AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Anchor Rashmi : ‘బాలి ట్రిప్ అంతా వీల్ చైర్‌లోనే .. కనీసం స్నానం కూడా చేయలేకపోయా’.. రష్మిక ఎమోషనల్ వీడియో

జబర్దస్త్ యాంకర్ రష్మీ గౌతమ్ ఇటీవల తీవ్ర అనారోగ్యం పాలైంది. ఆస్పత్రిలో శస్త్ర చికిత్స కూడా జరిగింది. . అలాగే డాక్టర్ల సూచన మేరకు మూడువారాలు విశ్రాంతి తీసుకోనున్నట్లు ఒక వీడియోను కూడా షేర్ చేసింది. అయితే ఉన్నట్లుండి ఇండోనేసియాలోని బాలిలో ప్రత్యక్షమైందీ అందాల తార.

Anchor Rashmi : 'బాలి ట్రిప్ అంతా వీల్ చైర్‌లోనే .. కనీసం స్నానం కూడా చేయలేకపోయా'.. రష్మిక ఎమోషనల్ వీడియో
Anchor Rashmi Gautam
Basha Shek
|

Updated on: May 05, 2025 | 5:30 PM

Share

జబర్దస్త్, శ్రీదేవీ డ్రామా కంపెనీతో పాటు పలు టీవీషోలతో బిజి బిజీగా ఉంటోంది యాంకర్ రష్మీ. అప్పుడప్పుడు కొన్ని సినిమాల్లోనూ తళుక్కుమంటోంది. అయితే ఇటీవల ఈ ముద్దుగుమ్మ తీవ్ర అనారోగ్యం పాలైంది. గత నెలలోనే రష్మీకి ఆపరేషన్ జరిగింది. భుజం నొప్పి ఎక్కువయ్యేసరికి సర్జరీ చేయించుకున్నట్లు సోషల్ మీడియాలో ఒక వీడియోను షేర్ చేసింది. అంతేకాదు వైద్యుల సూచనల మేరకు మూడు వారాలు విశ్రాంతి తీసుకోనున్నట్లు వీడియోలో తెలిపింది. అయితే ఉన్నట్లుండి అందరికీ షాక్ ఇచ్చింది అందాల యాంకరమ్మ. ఏప్రిల్ 18న ఆపరేషన్ జరగ్గా.. వారం రోజులు కూడా తిరగకుండానే ఏప్రిల్ 24న బాలి వెకేషన్ కు వెళ్లిపోయింది రష్మి. దీంతో అందరూ ఆశ్చర్యానికి లోనయ్యారు. రష్మీ ఇంత త్వరగా ఎలా రికవరీ అయ్యిందా? అని ముక్కున వేలేసుకున్నారు. అయితే ఈ బాలి ట్రిప్ ప్లాన్ రెండు నెలలకు ముందే ఫిక్స్ అయ్యిందట. దీనికి తోడు తన పుట్టిన రోజు. అందుకే అనారోగ్యంతో ఉన్నా ట్రిప్ క్యాన్సిల్ చేయకుండా తప్పక బాలి వెళ్లాల్సి వచ్చిందని రష్మీ తెలిపింది. కాగా వెకేషన్ కు వెళ్లినా అక్కడ కనీసం నడవలేకపోయిందట ఈ యాంకరమ్మ. దీంతో వీల్ ఛైర్ లోనే తిరుగుతూ బాలి ట్రిప్ పూర్తి చేసిందట. ఈ విషయాన్ని చెబుతూ ఇన్ స్టా గ్రామ్ లో ఒక వీడియోను షేర్ చేసింది రష్మీ.

‘ట్రిప్ కి వెళ్లానన్న మాటే గానీ.. అక్కడ ఊయల ఊగడం, జంపింగ్ లు, డైవింగ్ చేయడం, ఇసుకలో ఆడుకోవడం, వాటర్ రైడ్స్ చేయడం, డ్యాన్సింగ్ లాంటివి చేయలేదు. కనీసం చివరకు బీచ్ లో స్నానం కూడా చేయలేకపోయాను. ఈ ట్రిప్ కి వెళ్లడం ఏమో గానీ అమ్మ నన్ను జీవితాంతం దెప్పిపొడవడం గ్యారంటీ’ అని తన వీడియోకు క్యాప్షన్ ఇచ్చింది రష్మీ. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. దీనిన చూసిన నెటిజన్లు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

వీల్ ఛైర్ లో యాంకర్ రష్మీ..

బాలి వెకేషన్ లో యాంకర్ రష్మీ..

కొన్ని రోజుల క్రితం ఆస్పత్రిలో..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.