AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Balakrishna: తెలుగు జవాన్ వీర మరణం.. మురళీ నాయక్ కుటుంబానికి బాలకృష్ణ ఆర్థిక సాయం

పాకిస్తాన్‌తో జరుగుతున్న యుద్ధంలో మన తెలుగు బిడ్డ మురళీ నాయక్ ప్రాణాలు కోల్పోయాడు. శ్రీ సత్యసాయి జిల్లా, గోరంట్ల మండలానికి చెందిన మురళి నాయక్ జమ్మూకాశ్మీర్‌లోని నియంత్రణ రేఖ (ఎల్ఓసీ) వద్ద పాకిస్థాన్ సైన్యం జరిపిన కాల్పుల్లో తీవ్రంగా గాయపడి, అక్కడికక్కడే వీరమరణం పొందారు.

Balakrishna: తెలుగు జవాన్ వీర మరణం.. మురళీ నాయక్ కుటుంబానికి బాలకృష్ణ ఆర్థిక సాయం
Murali Naik, Balakrishna
Basha Shek
|

Updated on: May 11, 2025 | 11:59 AM

Share

జమ్మూకశ్మీర్ సరిహద్దుల్లో పోరాడుతూ వీరమరణం పొందాడు ఏపీ జవాన్ మురళీ నాయక్. శ్రీసత్యసాయి జిల్లా గోరంట్ల మండలం కల్లి తండాకు చెందిన అతను జమ్మూకశ్మీర్‌లోని ఎల్ఓసీ వద్ద పాకిస్థాన్ సైన్యం జరిపిన కాల్పుల్లో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఆదివారం (మే11) మురళీ నాయక్ స్వగ్రామంలో ఈ వీర జవాన్ అంత్యక్రియలు జరగనున్నాయి. జవాన్ వీర మరణం పట్ల ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రులు నారా లోకేష్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మురళీ నాయక్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. అలాగే ప్రభుత్వం తరఫున మంత్రి సవిత చేతుల మీదుగా రూ. 5 లక్షలు ఆర్థిక సాయం అందజేశారు. తాజాగా మురళీ నాయక్ కుటుంబానికి నందమూరి బాలకృష్ణ ఆర్థిక సాయం ప్రకటించారు. మురళీ నాయక్ కుటుంబానికి అండగా ఉండేందుకు తన వంతుగా ఒక నెల జీతాన్ని ఇస్తున్నట్లు నందమూరి బాలకృష్ణ ప్రకటించారు. మే 12వ తేదీ బాలకృష్ణ మురళీ నాయక్ స్వగ్రామం కల్లితండాకు బాలయ్య వెళ్లనున్నారు. జవాన్ కుటుంబ సభ్యులను పరామర్శించిన అనంతరం ఈ ఆర్థిక సాయాన్ని వారికి అందజేయనున్నారు.

మురళీ నాయక్ అంత్యక్రియల్లో పవన్ కల్యాణ్..

బాలకృష్ణతో పాటు ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు జవాన్లకు సంఘీభావంగా తన ఒక నెల జీతం రూ.2.17 లక్షలను నేషనల్ డిఫెన్స్ ఫండ్‌కు విరాళంగా ఇస్తున్నట్లు ప్రకటించారు. మరోవైపు మురళీ నాయక్ పార్థివ దేహాన్ని శనివారం స్వగ్రామానికి తీసుకువచ్చారు. బెంగళూరు ఎయిర్ పోర్ట్ నుంచి కల్లితండాకు తీసుకువస్తున్న సమయంలో జై జవాన్ జై జవాన్ అంటూ రోడ్డు పొడవునా జనం నివాళులు అర్పించారు. ఆదివారం మురళీ నాయక్‌ అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో నిర్వహించనున్నారు. కాగా ఏపీ డిప్యూటీ సీఎం మురళీ నాయక్ అంత్యక్రియల్లో పాల్గొననున్నారు. ఇప్పటికే ఆయన కల్లితండాకు చేరుకుని జవాన్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. వారికి ధైర్యం చెప్పి భరోసా ఇచ్చారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.