AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Madhavi: మాతృదేవోభవ సినిమాలో కన్నీళ్లు పెట్టించిన నటి మాధవి.. ఇప్పుడేం చేస్తుందో, ఎలా మారిపోయిందో చూశారా?

ఇంటర్నేషనల్ మదర్స్ డే సందర్భంగా ఆదివారం (మే11) అందరూ తమకు జన్మనిచ్చిన తల్లులకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. చిన్నప్పటి నుంచి మాతృమూర్తులతో తమకున్న అనుబంధాన్ని మరోసారి గుర్తుకు తెచ్చుకుంటున్నారు. మరి మదర్స్ డే అంటే మనకు మొదటగా గుర్తొచ్చే తెలుగు సినిమా మాతృదేవోభవ.

Madhavi: మాతృదేవోభవ సినిమాలో కన్నీళ్లు పెట్టించిన నటి మాధవి.. ఇప్పుడేం చేస్తుందో, ఎలా మారిపోయిందో చూశారా?
Actress Madhavi
Basha Shek
|

Updated on: May 11, 2025 | 2:32 PM

Share

1993లో వచ్చిన మాతృదేవోభవ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. అజయ్ కుమార్ దర్శకత్వంలో తెరెకెక్కిన ఈ చిత్రంలో నటి మాధవి ప్రధాన పాత్ర పోషించింది. ఇక మరో కీలక పాత్రలో నాజర్ నటించాడు. అలాగే తనికెళ్ల భరణి, చారు హాసన్, వై. విజయ, నిర్మలమ్మ, కోట శ్రీనివాసరావు తదితరులు వివిధ పాత్రల్లో మెరిశారు. దురదృష్టవశాత్తూ భర్తను కోల్పోయి, క్యాన్సర్ సోకి తను కూడా కొద్ది రోజుల్లో మరణిస్తానని తెలుసుకొని తన ముగ్గురు బిడ్డల బంగారు భవిష్యత్తు కోసం ఒక మహిళ పడే తపన, ఆరాటమే ఈ మాతృదేవోభవ సినిమా. క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్ పై కే.ఎస్. రామారావు ఈ క్లాసిక్ సినిమాను నిర్మించారు. అయితే మాతృదేవోభవ సినిమా అంటే మనకు ముందుగా గుర్తొచ్చేది మాధవినే. ఈ అందాల తార అద్భుత నటనకు ఆడియెన్స్ ఫిదా అయిపోయారు. థియేటర్లలోనే కన్నీళ్లు పెట్టుకున్నారు. అంతలా ఆమె పాత్రకు ఆడియెన్స్ కనెక్ట్‌ అయ్యారు. 90వ దశకంలో తన అందం, అభినయంతో ఆడియెన్స్ ను అలరించిన హీరోయిన్లలో మాధవి కూడాఒకరు. మెగాస్టార్ చిరంజీవి, కమల్ హాసన్, రజనీకాంత్ వంటి స్టార్ హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకుందీ ఈ ముద్దుగుమ్మ . అలాగే అందం, అభినయంలో జయసుధ, జయప్రద వంటి స్టార్ హీరోయిన్స్ కు గట్టి పోటీ ఇచ్చింది. ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవికి అప్పట్లో ఫేవరెట్ హీరోయిన్ గా మారిపోయింది మాధవి. వీరి కాంబినేషన్ లో ఇంట్లో రామయ్య- వీధిలో కృష్ణయ్య, చట్టంతో పోరాటం, మరణశాసనం, రోషగాడు, కోతల రాయుడు, దొంగమొగుడు, కుక్క కాటుకు చెప్పు దెబ్బ, బిగ్ బాస్ వంటి సూపర్ హిట్ సినిమాలు వచ్చాయి. ఇక ఇండస్ట్రీ హిట్ ఖైదీ సినిమాలో ‘రగులుతోంది మొగలిపొద’ పాటకు చిరంజీవితో పోటీపడి మరీ డ్యాన్స్ చేసిందీ అందాల తార.

కాగా అప్పట్లోనే ఓ సినిమాలో బికినీలో కనిపించి కుర్రకారు మతులు పోగొట్టింది మాధవి. అదే సమయంలో మాతృదేవోభవ సినిమాలో తన నటనతో అందరితో కంటతడి పెట్టించిందీ అందాల తార. సుమారు 17 ఏళ్ల సినిమా కెరీర్ లో దాదాపు 300 సినిమాల్లో నటించింది మాధవి. ఇక సినిమాకెరీర్ పీక్స్‌లో ఉండగానే.. బిజినెస్‌మెన్ రాల్ఫ్ శర్మని 1996లో పెళ్లి చేసుకుంది మాధవి. ఆ తర్వాత భర్తతో కలిసి అమెరికాకు వెళ్లి అక్కడే స్థిర పడిపోయింది. ప్రస్తుతం ఈ దంపతులకు ముత్యాల్లాంటి ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు. పిల్లలు పెరిగి పెద్దగవడంతో ప్రస్తుతం భర్తకు సాయంగా బిజినెస్‌ వ్యవహరాలను చూసుకుంటోంది మాధవి.

Madhavi Family

Madhavi Family

సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ అప్పుడప్పుడూ ఇన్‌స్టాగ్రామ్‌లో తన ఫ్యామిలీ ఫొటోలు షేర్‌ చేస్తుంటుంది. ఇవి చూసిన నెటిజన్లు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పుడు మాతృదినోత్సవం సందర్భంగా మరోసారి మాధవి ఫొటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..