AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

OTT Movie: నౌకలో నరకం చూపించే దెయ్యాలు.. ఓటీటీలో మైండ్ బ్లాక్ అయ్యే రియల్ స్టోరీ.. ఒంటరిగా మాత్రం చూడొద్దు

ఓటీటీలో అప్పుడు రియల్ స్టోరీస్ కూడా వస్తుంటాయి. అంటే యదార్థ సంఘటలన ఆధారంగా తెరకెక్కించిన సినిమాలు, వెబ్ సిరీస్ లు. ఈ హారర్ థ్రిల్లర్ మూవీ కూడా సరిగ్గా ఇదే కోవకు చెందుతుంది. ముంబైలోని జుహు బీచ్ లో జరిగిన ఓ సంఘటన ఆధారంగా ఈ మూవీ తెరకెక్కింది.

OTT Movie: నౌకలో నరకం చూపించే దెయ్యాలు.. ఓటీటీలో మైండ్ బ్లాక్ అయ్యే రియల్ స్టోరీ.. ఒంటరిగా మాత్రం చూడొద్దు
OTT Movie
Basha Shek
|

Updated on: May 14, 2025 | 5:46 PM

Share

ఓటీటీలో సస్పెన్స్, థ్రిల్లర్, హారర్ మూవీస్ కు సపరేట్ ఫ్యాన్స్ ఉన్నారు. అందుకు తగ్గట్టుగానే పలు ఓటీటీ సంస్థలు ప్రతి వారం ఈ జానర్ కు సంబంధించిన కొత్త సినిమాలను, సిరీస్ లను స్ట్రీమింగ్ కు తీసుకొస్తుంటాయి. ఇక ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమా విషయానికి వస్తే.. ఇది రియల్ స్టోరీ. ముంబై మహా నగరంలో జరిగిన ఒక యదార్థ సంఘటన ఆధారంగా ఈ సినిమా రూపొందింది. జుహు బీచ్ లో ఒక పాడుబడిన దెయ్యాల నౌకను తరలించే క్రమంలో ఈ సినిమా నడుస్తుంది. ఇందులో హీరో ఒక షిప్పింగ్ అధికారిగా ఉద్యోగం చేస్తుంటాడు. ఇతను తన భార్య, కుమార్తెను కోల్పోయి మానిసిక క్షోభ అనుభవిస్తుంటాడు. తన విధుల్లో భాగంగా ముంబైలోని జుహు బీచ్‌లోకి కొట్టుకొచ్చిన ‘సీ బర్డ్’ అనే ఓ పాడుబడిన ఓడ గురించి తెలుసుకుంటాడు. ఈ ఓడలో ఎవరూ ఉండరు.. కానీ అక్కడకు వెళ్లిన వారు తిరిగి రావడం లేదన్న విషయాన్ని తెలుసుకుంటాడు. దీంతో హీరో తన స్నేహితులతో కలిసి ఓడలోని మిస్టరీని తెలుసుకునేందుకు ప్రయత్నిస్తాడు. అయితే నౌకలో హీరోకు అనేక భయంకరమైన అనుభవాలు ఎదురవుతాయి. అదే సమయంలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తాయి. ఓడలో ఉండే దెయ్యం, ఒక చిన్న పాపను బంధించి ఉంచిందని హీరో తెలుసుకుంటాడు. అలాగే ఈ దెయ్యంకు, గతంలో ఓడలో జరిగిన ఓ విషాదకర ఘటనకు సంబంధం ఉందని తెలుసుకుంటాడు. మరి ఆ ఓడలో దాగున్న మిస్టరీ ఏంటి? అసలు ఆ ఓడలోకి దెయ్యాలు, ఆత్మలు ఎలా వచ్చాయి? చివరకు ఏమైంది? అన్నది తెలుసుకోవాలంటే మీరు ఈ మూవీని తప్పకుండా చూడాల్సిందే.

ఇప్పటివరకు మనం మాట్లాడుకున్న హారర్ థ్రిల్లర్ మూవీ పేరు ‘భూత్ : ది హాంటెడ్ షిప్’.  2020 ఫిబ్రవరి 21న థియేటర్లో విడుదలైన ఈ  బాలీవుడ్  మూవీ సూపర్ హిట్ గా నిలిచింది. ఆడియెన్స్ ను బాగా భయ పెట్టింది. భాను ప్రతాప్ సింగ్ తెరకెక్కించిన ఈ మూవీలో విక్కీ కౌశల్ భూమి పెడ్నేకర్, ఆశుతోష్ రానా ప్రధాన పాత్రల్లో నటించారు. కరణ్ జోహార్, హిరూ యష్ జోహార్, అపూర్వ మెహతా, శశాంక్ ఖైతాన్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు. ప్రస్తుతం ఈ మూవీ ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ వీడియో లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ బాలీవుడ్ మూవీ తెలుగు డబ్బింగ్ వెర్షన్ లో కూడా స్ట్రీమింగ్ అవుతోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

మొబైల్‌ ఛార్జర్‌ నకిలీదా? నిజమైనదా?సింపుల్‌ ట్రిక్‌తో గుర్తించండి
మొబైల్‌ ఛార్జర్‌ నకిలీదా? నిజమైనదా?సింపుల్‌ ట్రిక్‌తో గుర్తించండి
ఏంటన్నా ఇలా మారిపోయావ్.. హీరోగా టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్!
ఏంటన్నా ఇలా మారిపోయావ్.. హీరోగా టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్!
తిరుమలకు వెళ్లే ఆ నడక మార్గం మూసివేత!
తిరుమలకు వెళ్లే ఆ నడక మార్గం మూసివేత!
రిచా ఘోష్ ఆన్ డ్యూటీ.. జీతం, బోనస్ కలిపి ఎంతోస్తాయో తెలుసా ?
రిచా ఘోష్ ఆన్ డ్యూటీ.. జీతం, బోనస్ కలిపి ఎంతోస్తాయో తెలుసా ?
గ్లాస్‌ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
గ్లాస్‌ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
రాంగ్‌ రూట్‌లో వచ్చి మరీ.. మహిళా కానిస్టేబుల్‌పై బైక్ రైడర్ దాడి
రాంగ్‌ రూట్‌లో వచ్చి మరీ.. మహిళా కానిస్టేబుల్‌పై బైక్ రైడర్ దాడి
బాలయ్య కంటే ముందే అఘోరాగా కనిపించిన చిరంజీవి..
బాలయ్య కంటే ముందే అఘోరాగా కనిపించిన చిరంజీవి..
జాతకంలో రాహు-కేతు పీడ ఉందా? బంగారం లాంటి చాన్స్ ఇది!
జాతకంలో రాహు-కేతు పీడ ఉందా? బంగారం లాంటి చాన్స్ ఇది!
కారు నట్స్‌ను ఇలా బిగిస్తున్నారా? జాగ్రత్త.. పేలిపోయే ప్రమాదం..!
కారు నట్స్‌ను ఇలా బిగిస్తున్నారా? జాగ్రత్త.. పేలిపోయే ప్రమాదం..!
ప్రైవేటు క్యాబ్‌ ట్యాక్సీల దోపిడీకి చెక్ భారత్ టాక్సీ సేవలు షురూ
ప్రైవేటు క్యాబ్‌ ట్యాక్సీల దోపిడీకి చెక్ భారత్ టాక్సీ సేవలు షురూ