Dil Raju: దిల్ రాజు కూతురికి అమ్మంటే ఎంత ప్రేమో! ఇంట్లోనే తల్లి విగ్రహం.. ఫొటోస్ చూశారా?
ఇంటర్నేషనల్ మదర్స్ డే (మాతృదినోత్సవం) సందర్భంగా అందరూ తమ తల్లులకు శుభాకాంక్షలు తెలిపారు. చాలామంది తమ మాతృమూర్తులకు బహుమతులు ఇచ్చి తమ కృతజ్ఞతను చాటుకున్నారు. ఈ క్రమంలోనే దిల్ రాజు కూతురు హన్షితా రెడ్డి తన తల్లిపై తనకున్న ప్రేమను వినూత్నంగా చాటుకుంది.

టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎన్నో ఏళ్లుగా సినిమాలు తీస్తున్న ఆయన ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వంలోనూ తెలంగాణ ఫిల్మ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ గా కూడా కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఇక దిల్ రాజు పిల్లలు కూడా ఆయన బాటలోనే పయనిస్తున్నారు. ముఖ్యంగా కూతురు హన్షితా రెడ్డి ఇప్పటికే నిర్మాతగా బాగా ఫేమస్ అయ్యింది. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రపంచానికి పరిచయం చేసిన బలగం సినిమాకు హన్షితా రెడ్డినే నిర్మాతగా వ్యవహరించడం విశేషం. ప్రస్తుతం మరిన్ని మంచి సినిమాలు తెరకెక్కించే పనిలో బిజీగా ఉన్నారామె. కాగా దిల్ రాజు మొదటి భార్య, హన్షిత తల్లి అనిత కొన్నేళ్ల క్రితం గుండె పోటుతో కన్నుమూశారు. ఈ క్రమంలోనే తన తల్లి ఎప్పటికీ తనతో ఉండిపోయేలా ఇంట్లోనే విగ్రహం ఏర్పాటు చేసింది. మదర్స్ డే సందర్భంగా ఆదివారం (మే 11) తన ఇంట్లోనే తల్లి అనిత విగ్రహాన్ని ఏర్పాటు చేసినట్లు హన్షిత చెప్పుకొచ్చింది. అనంతరం ఇందుకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ ఫొటోల్లో తల్లి విగ్రహాన్ని ప్రేమతో హత్తుకుని కనిపించింది హన్షిత. అలాగే ఆమె కూతురు ఇషితా, అమ్మమ్మతోనూ ఫొటోలు దిగింది. ఈ ఫొటోలకు ‘నాలుగు తరాలు’ అని క్రేజీ క్యాప్షన్ ఇచ్చింది.
ప్రస్తుత హన్షితా రెడ్డి షేర్ చేసిన ఫొటోలు నెట్టింట తెగ వైరలవుతున్నాయి. వీటిని చూసిన సినీ అభిమానులు, నెటిజన్లు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. ‘దిల్ రాజు కూతురికి అమ్మంటే ఎంత ప్రేమో!’ ఇంట్లోనే తల్లి విగ్రహం ఏర్పాటు చేయించుకుంది.. సో గ్రేట్’ అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు.
ఇంట్లో తల్లి విగ్రహంతో దిల్ రాజు కూతురు
View this post on Instagram
కాగా భార్య అనిత చనిపోయిన కొన్నాళ్ల పాటు ఒంటరిగానే కాలం గడిపారు దిల్ రాజు. అయితే లాక్ డౌన్ టైంలో తేజస్విని (వైఘా రెడ్డి) అనే అమ్మాయిని రెండో వివాహం చేసుకున్నారు. వీళ్లకు ఓ బాబు కూడా పుట్టాడు. ఇక సినిమాల విషయానికి వస్తే.. దిల్ రాజు నిర్మాతగా నితిన్ హీరోగా తమ్ముడు పేరుతో ఒక సినిమా తెరకెక్కుతోంది. వకీల్ సాబ్ ఫేమ్ డైరెక్టర్ వేణు శ్రీరామ్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.
భర్తతో..
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.







