Reba Monica John: ‘మ్యాడ్ స్క్వేర్’ స్వాతిరెడ్డికి పెళ్లయిపోయిందా? భర్త ఎవరో తెలుసా? రొమాంటిక్ ఫొటోస్ వైరల్
రీసెంట్ గా వచ్చిన 'మ్యాడ్ స్క్వేర్' సినిమాలో స్వాతిరెడ్డి పాటతో అదరగొట్టిన రెబా మోనికా జాన్ షాకిచ్చింది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ క్రేజ హీరోయిన్ తన భర్తతో కలిసున్న రొమాంటిక్ ఫొటోలని షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ఫొటోస్ నెట్టింట వైరలవుతున్నాయి.

శ్రీ విష్ణు నటించిన సామజవరగమన సినిమాతో టాలీవుడ్ కు పరిచయమైంది రెబా మోనికా జాన్. ఇక రీసెంట్ గ మ్యాడ్ స్క్వేర్ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ చేసింది. స్వాతిరెడ్డి సాంగ్ లో దుమ్మురేపే స్టెప్పులేసి తెలుగు ఆడియెన్స్ ను మైమరిపించింది. బెంగళూరుకు చెందిన ఈ ముద్దుగుమ్మ 2016లో జకబింటే స్వర్గరాజ్యం అనే ఒక మలయాళం సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. ఆ తర్వాత ఎక్కువగా తమిళ్ సినిమాల్లోనే నటించింది. ఫోరెన్సిక్, జరుగండి, బిగిల్, మైఖేల్, ఎఫ్.ఐ.ఆర్, బూ తదితర హిట్ సినిమాల్లో నటించింది. ఓ వైపు హీరోయిన్ గా నటిస్తూనే, మరోవైపు బిగిల్ వంటి సినిమాల్లో స్పెషల్ రోల్స్ తో ఆడియెన్స్ ను ఆకట్టుకుందీ అందాల తార. ఇక సామజవరగమన సినిమాతో తెలుగు ఆడియెన్స్ కూ చేరువైంది మోనికా జాన్. ఇందులో ఆమె అందం, నటనకు మంచి మార్కులే పడ్డాయి. అయితే దీని తర్వాత చాలా గ్యాప్ తీసుకుందీ అందాల తార. రీసెంట్ గా మ్యాడ్ స్క్వేర్’ స్వాతిరెడ్డి పాటతో కుర్రకారుకు గిలిగింతలు పెట్టింది.
సినిమాల సంగతి పక్కన పెడితే.. సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది రెబా మోనిక. తరచ తన గ్లామరస్ అండ్ ఫ్యాషనబుల్ ఫొటోలను ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేస్తుంటుంది. అయితే తాజాగా ఈ ముద్దుగుమ్మ షేర్ చేసిన ఫొటోలు ఫ్యాన్స్ కు షాక్ ఇచ్చాయి. అందులో తన భర్త జోమన్ జోసెఫ్ తో కలిసున్న కొన్ని రొమాంటిక్ ఫొటోలను షేర్ చేసింది మోనికా జాన్. తన భర్త పుట్టిన రోజు సందర్భంగా విషెస్ చెబుతూ ఈ ఫొటోలను పంచుకుందీ అందాల తార. వీటిని చూసిన సినీ అభిమానులు, నెటిజన్లు షాక్ అవుతున్నారు. మన స్వాతి రెడ్డికి పెళ్లైపోయిందా? అంటూ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. కాగా రెబా మోనికా జాన్, జోమన్ జోసెఫ్ ల వివాహం 2022లో జరిగింది. వీరిది ప్రేమ వివాహం. ఇక భర్త జోమాన్ జోసెఫ్ విషయానికి వస్తే.. ఒక ఎమ్మెన్సీ కంపెనీలో కన్సల్టెంట్ గా పని చేస్తున్నాడు. అలాగే కొన్ని వ్యాపారాలు కూడా ఉన్నాయి.
భర్తతో రెబా మోనికా జాన్..
View this post on Instagram
ప్రస్తుతం రెబా మోనికా జాన్ చేతిలో పలు క్రేజీ ప్రాజెక్టులు ఉన్నాయి. తెలుగులో సామజవరగమన తర్వాత మరోసారి శ్రీ విష్ణు సరసన ‘మృత్యుంజయ్’ అనే సినిమాలో హీరోయిన్ గా యాక్ట్ చేస్తోంది. అలాగే కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ కూలీ, విజయ దళపతి జన నాయగన్ తదితర సినిమాల్లో ఈ ముద్దుగుమ్మ కీలక పాత్రలు పోషిస్తోంది.
రెబా మోనికా జాన్ పెళ్లి ఫొటోలు..
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.








