AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vijay Deverakonda: పాక్‌తో యుద్ధం..’నేను సైతం’ అంటూ ఇండియన్ ఆర్మీకి విజయ్ దేవరకొండ సాయం.. ఏం చేశాడో తెలుసా?

భారత్, పాకిస్తాన్ దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రెండు దేశాల మధ్య భీకర యుద్ధం కొనసాగుతోంది. పాకిస్తాన్ దాడులను భారత సాయుధ దళాలు విజయవంతంగా తిప్పికొడుతున్నాయి. ఈ క్రమంలో టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ గొప్ప మనసు చాటుకున్నాడు.

Vijay Deverakonda: పాక్‌తో యుద్ధం..'నేను సైతం' అంటూ ఇండియన్ ఆర్మీకి  విజయ్ దేవరకొండ సాయం.. ఏం చేశాడో తెలుసా?
Vijay Deverakonda
Basha Shek
|

Updated on: May 09, 2025 | 4:39 PM

Share

పాకిస్తాన్ తో యుద్ధం వేళ ఇండియ‌న్ ఆర్మీ ధైర్య‌సాహ‌సాలను మెచ్చుకుంటూ సినీ, క్రీడా ప్రముఖులు సోషల్ మీడియాలో పోస్టుల పెడుతున్నారు. పాక్ కుటిల‌త్వాన్ని దెబ్బ‌తీస్తున్న తీరును మెచ్చుకుంటూ సైనికులకు సలామ్ చేస్తున్నారు. భార‌త్ మాతాకీ జై అంటూ ఇండియ‌న్ ఆర్మీకి అండ‌గా నిలుస్తున్నారు. ‘మీతో పాటు మేమున్నాం ధైర్యంగా ముందుకు సాగండి’ అంటూ మోటివేషనల్ పోస్టులు షేర్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ గొప్ప మనసు చాటుకున్నాడు. భారత సైన్యానికి అండగా తానున్నాంటూ అతను షేర్ చేసిన పోస్ట్ ప్ర‌స్తుతం నెట్టింట వైర‌ల్‌గా మారింది. ‘నాట్ జ‌స్ట్ మేడ్ ఇన్ ఇండియా, మేడ్ ఫ‌ర్ ఇండియా` రాబోయే వారాల‌కు `రౌడీ బ్రాండ్ అమ్మ‌కాల్లో కొంత భాగాన్ని భార‌త సాయుధ ద‌ళాల‌కు విరాళంగా అందిస్తాం. జై హింద్.. మీ విజ‌య్‌` అంటూ విజ‌య్ దేవ‌ర‌కొండ సోష‌ల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టాడు. ప్రస్తుతం ఇది నెట్టింట వైరల్ గా మారింది. పాకిస్తాన్ తో యుద్ధం జ‌రుగుతున్న వేళ విజయ్ దేవర కొండ గొప్ప మనసుతో ఇలా ముందుకు రావ‌డం అభినందనీయమంటూ సినీ అభిమానులు, నెటిజన్లు విజ‌య్ దేవ‌ర‌కొండ‌పై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపిస్తున్నారు.

విజయ్ దేవరకొండతో పాటు దర్శక ధీరుడు రాజమౌళి, రష్మిక మందన్నా, శోభిత ధూళిపాళ్ల, కొణిదెల ఉపాసన తదితర ప్రముఖులు భారత సైన్యానికి మద్దతుగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. ‘ఒకవేళ భారత సైనిక చర్యలను చూస్తే.. ఫొటోలు, వీడియోలు తీయొద్దు. వాటిని సోషల్‌ మీడియాలో షేర్‌ చేయొద్దు. అలా చేస్తే.. శత్రువుకు సాయం చేసినట్టే. అనధికారిక ప్రకటనలు, అసత్య ప్రచారం నమ్మకండి’ అని రాజమౌళి ట్వీట్ చేశారు.

ఇవి కూడా చదవండి

ఎస్. ఎస్. రాజమౌళి ట్వీట్..

శాంతిని కోరుకోవడమంటే.. హానిని అంగీకరించడం కాదని రష్మిక మందన్నా పేర్కొంది. భారత్‌- పాకిస్థాన్‌ల మధ్య ఉద్రిక్తత నేపథ్యంలో ఆమె పోస్ట్‌ వైరల్‌గా మారింది. అన్యాయానికి బదులు తీర్చుకునే దేశాన్ని ప్రశ్నించవద్దంటూ తన ఇన్‌స్టా స్టోరీలో రాసుకొచ్చింది రష్మిక .

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్