Tollywod: ఒకప్పుడు సెలూన్ షాప్‌లో పని చేశాడు.. కట్ చేస్తే.. ఇప్పుడు పాన్ ఇండియా యాక్టర్.. ఎవరో తెలుసా?
ఈ హీరో గురించి ఎంత చెప్పినా తక్కువే. ఏ పాత్రలోనైనా ఇట్టే పరకాయ ప్రవేశం చేయగలడు. సినిమా బాగా రావడానికి తనను, తన శరీరాన్ని ఎంతైనా కష్ట పెట్టుకుంటాడు. అందుకే ఈ నటుడికి మన దేశంలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు.

ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో స్టార్స్ గా వెలుగొందుతోన్న వారిలో చాలామంది బాల్యంలో, టీనేజ్ లో ఎన్నో కష్టాలు పడిన వారే. పొట్ట కూటి కోసం కూలీ పనులు చేసిన వారే. ఈ దిగ్గజ నటుడు కూడా సరిగ్గా ఇదే కోవకు చెందుతారు. ముఖ్యంగా టీనేజ్ లో ఈ హీరో చాలా కష్టాలు పడ్డాడట. జాబ్ స్కిల్స్ లేకపోవడంతో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాడట. ఏం చేయాలో తెలియక ఎక్కువ టైమ్ నవలలు చదవడం, సినిమాలు చూడటంతోనే టైమ్ గడిపేశాడట. ఇది వాళ్ల అమ్మకు చాలా బాధ కలిగించేదట. దీంతో సెలూన్ షాప్ లో బార్బర్ గా పనికి చేరాడట. అయితే ఇదే అతని జీవితాన్ని మలుపు తిప్పింది. ఆ బార్బర్ షాప్ ఓనరే ఈ నటుడిలోని యాక్టింగ్ ట్యాలెంట్ ను మొదటి సారి గుర్తించాడట. ఒకసారి లెజెండరీ డైరెక్టర్ కె. బాలచందర్‌ను కలవమని చెప్పాడట. ఆ సలహాను పాటించడంతో అది అతని లైఫ్‌లో ఒక టర్నింగ్ పాయింట్ అయింది. కట్ చేస్తే.. ఇప్పుడు అతను పాన్ ఇండియా యాక్టర్ అయ్యాడు. దేశం గర్వించదగ్గ నటుల్లో ఒకరిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆయన మరెవరో కాదు లోక నాయకుడు కమల్ హాసన్.
కమల్ హాసన్ నటించిన తాజా చిత్రం థగ్ లైఫ్. చాలా రోజుల తర్వాత మళ్లీ మణిరత్నం దర్శకత్వంలో కమల్ నటిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన ఈ మూవీ పోస్టర్స్, టీజర్ అంచనాలను పెంచేశాయి. ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్లలో ఉన్న కమల్ తాజాగా ‘ది హాలీవుడ్ రిపోర్టర్ ఇండియా’ ఇంటర్వ్యూకు హాజరయ్యారు. ఈ సందర్భంగా తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఈ క్రమంలోనే తాను ఒకప్పుడుబార్బర్ గ పనిచేశాడన్న విషయాన్ని అందరితో పంచుకున్నారు. అయితే అదీ ఇంట్రెస్ట్‌తోమాత్రం కాదట. కేవలం వాళ్ల అమ్మకు కోపం తెప్పించి, ఇబ్బంది పెట్టాలనే మొండి పట్టుదలతో అలా సెలూన్ షాప్ లో పని చేశానని కమల్ చెప్పుకొచ్చారు.
థగ్ లైఫ్ సినిమా ప్రమోషన్లలో కమల్ హాసన్..
He gave White a whole new Attitude!
In his fashion house #khhouseofkhaddar #Thuglife #ThuglifeFromJune5 #KamalHaasan #SilambarasanTR
A #ManiRatnam Film An @arrahman Musical@ikamalhaasan @SilambarasanTR_ #Mahendran @bagapath @trishtrashers @AishuL_ @AshokSelvan… pic.twitter.com/HgZaLl8hrc
— Raaj Kamal Films International (@RKFI) May 8, 2025
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి








