AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Actress Laya: సినిమాల్లోకి నటి లయ కూతురు! ఏకంగా బాలయ్య సినిమాలో ఛాన్స్! శ్లోకా లేటెస్ట్ ఫొటోస్ చూశారా?

సీనియర్ హీరోయిన్ లయ గురించి తెలుగు ఆడియెన్స్ కు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. చేసింది తక్కువ సినిమాలే అయినా తనదైన అందం, అభినయంతో టాలీవుడ్ లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇటీవలే సెకెండ్ ఇన్నింగ్స్ కూడా షురు చేసిందీ అందాల తార.

Actress Laya: సినిమాల్లోకి నటి లయ కూతురు! ఏకంగా బాలయ్య సినిమాలో ఛాన్స్! శ్లోకా లేటెస్ట్ ఫొటోస్ చూశారా?
Actress Laya
Basha Shek
|

Updated on: May 08, 2025 | 4:29 PM

Share

టాలీవుడ్ లో సీనియర్ హీరోయిన్ లయది ప్రత్యేక స్థానం. చాలామంది హీరోయిన్లు గ్లామరస్ రోల్స్ తో మెప్పిస్తే ఈ అందాల తార మాత్రం హోమ్లీ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది. వేణు తొట్టెంపూడి హీరోగా నటించిన స్వయంవరం సినిమాతో తెలుగు తెరకుపరిచయమైంది లయ. మొదటి సినిమాతోనే అందం, అభినయంతో తెలుగు వారికి చేరువైంది. ఆ తర్వాత మా బాలాజీ, మనోహరం, మనసున్న మారాజు, కోదండ రాముడు, దేవుళ్లు, రామా చిలుకమ్మ, హనుమాన్ జంక్షన్, ప్రేమించు, శివరామరాజు, నీ ప్రేమకై, మిస్సమ్మ, స్వరాభిషేకం, అదిరిందయ్యా చంద్రం తదితర హిట్ సినిమాల్లో హీరోయిన్ గా నటించింది. కాగా స్టార్ హీరోయిన్‌గా రాణిస్తున్న టైంలోనే పెళ్లి చేసుకుని సినిమాలకు దూరం అయింది లయ. 2006లో అమెరికాకు చెందిన డాక్టర్ శ్రీ గణేశన్ ను వివాహం చేసుకుంది లయ. ఆ తర్వాత భర్తతో కలిసి అమెరికాలో సెటిల్ అయ్యింది. లయ దంపతులకు పాప, బాబు ఉన్నారు. ఇప్పుడు పిల్లలు పెరిగి పెద్దవారు కావడంతో సినిమాల్లో సెకెండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది. నితిన్ హీరోగా నటిస్తోన్న తమ్ముడు సినిమాలో లయ ఓ కీలక పాత్ర పోషిస్తోంది. అలాగే జబర్దస్త్ టీవీ షోలోనూ జడ్జిగా వ్యవహరిస్తోంది లయ.

ఇవి కూడా చదవండి

ఇప్పుడు క్రేజీ న్యూస్ ఏంటంటే.. లయ కూతురు శ్లోకా కూడా సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టనుంది. గతంలో మాస్ మాహారాజా రవితేజ నటించిన అమర్ అక్బర్ ఆంటోని సినిమాలో ఇలియానా చిన్నప్పటి పాత్రలో శ్లోక నటించింది. ఇప్పుడు ఏకంగా బాలయ్య మూవీలో శ్లోకాకు ఛాన్స్ వచ్చిందని సమాచారం. బోయపాటి శ్రీను డైరెక్షన్‌లో నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తున్న సినిమా అఖండ 2. ఇందులో ఒక చిన్న పాప ఆడియెన్స్ ను బాగా బాగా ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు అదే పాత్రను సీక్వెల్‌లో కంటిన్యూ చేస్తున్నారట. ఇందు కోసం లయ కూతురు శ్లోకాను ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. ప్రస్తుతానికి ఇది కేవలం రూమర్ మాత్రమే. ఒక వేళ ఇదే నిజమైతే లయ కూతురును కూడా సిల్వర్ స్క్రీన్ పై చూసే అవకాశం దక్కనుంది. ప్రస్తుతం ఈ క్రేజీ న్యూస్ నెట్టింట వైరలవుతోంది. ఇదే క్రమంలో శ్లోకా ఫొటోస్ నెట్టింట తెగ చక్కర్లు కొడుతున్నాయి.

 నటి లయ ఫ్యామిలీ ఫొటోస్..

View this post on Instagram

A post shared by Laya Gorty (@layagorty)

చిన్నతనంలో శ్లోకా..

View this post on Instagram

A post shared by Laya Gorty (@layagorty)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్