AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వ్యాయామం చేయకుండానే బరువు తగ్గొచ్చు! ‘చక్కెర’ మానేస్తే నెలలో ఎన్ని కిలోలు తగ్గుతారో తెలుసా?

నేటి కాలంలో చక్కెర లేనిదే మన రోజు గడవదు. ఉదయం తాగే టీ, కాఫీ నుంచి రాత్రి తినే స్వీట్ల వరకు ప్రతి దాంట్లోనూ పంచదార ఒక అంతర్భాగమైపోయింది. అయితే, ఈ తీపి పదార్థాలు శరీరానికి చేసే నష్టం అంతా ఇంతా కాదు. అధిక బరువు, టైప్-2 డయాబెటిస్, గుండె సంబంధిత సమస్యలు మరియు దంత క్షయానికి చక్కెర ప్రధాన కారణం. మరి కేవలం ఆహారంలో చక్కెరను పక్కన పెడితే ఎంత బరువు తగ్గొచ్చో తెలుసా?

వ్యాయామం చేయకుండానే బరువు తగ్గొచ్చు! ‘చక్కెర’ మానేస్తే నెలలో ఎన్ని కిలోలు తగ్గుతారో తెలుసా?
Quitting Sugar.jpg
Nikhil
|

Updated on: Mar 16, 2026 | 10:44 PM

Share

బరువు తగ్గాలని కఠినమైన వర్కౌట్లు చేస్తున్నా ఫలితం రావడం లేదా? అయితే మీరు తీసుకునే తీపి పదార్థాలపై ఒక్కసారి కన్నేయండి. డాక్టర్ సుధీర్ కుమార్ ఒక 40 ఏళ్ల వ్యక్తిని ఉదాహరణగా తీసుకుని ఈ లెక్కలు వివరించారు. సుమారు 20 కిలోల అధిక బరువు ఉన్న వ్యక్తి, తన వ్యాయామంలో ఎలాంటి మార్పు చేయకుండా.. కేవలం ఆహారం నుంచి చక్కెరను తొలగిస్తే ఏం జరుగుతుందో తెలుసుకుందాం..

చక్కెరను ఎలా వదిలించుకోవాలి?

దినచర్యలో ఈ క్రింది నాలుగు మార్పులు చేస్తే చాలు.

  • టీ లేదా కాఫీలో చక్కెర వేసుకోవడం మానేయాలి.
  • ప్రతిరోజూ తాగే కోకాకోలా లేదా సాఫ్ట్ డ్రింక్స్‌కు స్వస్తి పలకాలి.
  • ప్యాక్ చేసిన పండ్ల రసాలకు దూరంగా ఉండాలి.
  • వారంలో రెండు మూడు సార్లు తినే ఐస్‌క్రీమ్‌లు, స్వీట్లను పక్కన పెట్టాలి.

ఎన్ని కిలోలు తగ్గుతారు?

కేవలం పైన చెప్పిన ఆహార పదార్థాలను మానేయడం ద్వారా, సదరు వ్యక్తి నెలకు సుమారు 1.5 కిలోల బరువు తగ్గుతారని డాక్టర్ సుధీర్ కుమార్ తెలిపారు. ఏ విధమైన కొత్త వ్యాయామాలు చేయకుండానే ఏడాదికి సుమారు 18 కిలోల బరువు తగ్గే అవకాశం ఉంటుంది. లిక్విడ్ క్యాలరీల (సాఫ్ట్ డ్రింక్స్, జ్యూస్) వల్ల కడుపు నిండిన అనుభూతి కలగదు. వీటిని చాలా త్వరగా తాగేయొచ్చు, దీనివల్ల మనం తెలియకుండానే ఎక్కువ క్యాలరీలను శరీరానికి ఇస్తాం. అందుకే ఇవి బరువు పెరగడానికి, డయాబెటిస్ మరియు ఫ్యాటీ లివర్ వ్యాధి రావడానికి ప్రధాన కారణమవుతున్నాయి.

