OTT Movie: స్పీడ్ తగ్గితే బుల్లెట్ ట్రైన్ బ్లాస్ట్.. ఓటీటీలో మెంటలెక్కించే థ్రిల్లర్.. తెలుగులోనూ చూడొచ్చు
సాధారణంగా బుల్లెట్ ట్రైన్ అనగానే మనకు జపాన్, చైనా దేశాలు గుర్తొస్తుంటాయి. నిమిషానికి వందల కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లే ఈ హై స్పీడ్ ట్రైన్లు త్వరలోనే మన దేశంలో కూడా పట్టాలెక్కనున్నాయి. కాగా ఈ బుల్లెట్ ట్రైన్ ఆధారంగా తీసిన ఓ యాక్షన్ థ్రిల్లర్ మూవీ ఓటీటీలో అదరగొడుతోంది.

థియేటర్లలో విడుదలైన సినిమాలు నెల రోజులకే ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి. దీంతో థియేటర్లలో చూడలేని వారు లేకపోతే మరోసారి చూడాలనుకున్నవారు ఎంచెక్కా ఇంట్లోనే తమకు నచ్చిన సినిమాలను చూసేయవచ్చు. అలా ఇటీవల థియేటర్లలో ఆడియెన్స ను థ్రిల్ చేసిన ఓ సూపర్ హిట్ మూవీ ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది. ఇది ఒక జపనీస్ మూవీ. కానీ ఓటీటీలో మాత్రం జపనీస్‍తో పాటు ఇంగ్లిష్, తెలుగు, తమిళం, హిందీ భాషల్లోనూ స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమా ఒక బుల్లెట్ ట్రైన్ తో మొదలవుతుంది. టోక్యోకు బయలుదేరిన హయబుసా నం. 60 అనే బుల్లెట్ ట్రైన్ లో కొందరు గుర్తు తెలియని ఆగంతకులు ఒక బాంబ్ ను అమరుస్తారు. ట్రైన్ వేగం గంటకు 100 కిలోమీటర్ల కంటే తగ్గితే పేలిపోయే విధంగా ఈ బాంబ్ ను సెట్ చేస్తారు. ఈ విషయాలేవీ తెలియని 300 మందికి పైగా ప్రయాణికులు ఈ బుల్లెట్ ట్రైన్ లోకి ఎక్కుతారు. ఈ క్రమంలోనే బాంబర్ తన డిమాండ్లను చెబుతాడు. 100 బిలియన్ యెన్ (జపాన్ డబ్బులు) ఇస్తేనే బాంబును ఎలా డిఫ్యూజ్ చేయాలో చెబుతానని డిమాండ్ చేస్తాడు. తాను చెబుతున్నది నిజమని నిరూపించడానికి మరో ట్రైన్‌లో ఉన్న మరో బాంబును పేల్చి చూపిస్తాడు. దీంతో ప్రేక్షకులు తెగ భయపడిపోతారు. ఆందోళనకు గురవుతారు. ఓవైపు ట్రైన్ సిబ్బంది, రైల్వే అధికారులు ఈ సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తుంటే మరోవైపు ప్రయాణీకుల మధ్య గొడవ మొదలవుతుంది. మరి చివరకు ఆ ట్రైన్ లోని ప్రయాణికులు బతికి బట్టకట్టారా? లేదా? బుల్లెట్ ట్రైన్ లో బాంబ్ పెట్టింది ఎవరు? చివరకు ఏం జరిగిందో తెలియాలంటే ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీ చూడాల్సిందే.
ఇంతవరకు మనం చెప్పుకున్న సినిమా పేరు బుల్లెట్ ట్రైన్ ఎక్స్‌ప్లోజన్. ఈ సినిమాకు ఓటీటీలో సూపర్బ్ రెస్పాన్స్ వస్తోంది. ఈ సినిమాను చూసిన వారు కొందరు తమ అభిప్రాయాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. బుల్లెట్ ట్రైన్ లాగే ఈ మూవీ చాలా థ్రిల్లింగ్ గా ఉందని కామెంట్స్ చేస్తున్నారు. ట్విస్టులు, సస్పెన్స్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ పుష్కలంగా ఉన్నాయంటున్నారు. ఇక గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే ఈ మూవీకి మరో ప్లస్ పాయింట్ అని చెబుతున్నారు.
బుల్లెట్ ట్రైన్ ఎక్స్‌ప్లోజన్ మూవీ ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది. జపనీస్ తో పాటు తెలుగు, హిందీ, ఇంగ్లిష్ తమిళం భాషల్లోనూ ఈ మూవీ అందుబాటులో ఉంది.
బుల్లెట్ ట్రైన్ ఎక్స్‌ప్లోజన్ మూవీ ఓపెనింగ్ సీన్..
The opening sequence of Bullet Train Explosion goes crazy.
Based on the 1975 film “The Bullet Train” and from director Shinji Higuchi. Now playing. pic.twitter.com/kQnBr6tCfy
— Netflix (@netflix) April 23, 2025
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.