పాల ప్యాకెట్ నోటితో కట్ చేస్తున్నారా.. ఇది తెలిస్తే షాక్ అవ్వాల్సిందే  !

Samatha

11 April 2026

ఉదయాన్నే పాల ప్యాకెట్ కట్ చేసి, టీ లేదా కాఫీ పెట్టుకొని తాగనిదే చాలా మందికి రోజు గడవనట్లు ఉంటుందని చెబుతుంటారు.

టీ

అయితే కొంత మంది కత్తెరతో పాల ప్యాకెట్ కట్ చేస్తే కొంత మంది నోటితో పాల ప్యాకెట్ కట్ చేస్తుంటారు. కానీ ఇలా కట్ చేయడం అస్సలే మంచిది కాదంటున్నారు వైద్యులు.

నోటితో పాలప్యాకెట్ కట్ చేయడం

 ఇలా నోటితో పాల ప్యాకెట్   కట్ చేయడం వలన అనేక అనారోగ్య సమస్యలు  తలెత్తే ప్రమాదం చాలా ఎక్కువగా ఉన్నదంట.

అనారోగ్య సమస్యలు

పాల ప్యాకెట్లను గోడౌన్లలో స్టోర్ చేస్తారు. అంతే కాకుండా ధూళి, దుమ్ము,  బ్యాక్టీరియా తో ఇవి మన వద్దకు వస్తుంటాయి.

దుమ్ము ,ధూళి

అంతే కాకుండా కొన్ని షాపుల్లో వీటిని స్టోర్ చేసే ఫ్రిజ్‌లు కూడా అపరి శుభ్రంగా ఉంటాయి. ఇక షాప్ వాళ్లు దమ్ము ఉన్న చేతులతోనే పాల ప్యాకెట్ ఇస్తారు.

బ్యాక్టీరియా

అయితే ఇలాంటి సమయంలో దీనిని క్లీన్ చేయకుండా నోటిలో పెట్టుకొని కట్ చేయడం వలన హానికరమైన బ్యాక్టీరియా నోటిలోకి వెళ్తుందంట.

నోటితో కట్ చేయడం

దీని వలన అనేక అనారోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉన్నదంట. ముఖ్యంగా కడుపు నొప్పి, వికారం వంటి సమస్యలు ఎదురు అవుతాయంట.

అనారోగ్య సమస్యలు

అందువలన తప్పకుండా పాలప్యాకెట్ షాప్ నుంచి తెచ్చిన తర్వాత సరిగ్గా శుభ్రం చేసి, నోటితో కాకుండా కత్తెరతో కట్ చేయాలని సూచిస్తున్నారు నిపుణులు.

కత్తెరతో కట్ చేయడం