AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Actress Prathyusha Case: కోర్టులో లొంగిపోయిన నటి ప్రత్యూష కేసు నిందితుడు..

ప్రత్యూష కేసులో సుప్రీంకోర్టు ఆదేశాలతో నాంపల్లి కోర్టులో లొంగిపోయాడు నిందితుడు సిద్ధార్ధ్‌రెడ్డి. ఇన్నేళ్లుగా అమెరికాలో స్థిరపడిన సిద్ధార్థ్‌ రెడ్డి.. 24 ఏళ్ల తర్వాత టీవీ9 కెమెరాకు చిక్కాడు. 2002 ఫిబ్రవరి 23న కూల్‌డ్రింక్‌లో పురుగుల మందు కలుపుకుని తాగారు సిద్ధార్థ రెడ్డి, ప్రత్యూష. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రత్యూష మృతి చెందగా..సిద్ధార్థ్ రెడ్డి కోలుకున్నాడు.

Actress Prathyusha Case: కోర్టులో లొంగిపోయిన నటి ప్రత్యూష కేసు నిందితుడు..
Prathyusha Case
Rajeev Rayala
|

Updated on: Mar 16, 2026 | 8:19 PM

Share

ప్రత్యూష కేసులో సుప్రీంకోర్టు ఆదేశాలతో నాంపల్లి కోర్టులో లొంగిపోయాడు నిందితుడు సిద్ధార్ధ్‌రెడ్డి. ఇన్నేళ్లుగా అమెరికాలో స్థిరపడిన సిద్ధార్థ్‌ రెడ్డి.. 24 ఏళ్ల తర్వాత టీవీ9 కెమెరాకు చిక్కాడు. 2002 ఫిబ్రవరి 23న కూల్‌డ్రింక్‌లో పురుగుల మందు కలుపుకుని తాగారు సిద్ధార్థ రెడ్డి, ప్రత్యూష. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రత్యూష మృతి చెందగా..సిద్ధార్థ్ రెడ్డి కోలుకున్నాడు. అయితే ప్రత్యూషది ఆత్మహత్య కాదు హత్యేనంటూ ఆమె తల్లి న్యాయపోరాటం చేశారు. ప్రత్యూష ఆత్మహత్యకు ప్రేరేపించిన అభియోగాలపై ట్రయల్ కోర్టు సిద్ధార్థ్‌రెడ్డికి ఐదేళ్ల జైలు శిక్ష విధించింది. అయితే ఆ తర్వాత శిక్షాకాలాన్ని రెండేళ్లకు తగ్గించింది హైకోర్టు.

హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంని ఆశ్రయించాడు సిద్ధార్థ్‌. హైకోర్టు తీర్పును సమర్థిస్తూ తీర్పు ఇచ్చింది సుప్రీం. ప్రత్యూష ఆత్మహత్యకు సిద్ధార్థ్ రెడ్డి ప్రేరేపించినట్లుగా నిర్ధారించిన కోర్టు.. నాలుగు వారాల్లో లొంగిపోవాలని ఇటీవల ఆదేశాలు జారీ చేసింది. దాంతో ఈ రోజు కోర్టులో లొంగిపోయాడు సిద్ధార్ద్ రెడ్డి.. ఇటీవల సుప్రీంకోర్టు తీర్పు అనంతరం టీవీ9తో మాట్లాడారు ప్రత్యూష తల్లి సరోజిని.

ఆ రోజు ఆస్పత్రిలోనే చాలా అన్యాయం జరిగిందన్నారు.. ఫిబ్రవరి 23న వెళ్లి చూసేసరికి ఆమె గొంతుపై గాట్లు కనిపించాయన్నారు. ఆమె దుస్తులను కూడా ఆస్పత్రి వారు కాల్చేయడం షాకింగ్‌ అన్నారు సరోజిని. ప్రత్యూష చనిపోయిన సమయంలో తనకు చాలా బెదిరింపులు వచ్చాయన్నారు ఆమె తల్లి. వారిద్దరు ప్రేమించుకున్న సమయంలో సిద్ధార్థను నమ్మానని.. అయితే అతడి మెంటాలిటీ ఇంత క్రూయల్‌ అనుకోలేదన్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
రోహిత్ సెంచరీ సెలబ్రేషన్స్ వెనుక సీక్రెట్ ఇదే..?
రోహిత్ సెంచరీ సెలబ్రేషన్స్ వెనుక సీక్రెట్ ఇదే..?
13 ఏళ్ల తర్వాత ఓటీటీలో దుమ్మురేపుతున్న సినిమా..
13 ఏళ్ల తర్వాత ఓటీటీలో దుమ్మురేపుతున్న సినిమా..
నొప్పి, జ్వరానికి సొంతంగా మందులు వేసుకుంటున్నారా? CDSCO హెచ్చరిక
నొప్పి, జ్వరానికి సొంతంగా మందులు వేసుకుంటున్నారా? CDSCO హెచ్చరిక
స్కూటీ బ్రేక్ హ్యాండిల్ వద్ద ఉండే ఆ చిన్న లివర్ దేనికో తెలుసా?
స్కూటీ బ్రేక్ హ్యాండిల్ వద్ద ఉండే ఆ చిన్న లివర్ దేనికో తెలుసా?
ఇన్‌స్టా రీల్‌తో మొదలై టెలిగ్రామ్ ట్రైనింగ్‌తో జోరుగా దందా!
ఇన్‌స్టా రీల్‌తో మొదలై టెలిగ్రామ్ ట్రైనింగ్‌తో జోరుగా దందా!
చక్కెర తినడం పూర్తిగా ఆపేస్తే శరీరంలో ఏం జరుగుతుంది? నిపుణుల సూచన
చక్కెర తినడం పూర్తిగా ఆపేస్తే శరీరంలో ఏం జరుగుతుంది? నిపుణుల సూచన
విరిగిన ఎముకలకు మేలు చేసే నల్ల కారం పొడి.. ఇడ్లీ, దోసెల్లోకి కూడా
విరిగిన ఎముకలకు మేలు చేసే నల్ల కారం పొడి.. ఇడ్లీ, దోసెల్లోకి కూడా
చరిత్ర సృష్టించిన భారత అమ్మాయిలు.. హాకీలో సౌత్ కొరియా ఖేల్ ఖతం..
చరిత్ర సృష్టించిన భారత అమ్మాయిలు.. హాకీలో సౌత్ కొరియా ఖేల్ ఖతం..
టెంప్టింగ్ ధరతో మార్కెట్లోకి రెనాల్ట్ ట్రైబర్
టెంప్టింగ్ ధరతో మార్కెట్లోకి రెనాల్ట్ ట్రైబర్
వీర భారత పైలట్‌ను ప్రశంసించిన ప్రధాని మోదీ!
వీర భారత పైలట్‌ను ప్రశంసించిన ప్రధాని మోదీ!