స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సిరీస్ కథ విషయానికి వస్తే.. బెంగళూరులోని చిక్ మంగళూర్ నేపథ్యంలో ఈ కథ సాగుతుంది.
మంచి భర్త లభించాడనే సంతోషంతో, ఎన్నో ఆశలతో అత్తవారింట్లో అడుగుపెట్టిన కొత్త పెళ్లి కూతురుకి మొదటి రోజునే ఊహించని సంఘటన ఎదురవుతుంది. ఆ ఇంట్లో అందరూ తేడాగా ప్రవర్తిస్తారు. అంతే కాదు తనకంటే ముందుగా ఆ ఇంటికి కోడళ్లుగా వచ్చిన వాళ్లంతా చచ్చిపోయారని తెలుస్తుంది. మరి ఆ కోడళ్ల చావులకు కారణమెవరు? ఇంతకీ ఆ ఇంట్లో ఏం జరుగుతుంది? కొత్తగా వచ్చిన కోడలికి ఎదురైన పరిస్థితులేంటి? అన్నది తెలుసుకోవలంటే ఈ వెబ్ సిరీస్ చూడాల్సిందే.
ఓటీటీలో రికార్డులు..
Just watched #AyyanaMane on #ZEE5! A gripping Kannada thriller that masterfully blends mystery, superstition, and family secrets. Kushee Ravi’s compelling performance as Jaaji make it a must-watch! #KannadaWebSeries #AyyanaManeOnZEE5@kusheeravi pic.twitter.com/rAd6oCCqAx
— Jatre Talks (@JatreTalks) April 26, 2025
ఇప్పటివరకు మనం మాట్లాడుకున్న వెబ్ సిరీస్ పేరు అయ్యనా మానే. దీని అర్థం అయ్యగారి ఇల్లు. ప్రస్తుతం ఓటీటీలో ఉన్న ది బెస్ట్ క్రైమ్ థ్రిల్లర్ అని చెప్పుకోవచ్చు. మొదటి ఎపిసోడ్ నుంచి చివరి ఎపిసోడ్ వరకూ ఈ సిరీస్ చాలా ఉత్కంఠభరితంగా సాగుతుంది. ప్రస్తుతం జీ5 ఓటీటీలో ఈ సిరీస్ స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగు వెర్షన్ కూడా అందుబాటులో ఉంది.
జీ5లో స్ట్రీమింగ్..
At Ayyana Mane, love and life are haunted by death. #AyyanaMane streaming now on #ZEE5#ZEE5Global #AyyanaManeOnZEE5@archana_kottige @Hithaceee @KusheeRavi @shrunaidu @ManasiSudhir1 @RJPRADEEPA @Anirudhacharya @ZEE5Kannada #VijayShobharajPavoor @kaanistudio… pic.twitter.com/X1HPhnnUcy
— ZEE5 Global (@ZEE5Global) April 28, 2025
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి








