AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Santhoshi Srikar: ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’ పనిమనిషి గుర్తుందా? ఇప్పుడు బోటిక్ బిజినెస్‌తో బిజి బిజీగా..

సిద్ధార్థ్, త్రిష హీరో, హీరోయిన్లుగా నటించిన సూపర్ హిట్ సినిమా నువ్వొస్తానంటే నేనొద్దంటానా. ఈ మూవీలో శ్రీహరి ఇంట్లో పని మనిషిగా సంతోషి శ్రీకర్ అద్భుతంగా నటించింది. ఈ సినిమాలో తన నటనకు గానూ బెస్ట్ ఫీమేల్ కమెడియన్ క్యాటగిరీలో నంది అవార్డు కూడా రావడం విశేషం.

Santhoshi Srikar: ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’ పనిమనిషి గుర్తుందా? ఇప్పుడు బోటిక్ బిజినెస్‌తో బిజి బిజీగా..
Santhoshi Srikar
Basha Shek
|

Updated on: May 07, 2025 | 11:59 AM

Share

పెళ్లి, పిల్లల తర్వాత చాలా మంది హీరోయిన్లు, నటీమణులు సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉండిపోతారు. భర్త, పిల్లలతోనే ఎక్కువ సమయం గడిపేస్తారు. ఇంకొందరు సెకెండ్ ఇన్నింగ్స్ అంటూ మళ్లీ సినిమాల్లోకి అడుగు పెడతారు. మరికొందరైతే వివిధ రకాల బిజినెస్ వ్యవహారాల్లో బిజీగా ఉండిపోతారు. నటి సంతోషి శ్రీకర్ కూడా సరిగ్గా ఇదే కోవకు చెందుతుంది. తేజ దర్శకత్వంలో నవదీప్ హీరోగా తెరకెక్కిన ప్రేమ కథా చిత్రం జై తో సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిందీ అందాల తార. ఇందులో ఫరా అనే ముస్లిం అమ్మాయి పాత్రలో అప్పటి యువత హృదయాలను కొల్లగొట్టిందీ అందాల తార. ఆ తర్వాత నువ్వొస్తానంటే నేనొద్దంటానా సినిమాలో సహాయ నటిగా నటించింది. శ్రీహరి, త్రిషల ఇంట్లో పని చేసే అమ్మాయి పాత్రలో అద్భుతంగా నటించింది. ఎవరైనా ‘జాగ్రత్త’ అంటే చాలు.. కంగారు పడి చేతిలోని వస్తువులు గబుక్కున కింద పడేస్తూ ఆడియెన్స్ ను కడుపుబ్బా నవ్వించింది సంతోషి. సినిమాలో తన ఎక్స్ ప్రెషన్స్, డైలాగులు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ సినిమాలో తన నటనకు గానూ బెస్ట్ ఫీమేల్ కమెడియన్ గా నంది అవార్డు కూడా అందుకుందీ అందాల తార.

సంతోషి ప్రముఖ తమిళ సినీ నటి పూర్ణిమ కూతురు. ఈ విషయం చాలా మందికి తెలీదు. సీనియర్ నటుడు ప్రసాద్ బాబు కోడలు కూడా నువ్వొస్తానంటే నేనొద్దంటానా సినిమా తర్వాత శ్రీహరి ఒక్కడే, పవన్ కల్యాణ్ బంగారం, మంచు విష్ణు ఢీ తదితర చిత్రాల్లో కూడా నటించింది సంతోషి శ్రీకర్. అయితే ఎక్కువగా క్యారెక్టర్ ఆర్టిస్టు పాత్రలే రావడంతో ఈ బ్యూటీకి పెద్దగా క్రేజ్ రాలేదు. తమిళంలో 2 ,3 సినిమాలు చేసినా అవి కూడా సక్సెస్ కాలేదు. పెళ్లి తర్వాత సినిమాలకు పూర్తిగా దూరమైంది సంతోషి. ప్రస్తుతం బోటిక్ అండ్ బ్యూటీ లాంగ్ పేరుతో బిజినెస్ రన్ చేస్తోంది. చెన్నై, రాజమండ్రి, హైదరాబాద్ తదితర నగరాల్లో సంతోషి శ్రీకర్ బొటిక్స్ ఉన్నాయి. బోటిక్ తో పాటు మేకప్ క్లాసెస్, శారీ డ్రాపింగ్ తదితర ఫ్యాషన్ డిజైనింగ్ అంశాలకు సంబంధించి మహిళలకు శిక్షణ కూడా ఇస్తోంది అందాల తార.

ఇవి కూడా చదవండి

 సంతోషి శ్రీకర్ లేటెస్ట్ ఇన్ స్టా గ్రామ్ పోస్ట్..

సంతోషి శ్రీకర్ ఎప్పటికప్పుడు తన ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తోంది. వీటిని చూసిన నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. గతంలో కంటే కాస్త బొద్దుగా మారినా అందం విషయంలో మాత్రం సంతోషి ఏ మాత్రం మారలేదంటూ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
సమంత ప్రెగ్నెంట్ అని తెలిసిన తర్వాత తీసిన సన్నివేశాలు ఇవే..
సమంత ప్రెగ్నెంట్ అని తెలిసిన తర్వాత తీసిన సన్నివేశాలు ఇవే..
ఇంట్లో పాలు విరిగి పోవటం శాపం కాదు.. అద్భుతమైన వరం..! ఎందుకంటే..
ఇంట్లో పాలు విరిగి పోవటం శాపం కాదు.. అద్భుతమైన వరం..! ఎందుకంటే..
'నాకు చదువుకోవాలని ఉంది..' వేడుకుంటున్న బాలుడు!
'నాకు చదువుకోవాలని ఉంది..' వేడుకుంటున్న బాలుడు!
తప్పులన్నీ గంభీర్‌వి.. తిట్లన్నీ శ్రేయస్ అయ్యర్‌కా?
తప్పులన్నీ గంభీర్‌వి.. తిట్లన్నీ శ్రేయస్ అయ్యర్‌కా?
భార్యాభర్తల దగ్గర ఈ సర్టిఫికేట్ ఉండాల్సిందే.. లేదంటే..
భార్యాభర్తల దగ్గర ఈ సర్టిఫికేట్ ఉండాల్సిందే.. లేదంటే..
6 బ్యాంకులకు భారీ జరిమానా.. మరో బ్యాంక్ లైసెన్స్ రద్దు చేసిన RBI
6 బ్యాంకులకు భారీ జరిమానా.. మరో బ్యాంక్ లైసెన్స్ రద్దు చేసిన RBI
పంట పొలంలో నాగలికి తాకి బయటపడ్డ బంగారపు నిధులు.. ఆ తర్వాత
పంట పొలంలో నాగలికి తాకి బయటపడ్డ బంగారపు నిధులు.. ఆ తర్వాత
మరీ ఇలా తయారయ్యారేంట్రా బాబు,రైల్లోనే కిచెన్ ఓపెన్ చేసి నానా రచ్చ
మరీ ఇలా తయారయ్యారేంట్రా బాబు,రైల్లోనే కిచెన్ ఓపెన్ చేసి నానా రచ్చ
చావు అంచుల నుంచి మత్స్యకారులను కాపాడిన కోస్డ్ గార్డ్!
చావు అంచుల నుంచి మత్స్యకారులను కాపాడిన కోస్డ్ గార్డ్!
అప్పట్లో వేప చెట్టు కింద కూర్చొని ఈ వడలనే తినేవాళ్లు.. భలే చలువ
అప్పట్లో వేప చెట్టు కింద కూర్చొని ఈ వడలనే తినేవాళ్లు.. భలే చలువ