అలాంటి సీన్లు చేయను.. దెబ్బకు కెరీర్ నాశనమైందంటున్న హీరోయిన్.. w

Rajitha Chanti

Pic credit - Instagram

16 March 2026

ఎలాంటి బ్యాగ్రౌండ్ సపోర్ట్ లేకుండానే సినీరంగంలోకి అడుగుపెట్టింది. నటనపై ఆసక్తితో బుల్లితెరపై పలు సీరియల్స్ చేసి మరింత పాపులర్ అయ్యింది ఈ ముద్దుగుమ్మ.

కుంకుమ భాగ్య సీరియల్ ద్వారా ప్రేక్షకులకు దగ్గరయ్యింది. ఆ తర్వాత సీరియల్ నుంచి తప్పుకుని వెండి తెరపై కనిపించాలనే ప్రయత్నాలు స్టార్ట్ చేసి ఆఫర్స్ కొట్టేసింది.

నెమ్మదిగా సినిమాల్లో కథానాయికగా అవకాశాలు అందుకున్న ఈ అమ్మడు.. కెరీర్ మొదట్లో రొమాంటిక్ సీన్లలో రెచ్చిపోయింది. దీంతో తల్లిదండ్రులు కండీషన్ పెట్టారట. 

ముద్దు సీన్లు, రొమాంటిక్ సన్నివేశాల్లో నటిస్తే సినిమాలు వద్దని చెప్పారట. దీంతో ఇదే కండీషన్ నిర్మాతలకు చెప్పడంతో చాలా వరకు తాను హీరోయిన్ ఆఫర్స్ కోల్పోయిందట. 

చివరకు తల్లిదండ్రులను నచ్చజెప్పి.. కథ డిమాండ్ చేసినప్పుడు నటించాల్సిందే అని చెప్పడంతో పేరెంట్స్ ఒప్పుకున్నారట. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయిందట. 

తన వరకు వచ్చిన ఎన్నో ఆఫర్స్ కోల్పోయానని తెలిపింది. ఇంతకీ ఈ ముద్దుగుమ్మ ఎవరో తెలుసా.. తనే బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్. తెలుగువారికి సుపరిచితమే. 

హిందీలో లవ్ సోనియా, సూపర్ 30, జెర్సీ వంటి చిత్రాలతో హిట్స్ అందుకుంది. ఆ తర్వాత దుల్కర్ సల్మాన్ సరసన సీతారామం సినిమాతో  తెలుగు తెరకు పరిచయమైంది. 

తెలుగులో వరుస సినిమాలు అందుకున్న మృణాల్.. తర్వాత బాలీవుడ్ పై ఫోకస్ పెట్టింది. ప్రస్తుతం ఈ అమ్మడు అడివి శేష్ సరసన డెకాయిట్ చిత్రంలో నటిస్తుంది ఈ భామ.