AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

India Pakistan War: ‘సినిమా కలెక్షన్లలో కొంత భాగం మన సైనికులకే’.. గొప్ప మనసు చాటుకున్న నిర్మాత అల్లు అరవింద్

భారత్- పాక్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు తలెత్తిన వేళ.. ప్రముఖ నిర్మాత, అల్లు అరవింద్ గొప్ప మనసు చాటుకున్నారు. మన సైనికులకు అండగా ఉంటానని మాటిచ్చిన ఆయన తన లేటెస్ట్ మూవీ వసూళ్ల నుంచి వచ్చే లాభాల్లో కొంత భాగం వారికే విరాళంగా ఇస్తానని ప్రకటించారు.

India Pakistan War: 'సినిమా కలెక్షన్లలో కొంత భాగం మన సైనికులకే'.. గొప్ప మనసు చాటుకున్న నిర్మాత అల్లు అరవింద్
Allu Aravind
Basha Shek
|

Updated on: May 10, 2025 | 3:21 PM

Share

భారత్- పాక్ ల మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. ఇరు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆపరేషన్ సిందూర్ తర్వాత పాకిస్తాన్ నుంచి కూడా ప్రతి దాడులు మొదలయ్యాయి. సరిహద్దు గ్రామాలే లక్ష్యంగా దాయాది దేశం దాడులు చేస్తోంది. అయితే భారత సైన్యం ఈ దాడులను విజయవంతంగా తిప్పికొడుతోంది. ఈ నేపథ్యంలో భారత సైన్యానికి మద్దతుగా పలువురు సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు సోషల్ మీడియాలో పోస్టులు షేర్ చేస్తున్నారు. పాక్ ను గట్టి దెబ్బ తీయాలంటూ కోరుతున్నారు. ఈ నేపథ్యంలో టాలీవుడ్ ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ తన పెద్ద మనస్సు చాటుకున్నారు. ఆయన నిర్మించిన తాజా చిత్రం సింగిల్. శ్రీ విష్ణు, కేతిక, ఇవానా హీరో హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం శుక్రవారం (మే09) థియేటర్లలోకి వచ్చింది. మొదటి షో నుంచే సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. దీంతో చిత్ర బృందం సక్సెస్ మీట్ నిర్వహించింది. ఈ సందర్భంగా మాట్లాడిన అల్లు అరవింద్

‘ సైనికులకు ఎప్పుడూ మా సపోర్ట్ ఉంటుంది. వారి త్యాగం, ధైర్యం మన దేశ భద్రతకు రక్షణ కవచంలా నిలుస్తాయి. సింగిల్ సినిమా వసూళ్ల నుంచి వచ్చిన లాభాల్లో కొంత భాగాన్ని భారత సైనికుల సంక్షేమం కోసం విరాళంగా అందించాలని నిర్ణయించుకున్నాం. మన సైనికులు దేశం కోసం తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పోరాడుతున్నారు. వారికి మనం ఏదో ఒక రూపంలో సాయం చేయాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. అందుకే సింగిల్ సినిమా విజయం సాధించిన సందర్భంగా, మేం ఈ చిన్న సాయం చేయాలని నిర్ణయించాము. భారత్ మాతాకీ జై’ అని అల్లు అరవింద్ గట్టిగా నినదించారు. దీంతో అక్కడున్న వారు గట్టిగా చప్పట్లు కొడుతూ అల్లు అరవింద్ ను అభినందించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్