AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Squid Game 3: మనుషుల ప్రాణాలతో చెలగాటమాడే గేమ్.. ‘స్క్విడ్‌గేమ్ 3’ టీజర్‌ చూశారా? స్ట్రీమింగ్ డేట్ ఇదే

ఓటీటీలో అత్యంత ప్రజాదరణ పొందిన వెబ్ సిరీస్ స్క్విడ్‌గేమ్‌. అన్ని భాషల్లోనూ ఈ సిరీస్ కు సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. ఇప్పటికే ఈ సిరీస్ లో రెండు సీజన్లు రాగా, ఇప్పుడు మూడో సీజన్ కూడా రాబోతుంది. తాజాగా స్క్విడ్‌ గేమ్‌3 టీజర్ రిలీజయ్యింది.

Squid Game 3: మనుషుల ప్రాణాలతో చెలగాటమాడే గేమ్.. 'స్క్విడ్‌గేమ్ 3’ టీజర్‌ చూశారా? స్ట్రీమింగ్ డేట్ ఇదే
Squid Game 3
Basha Shek
|

Updated on: May 06, 2025 | 11:12 AM

Share

2021లో విడుదలైన స్క్విడ్ గేమ్ వెబ్ సిరీస్‌ కు ప్రపంచ వ్యాప్తంగా విశేష ఆదరణ దక్కింది. కొరియన్ భాషలో తెరకెక్కిన ఈ సిరీస్ కు ఇండియాలోనూ సూపర్బ్ క్రేజ్ వచ్చింది. తెలుగు రాష్ట్రాల్లోని ఓటీటీ ఆడియెన్స్ కూడా ఈ సిరీస్ ను ఎగబడి చూశారు. దీని దెబ్బకు నెట్ ఫ్లిక్స్ ఓటీటీ రికార్డులు సైతం బద్దలయ్యాయి. అంతేకాదు, వివిధ అవార్డులు సైతం దక్కాయి. దీంతో ‍స్క్విడ్ గేమ్-2 సిరీస్‌ను కూడా భారీ స్థాయిలో రిలీజ్ చేశారు. గతేడాది డిసెంబర్‌లో విడుదలై ఈ సిరీస్‌ కూడా మొదటి పార్ట్ రేంజ్ లో కాకపోయినా భారీ వ్యూస్ ను సొంతం చేసుకుంది. ఇలా రెండు సీజన్లకు సూపర్బ్ రెస్పాన్స్ రావడంతో మూడో సీజన్ ను కూడా తీసుకొస్తున్నారు మేకర్స్. రెండో సీజన్ లోనే మూడో పార్ట్ పై హిం్ ఇచ్చారు. తాజాగా స్క్విడ్ గేమ్ సీజన్ 3 స్ట్రీమింగ్ కు ముహూర్తం కూడా ఫిక్స్ చేశారు. 27 నుంచి నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్‌ కానుంది అలాగే ఈ సీజన్ కు సంబంధించిన టీజర్ ను కూడా రిలీజ్ చేశారు మేకర్స్.

‘స్క్విడ్‌గేమ్ 3’లో ఏం చూపనున్నారంటే..!

స్క్విడ్‌గేమ్ సీజన్ 2 సిరీస్ మొత్తం షియెంగ్‌ జీ హున్‌ చుట్టే తిరిగింది. అతను ‘స్క్విడ్‌ గేమ్‌’ అన్ని దశలు పూర్తి చేసి, 45.6 బిలియన్‌ కొరియన్‌ వన్‌లు గెలుచుకుంటాడు. కానీ మనుషుల ప్రాణాలు తీసే ఈ డేంజరస్ గేమ్‌కు ఎలాగైనా ముగింపు పలకాలనుకుంటాడు షియెంగ్‌. ఈ గేమ్ ఆడిస్తున్నమాస్క్‌ కలిగిన ఫ్రంట్‌ మ్యాన్‌ అనే వ్యక్తిని కనిపెట్టాలనుకుంటాడు. మరి షియెంగ్‌ అనుకున్న లక్ష్యం నెరవేరిందా? ఫ్రంట్‌మ్యాన్‌ను అంతం చేశాడా.. లేదా అన్నది సీజన్ 3 లో చూపించనున్నారు. కాగా ఈ టీజర్‌ను షేర్‌ చేసిన నెట్‌ఫ్లిక్స్..‘చివరి ఆటలను ఆడటానికి సమయం వచ్చేసింది’ అని క్యాప్షన్ ఇచ్చింది. అంటే ఇదే చివరి సీజన్‌ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి

 స్క్విడ్‌గేమ్ 3 టీజర్

జూన్ 27 నుంచి స్ట్రీమింగ్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

వైభవ్ సూర్యవంశీని మించిన విధ్వంసం భయ్యో.. 32 బంతుల్లో సెంచరీ
వైభవ్ సూర్యవంశీని మించిన విధ్వంసం భయ్యో.. 32 బంతుల్లో సెంచరీ
బొప్పాయి vs కివి.. ఆరోగ్యానికి ఏది మంచిది.. తినే ముందు తప్పక..
బొప్పాయి vs కివి.. ఆరోగ్యానికి ఏది మంచిది.. తినే ముందు తప్పక..
ప్రమాదంలో జస్ప్రీత్ బుమ్రా ప్లేస్.. దూసుకొచ్చిన తెలుగబ్బాయ్
ప్రమాదంలో జస్ప్రీత్ బుమ్రా ప్లేస్.. దూసుకొచ్చిన తెలుగబ్బాయ్
అఖండ 2 విలన్‌ కూతురు ఎవరో తెలుసా? స్టార్ హీరోయిన్లకు మించిన అందం
అఖండ 2 విలన్‌ కూతురు ఎవరో తెలుసా? స్టార్ హీరోయిన్లకు మించిన అందం
మీరూ ఈ తప్పులు చేస్తున్నారా? కాస్త జాగ్రత్తగా ఉండండి..
మీరూ ఈ తప్పులు చేస్తున్నారా? కాస్త జాగ్రత్తగా ఉండండి..
స్టాక్ మార్కెట్‌లో కోటీశ్వరులు కావాలా.. వారెన్ బఫెట్ చెప్పిన..
స్టాక్ మార్కెట్‌లో కోటీశ్వరులు కావాలా.. వారెన్ బఫెట్ చెప్పిన..
హార్దిక్‌కు ఖేల్ రత్న.. అర్జున అవార్డు ఎవరికంటే?
హార్దిక్‌కు ఖేల్ రత్న.. అర్జున అవార్డు ఎవరికంటే?
ఈ దేశంలో రెడ్‌ లిప్‌స్టిక్‌ వేసుకుంటే.. జైలు శిక్ష ఖాయం!
ఈ దేశంలో రెడ్‌ లిప్‌స్టిక్‌ వేసుకుంటే.. జైలు శిక్ష ఖాయం!
ఐపీఎల్ 2026కు ముందే RCBకి షాక్.. రూ. 5 కోట్ల ప్లేయర్ అరెస్ట్?
ఐపీఎల్ 2026కు ముందే RCBకి షాక్.. రూ. 5 కోట్ల ప్లేయర్ అరెస్ట్?
ఒక్కో చిన్నారి రూ.15 లక్షలు.. హైదరాబాద్‌లో శిశు అక్రమ రవాణా ముఠా
ఒక్కో చిన్నారి రూ.15 లక్షలు.. హైదరాబాద్‌లో శిశు అక్రమ రవాణా ముఠా