AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Urvashi Rautela: కేన్స్‌లో ఊర్వశి రౌతెలాకు అవమానం.. ఏం జరిగిందంటే? వీడియో వైరల్

ప్రతిష్ఠాత్మక కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు హాజరై రెడ్ కార్పెట్‌పై క్యాట్ వాక్ చేసింది బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌతెలా. ఈ ఈవెంట్ లో ఆమె ధరించిన దుస్తులు, అలాగే చిలుక బ్యాగ్ అందరి దృష్టిని ఆకర్షించాయి. అయితే ఇదే కేన్స్ ఉత్సవంలో ఊర్వశి రౌతేలాకు అవమానం జరిగిందని ప్రచారం జరుగుతోంది.

Urvashi Rautela: కేన్స్‌లో ఊర్వశి రౌతెలాకు  అవమానం.. ఏం జరిగిందంటే? వీడియో వైరల్
Bollywood Actress Urvashi Rautela
Basha Shek
|

Updated on: May 15, 2025 | 5:26 PM

Share

బాలీవుడ్ ప్రముఖ నటి ఊర్వశి రౌతేలా తన సినిమాలు, స్పెషల్ సాంగ్స్ తోనే కాకుండా తన ఫ్యాషన్ సెన్స్‌తోనూ వార్తల్లో నిలుస్తోంది. ప్రస్తుతం ఈ బ్యూటీకి భారీ డిమాండ్ ఉంది. ముఖ్యంగా హిందీతో పాటు దక్షిణాది సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ కు కేరాఫ్ అడ్రస్ గా మారిపోయింది ఊర్వశి. ఇక కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్స్ లో రెడ్ కార్పెట్ పై క్యాట్ వాక్ చేయడం తనకు చాలా ఇష్టమని పలు సందర్భాల్లో చెప్పుకొచ్చిందీ అందాల తార. అలా ప్రస్తుతం జరుగుతున్న కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో కూడా తళుక్కుమందీ ముద్దుగుమ్మ. ఎప్పటిలాగే తన తన వస్త్రధారణ, అందంతో అందరి దృష్టిని ఆకర్షించింది. అయితే కేన్స్ ఫిల్మ్స్ ఫెస్టివల్ నిర్వాహకులు ఊర్వశిని అవమానించారని వార్తలు వస్తున్నాయి. కాన్ ఫెస్ట్‌లో ఊర్వశి రౌతేలా మరికొందరు ప్రముఖులతో కలిసి రెడ్ కార్పెట్‌పై నడిచారు. అక్కడ వందలాది మంది కెమెరామెన్‌లకు పోజులిచ్చారు. అయితే అక్కడి భద్రతా సిబ్బంది ఊర్వశి రౌతేలాను బలవంతంగా బయటకు పంపించారని సమాచారం. ఊర్వశిని భద్రతా సిబ్బంది రెడ్ కార్పెట్ ను విడిచి వెళ్లిపోవాలంటున్న వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

నిజానికి అక్కడ జరిగింది వేరేలా ఉంది. ఈసారి, కేన్స్ రెడ్ కార్పెట్ కోసం కొన్ని నియమాలు రూపొందించారు. అందులో భాగంగానే సెలబ్రిటీలు రెడ్ కార్పెట్ మీద ఎంతసేపు ఉండవచ్చనే దాని గురించి నియమాలు పొందు పరిచారు. ప్రతి సంవత్సరం రెడ్ కార్పెట్ వాక్ కారణంగా సినిమా ప్రదర్శనలు, ఇతర కార్యక్రమాలు ఆలస్యం అవుతాయి కాబట్టి ఈ నియమాలు రూపొందించారు. కానీ ఊర్వశి రౌతెలా షెడ్యూల్ చేసిన సమయం కంటే ఎక్కువసేపు రెడ్ కార్పెట్ మీద నిలబడి, కెమెరాలకు పోజులు ఇచ్చింది. ఈ కారణంగానే సెక్యూరిటీ నటిని బయటకు పిలిచారని చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి

కేన్స్ లో ఊర్వశి రౌతెలా..

ఏది ఏమైనప్పటికీ, ప్రతిసారీ లాగే, ఊర్వశి రౌతేలా ఈసారి కూడా కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో దృష్టిని ఆకర్షించింది. ఊర్వశి చాలా ఆకట్టుకునేలా కనిపించే డ్రెస్ వేసుకుంది. ఊర్వశి ధరించిన దుస్తుల ధర దాదాపు 40 కోట్ల రూపాయలు. దానితో పాటు, ఊర్వశి కూడా ఒక చిలుక బ్యాగ్ ను పట్టుకుంది. అది కూడా చాలా మంది దృష్టిని ఆకర్షించింది. ఊర్వశి ప్రస్తుతం ‘వెల్‌కమ్ టు జంగిల్’, ‘కసూర్ 2’ తో పాటు తెలుగు చిత్రం ‘బ్లాక్ రోజ్’ లలో నటిస్తోంది.

చిలుక బ్యాగ్ తో ఊర్వశి..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.