జాగ్రత్తలు..

  • బయట దొరికే ఆహార పదార్థాలు కొనేముందు వాటిపై ఉండే న్యూట్రిషన్ లేబుల్స్ చదవండి.
  • సాధ్యమైనంత వరకు సహజమైన పండ్లనే తినండి, రసాలు కాదు.
  • చక్కెరను తగ్గించడం వల్ల శరీరంలో ఎనర్జీ లెవల్స్ కూడా బ్యాలెన్స్‌డ్‌గా ఉంటాయి.

చక్కెరను మానేయడం అనేది కేవలం బరువు తగ్గడానికే కాదు, దీర్ఘకాలిక ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి కూడా ఎంతో ముఖ్యం. అయితే ఈ లెక్కలు అందరికీ ఒకేలా ఉండకపోవచ్చు. కాబట్టి మీ వయస్సు, ఆరోగ్య స్థితిని బట్టి సరైన డైట్ ప్లాన్ కోసం నిపుణులను సంప్రదించడం మంచిది.

Follow Us
SRH vs RR Result: రాజస్థాన్‌ను చిత్తు చేసిన హైదరాబాద్..
SRH vs RR Result: రాజస్థాన్‌ను చిత్తు చేసిన హైదరాబాద్..
పెళ్లిపై షాకింగ్ కామెంట్స్ చేసిన హీరో రామ్ పోతినేని
పెళ్లిపై షాకింగ్ కామెంట్స్ చేసిన హీరో రామ్ పోతినేని
వీరింట లక్ష్మీదేవి ఉండదు.. గరుడ పురాణం చెబుతున్న పచ్చి నిజాలివే!
వీరింట లక్ష్మీదేవి ఉండదు.. గరుడ పురాణం చెబుతున్న పచ్చి నిజాలివే!
సీలింగ్ ఫ్యాన్ vs టేబుల్ ఫ్యాన్.. మీ ఇంటికి ఏ ఫ్యాన్ కరెక్ట్?
సీలింగ్ ఫ్యాన్ vs టేబుల్ ఫ్యాన్.. మీ ఇంటికి ఏ ఫ్యాన్ కరెక్ట్?
శుక్రుడి మార్పుతో ఈ రాశుల వారికి లక్ష్మీ కటాక్షం..
శుక్రుడి మార్పుతో ఈ రాశుల వారికి లక్ష్మీ కటాక్షం..
పుట్టినరోజు వేడుకల్లోనే అమెరికాలో యువ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ మృతి
పుట్టినరోజు వేడుకల్లోనే అమెరికాలో యువ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ మృతి
1,W,0,W,0,W.. రాజస్థాన్‌ను వణికించిన సన్‌రైజర్స్ నయా ‘స్పీడ్ గన్
1,W,0,W,0,W.. రాజస్థాన్‌ను వణికించిన సన్‌రైజర్స్ నయా ‘స్పీడ్ గన్
ఆరోగ్యానికి మంచిదని తీసుకునే ఈ ఆహారాల్లోనూ ఉప్పు ఎక్కువగా ఉంటుందట
ఆరోగ్యానికి మంచిదని తీసుకునే ఈ ఆహారాల్లోనూ ఉప్పు ఎక్కువగా ఉంటుందట
మూడింట ఒక వంతు సీట్లు చట్టసభల్లో మహిళలకు దక్కుతాయా?
మూడింట ఒక వంతు సీట్లు చట్టసభల్లో మహిళలకు దక్కుతాయా?
OTTలో ట్రెండ్ అవుతోన్నతెలుగు క్రైమ్ థ్రిల్లర్..IMDBలో 8.3 రేటింగ్
OTTలో ట్రెండ్ అవుతోన్నతెలుగు క్రైమ్ థ్రిల్లర్..IMDBలో 8.3 రేటింగ్