AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Robinhood OTT: ఓటీటీలోకి వచ్చేసిన నితిన్, శ్రీలీల కొత్త సినిమా.. వార్నర్ మామ కోసమైనా ఒకసారి ఈ మూవీ చూడాల్సిందే

యూత్ స్టార్ నితిన్ , గ్లామరస్ బ్యూటీ శ్రీలీల జంటగా నటించిన లేటెస్ట్ సినిమా రాబిన్ హుడ్. మార్చిలో థియేటర్లలో విడుదలైన ఓ మూవీ ఓ మోస్తరుగా ఆడింది. డేవిడ్ వార్నర్ ఈ మూవీలో ఓ స్పెషల్ అప్పియరెన్స్ ఇచ్చాడు. ఇప్పుడీ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది.

Robinhood OTT: ఓటీటీలోకి వచ్చేసిన నితిన్, శ్రీలీల కొత్త సినిమా.. వార్నర్ మామ కోసమైనా ఒకసారి ఈ మూవీ చూడాల్సిందే
Robinhood Movie
Basha Shek
|

Updated on: May 10, 2025 | 8:02 PM

Share

నితిన్, శ్రీలీల రెండోసారి జంటగా నటించిన చిత్రం రాబిన్ హుడ్. ఛలో, భీష్మ సినిమాలతో మంచి పేరు తెచ్చుకున్న వెంకీ కుడుమల ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. అలాగే ఆసీస్ డ్యాషింగ్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ ఓ కీలక పాత్ర పోషించాడు. దీనికి తోడు క్రేజీ హీరోయిన్ కేతిక శర్మ ఓ స్పెషల్ సాంగ్ లో కనిపించడం, అది కాస్తా కాంట్రవర్సీ కావడంతో రిలీజ్ కు ముందే రాబిన్ హుడ్ సినిమా వార్తల్లో నిలిచింది. అందుకు తగ్గట్టుగానే మార్చి 28న థియేటర్లలో రిలీజైన రాబిన్ హుడ్ సినిమా ఆడియెన్స్ అంచనాలు అందుకోలేకపోయింది. మొదటి షో నుంచే మిక్స్ డ్ టాక్ వచ్చింది. ఆ తర్వాత ఆ టాక్ అలాగే కంటిన్యూ కావడంతో మూవీ ఫ్లాప్ గా నిలిచింది. మైత్రీ మూవీ మేకర్స్ ఈ మూవీకి భారీ బడ్జెట్ వెచ్చించినా పెద్దగా కలెక్షన్లు రాలేదు. సినిమాలో నితిన్- శ్రీలీల జోడీ ఆకట్టకున్నా కథా, కథనాలు ఆడియెన్స్ ను బాగా డిజప్పాయింట్ చేశాయి. ఇక డేవిడ్ వార్నర్ కూడా కొద్ది సేపు మాత్రమే కనిపించడం సినిమాకు మైనస్ అయ్యింది. మొత్తానికి థియేటర్లలో సోసోగా ఆడింది రాబిన్ హుడ్. చాలా మంది ఓటీటీలో ఈ సినిమాను చూద్దామని ఫిక్స్ అయ్యారు. అలాంటి వారి కోసమే ఇప్పుడీ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ కు వచ్చేసింది.

రాబిన్ హుడ్ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులు, శాటిలైట్ హక్కులను జీ5, జీ5 తెలుగు సొంతం చేసుకున్నాయి. మే 10న సాయంత్రం 6 గంటలకు ఈ సినిమా ‘జీ తెలుగు’ ఛానల్‌తో పాటు జీ5 ఓటీటీలోనూ ఈ మూవీ ప్రసారం కానుందని ఇది వరకే అధికారిక ప్రకటన వెలువడింది. అందుకు తగ్గట్టుగానే రాబిన్ హుడ్ సినిమా ఒకేసారి జీ5 ఓటీటీతో పాటు జీ5 తెలుగు ఛానెల్ లో ప్రసారమవుతోంది.

ఇవి కూడా చదవండి

జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

రూ.60,000 కంటే తక్కువ ధరకే ఐఫోన్ 16.. అదిరిపోయే డీల్‌!
రూ.60,000 కంటే తక్కువ ధరకే ఐఫోన్ 16.. అదిరిపోయే డీల్‌!
నిజమైన సంతోషం ఎందులో ఉంది.. 85 ఏళ్ల పరిశోధనలో తేలిన అసలు రహస్యం..
నిజమైన సంతోషం ఎందులో ఉంది.. 85 ఏళ్ల పరిశోధనలో తేలిన అసలు రహస్యం..
87 ఏళ్లకు తండ్రి అయిన కోటీశ్వరుడు.. కట్ చేస్తే..
87 ఏళ్లకు తండ్రి అయిన కోటీశ్వరుడు.. కట్ చేస్తే..
ఇప్పుడే కొనేయండి.. 2026లో బంగారం ధర ఎంత పెరుగుతుందో అస్సలు
ఇప్పుడే కొనేయండి.. 2026లో బంగారం ధర ఎంత పెరుగుతుందో అస్సలు
పొగాకు అలవాటు లేకపోయినా.. వీరికి నోటి క్యాన్సర్ పక్కా!
పొగాకు అలవాటు లేకపోయినా.. వీరికి నోటి క్యాన్సర్ పక్కా!
నావికా స్థావరానికి.. చైనా జీపీఎస్ ట్రాకర్‌ ఉన్న గూఢాచార పక్షి
నావికా స్థావరానికి.. చైనా జీపీఎస్ ట్రాకర్‌ ఉన్న గూఢాచార పక్షి
సినిమాలు హిట్టు.. అయినా సర్జరీ కోసం బలవంతం చేశారు..
సినిమాలు హిట్టు.. అయినా సర్జరీ కోసం బలవంతం చేశారు..
ఈ వాస్తు సూత్రాలు పాటించారంటే.. మీ జీతానికి రెక్కలు వచ్చినట్టే..
ఈ వాస్తు సూత్రాలు పాటించారంటే.. మీ జీతానికి రెక్కలు వచ్చినట్టే..
హైవేపై 100కి.మీ స్పీడ్‌లో ఉన్న కారు బ్రేకులు ఫెయిల్‌ అయ్యాయా?ఎలా?
హైవేపై 100కి.మీ స్పీడ్‌లో ఉన్న కారు బ్రేకులు ఫెయిల్‌ అయ్యాయా?ఎలా?
ఈఎంఐ, క్రెడిట్ కార్డ్ రుణాలు చెల్లించలేకపోతున్నారు? కారణాలు ఇవే..
ఈఎంఐ, క్రెడిట్ కార్డ్ రుణాలు చెల్లించలేకపోతున్నారు? కారణాలు ఇవే..