రిలేషన్ షిప్ పై ఓపెన్ అయిన కయాదు లోహర్.. ఏం చెప్పిందంటే.. 

Rajitha Chanti

Pic credit - Instagram

16 March 2026

ఒకే ఒక్క సినిమాతో రాత్రికి రాత్రే స్టార్ అయిన హీరోయిన్స్ చాలా మంది ఉన్నారు. అందులో కయాదు లోహర్ ఒకరు. తక్కువ సమయంలోనే విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంది. 

డ్రాగన్ సినిమాతో ఒక్కసారిగా సౌత్ ఇండస్ట్రీలో పాపులర్ అయ్యింది. ప్రస్తుతం దక్షిణాది కుర్రవాళ్లకు క్రష్ గా మారింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన రిలేషన్ షిప్ గురించి చెప్పింది. 

తాను ప్రస్తుతానికి నటనకు, వృత్తికి కమిటైపోయానని.. ఇప్పుడు తాను సింగిల్ అని.. తనపై వస్తున్న రూమర్స్ నిజం కాదని అన్నారు. దీంతో ఇప్పుడు కయాదు లోహర్ కామెంట్స్ వైరలవుతున్నాయి.

2000లో జన్మించిన ఈ ముద్దుగుమ్మ.. చదువు పూర్తి కాగానే మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టింది. కొన్ని ఫ్యాషన్ షోలు, యాడ్స్ చేసి ఆ తర్వాత ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది ఈ భామ.

కన్నడ సినిమా ముగిళ్ పెటే మూవీతో వెండి తెరకు పరిచయమైంది. ఆ తర్వాత మలయాళంలో పతోన్ పతమ్ నూట్టండులో నటించింది. ఇందులో తన నటనకుగాను మంచి గుర్తింపు తెచ్చుకుంది.

కింగ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ శ్రీవిష్ణు హీరోగా వచ్చిన అల్లూరి మూవీతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. ఇందులో తన గ్లామరస్ లుక్స్ తో కట్టిపడేసింది. తర్వాత మరో సినిమా చేయలేదు. 

తమిళంలో ప్రదీప్ రంగనాథన్ తెరకెక్కించిన డ్రాగన్ సినిమాలో నటించింది. ఈ మూవీతో సౌత్ ఇండస్ట్రీలో ఒక్కసారిగా పాపులర్ అయ్యింది. దీంతో సౌత్ లో ఆఫర్స్ క్యూ కట్టాయి.

ప్రస్తుతం తెలుగు, తమిళంలో వరుస సినిమాలతో బిజీగా ఉంది ఈ అమ్మడు. అలాగే సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ నిత్యం క్రేజీ ఫోటోషూట్లతో నెటిజన్లను ఆకట్టుకుంటుంది.