AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: జూబ్లీహిల్స్‌లో టాలీవుడ్ హీరో హల్‌చల్.. రాంగ్ రూట్‌లో రావడమే కాకుండా ట్రాఫిక్ కానిస్టేబుల్‌తో..

సెలబ్రిటీలు బాధ్యతతో వ్యవహరించాల్సి ఉంటుంది. అందులోనూ సినిమా హీరోలు మరింత రెస్పాన్సిబిలిటీతో నడుచుకోవాలి. ఎందుకంటే వారిని కోట్లాది మంది అభిమానులు అనుసరిస్తుంటారు. ఈ క్రమంలో తాజాగా ఓ టాలీవుడ్ యంగ్ హీరో రాంగ్ రూట్‌లో వచ్చి కానిస్టేబుల్‌ తో దురుసుగా ప్రవర్తించాడని తెలుస్తోంది.

Tollywood: జూబ్లీహిల్స్‌లో టాలీవుడ్ హీరో హల్‌చల్.. రాంగ్ రూట్‌లో రావడమే కాకుండా ట్రాఫిక్ కానిస్టేబుల్‌తో..
Tollwood Actor
Basha Shek
|

Updated on: May 13, 2025 | 6:47 PM

Share

టాలీవుడ్ కు చెందిన ఓ యంగ్ హీరోపై నెట్టింట విమర్శల వర్షం కురుస్తోంది. అందరికీ ఆదర్శంగా నిలవాల్సిన సెలబ్రెటీలు ఇలా నిబంధనలు ఉల్లంఘించడం ఏంటని దుమ్మెత్తిపోస్తున్నారు. అందుకు అతని ప్రవర్తనే కారణమని తెలుస్తోంది. అసలేం జరిగిందంటే.. మంగళవారం (మే13) సాయంత్రం టాలీవుడ్ యంగ్ హీరో బెల్లం కొండ శ్రీనివాస్ జూబ్లీహిల్స్ జర్నలిస్ట్ కాలనీలో హల్ చల్ చేశాడని తెలుస్తోంది. రాంగ్ రూట్ లో కారు పోనివ్వడమే కాకుండా దీనిని ప్రశ్నించిన ట్రాఫిక్ కానిస్టేబుల్ తో దురుసుగా ప్రవర్తించాడని తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన కొన్ని ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరలవుతున్నాయి. హీరో బెల్లంకొండ శ్రీనివాస్ వ్యవహారాన్ని ట్రాఫిక్ కానిస్టేబుల్.. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకు వెళ్లినట్లు సమాచారం. దీనికి సంబంధించి ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ వారసుడిగా తెలుగు సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్. 2014లో అల్లుడు శీను మూవీతో హీరోగా అరంగేట్రం చేశాడు. డ్యాన్సులు, ఫైట్లతో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు. ఇక రాక్షసుడు సినిమాతో తన యాక్టింగ్ ట్యాలెంట్ ను కూడా ప్రూవ్ చేసుకున్నాడు. అయితే గత కొన్నేళ్లుగా ఈ హీరోకు విజయాలు అందట్లేదు. అయితే తన ఫ్లాప్ సినిమాలకు యూట్యూబ్ లో రికార్డు స్థాయిలో వ్యూస్ వస్తుండడం విశేషం. ముఖ్యంగా బెల్లం కొండ సినిమాల హిందీ వెర్షన్ లో  మిలియన్ల కొద్ది వ్యూస్, లైక్స్ ఉండటం విశేషం. ప్రస్తుతం ఈ హీరో భైరవం అనే సినిమాలో నటిస్తున్నాడు. ఇందులో అతనితో పాటు మంచు మనోజ్, నారా రోహిత్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే దాదాపు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా మే 30న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇవి కూడా చదవండి

భైరవం సినిమాలో బెల్లం కొండ సాయి శ్రీనివాస్..

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి . .