AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మూడింట ఒక వంతు సీట్లు చట్టసభల్లో మహిళలకు దక్కుతాయా? రేవంత్ లేవనెత్తిన అనుమానాలేంటి?

ఒక్క ఎంపీ ఓటు.. కేవలం ఒకేఒక్క ఎంపీ సీటు తేడాతో 1998లో కేంద్రంలో వాజ్‌పేయి ప్రభుత్వం పడిపోయింది.. అప్పట్లో అదొక సంచలనం. లోక్‌సభలో ఒక్క సీటుకు ఎంత బలం ఉందో చెప్పడానికి ఇదొక తిరుగులేని రుజువు. సో, ఓడలు బండ్లు, బండ్లు ఓడలవ్వాలన్నా, ప్రభుత్వ మార్పిడి జరగాలన్నా ఒక్క ఎంపీ సీటు చాలు. అందుకే కాబోలు, ఒక్క సీటున్న చిన్నాచితకా పార్టీల్ని కూడా కూటమిలో చేర్చుకుని, నెత్తిన పెట్టుకుంటాయి ప్రభుత్వాలు. అవిశ్వాస తీర్మానాల సమయంలో బలాబలాలు తారుమారై తీవ్రమైన తేడా కొడుతుంది గనుక, ఎమర్జెన్సీకి ఉపయోగపడతారని. డీలిమిటేషన్ సీజన్‌లో ఆ ఒక్కసీటు విలువ ప్రతిష్టాత్మకంగా మారింది. లోక్‌సభలో తమతమ బలగాలు తగ్గొద్దని పట్టుమీదున్నాయి దక్షిణాది రాష్ట్రాలు. ఆ బాధ్యతను భుజానేసుకున్నారు తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి. పునర్విభజనపై కాంగ్రెస్, బీజేపీల మధ్య జరుగుతున్న కొత్త స్క్రీన్‌ప్లే ఏంటో తెలుసుకుందాం ..

మూడింట ఒక వంతు సీట్లు చట్టసభల్లో మహిళలకు దక్కుతాయా? రేవంత్ లేవనెత్తిన అనుమానాలేంటి?
Delimitation India
Ram Naramaneni
|

Updated on: Apr 13, 2026 | 9:42 PM

Share

నియోజకవర్గాల పునర్విభజన అంటూ జరిగితే మోస్ట్ ఎఫెక్టెడ్ స్టేట్స్ మనమే.. నాతో కలసిరండి పోరాడతాం.. ఢిల్లీని బెదరగొడదాం.. అంటూ సదరన్ స్టేట్స్‌ వైపు చెయ్యి చాచి, ఏకంగా రౌండ్‌టేబుల్ సమావేశం ఏర్పాటు చేసి.. కేంద్రంపైకి దండయాత్రకు దిగారు తమిళనాడు సీఎం స్టాలిన్. సరిగ్గా ఏడాది కిందటి విషయం ఇది. డీలిమిటేషన్‌ను అడ్డుకోవాలని ఆయన చేసిన వీరప్రయత్నం అప్పట్లో చప్పున చల్లారిపోయింది. దక్షిణాది రాష్ట్రాల చాంపియన్ అనే క్రెడిట్‌ టెంపరరీగానే మిలిగిపోయింది. కానీ, ఇప్బుడు అన్ని రాష్ట్రాల్లో 50 శాతం సీట్లు పెంచుకుందాం రా అని కేంద్రం ఇచ్చిన ఇన్‌డైరెక్ట్ పిలుపుతో.. డీలిమిటేషన్ మంట మళ్లీ రాజుకుంది. పూర్తిగా పోలింగ్ సందట్లో మునిగిపోయిన స్టాలిన్, పునర్విభజన టాపిక్ వైపే చూడ్డం మానేశారు. ఎందుకంటే, అది పక్కా పొలిటికల్ పార్టీల బతుకు ప్రశ్న. వాళ్ల ఫుడ్డుకు సంబంధించిన ఇష్యూ. అంతేతప్ప, పాపులర్ స్లోగన్ కాదు. అందుకే, ఇప్పుడున్న నియోజకవర్గాల్లో విజయఢంకా మోగించడంపైనే ఆయన ఫోకస్ అంతా. తర్వాత పెరగబోయే నియోజకవర్గాల సబ్జెక్ట్‌ని చాలా లైట్ తీస్కున్నారు. కానీ, ఎన్నికలతో సంబంధం లేని మిగతా రాష్ట్రాలు మాత్రం ఎటెన్షన్‌లోకొచ్చేశాయి. టేకిటీజీ వద్దు, మేటర్ వెరీ సీరియస్ అంటున్నాయి. కేంద్రం సూత్రప్రాయంగా మొదలుపెట్టిన డీలిమిటేషన్ ప్రాక్టీస్‌ను అడ్డంగా తిప్పికొట్టేస్తున్నాయి. మోదీ సర్కార్‌ మాత్రం ముందుకే చూస్తోంది. ఎన్నాళ్లకెన్నాళ్లకెన్నాళ్లకు అని సంబరపడ్డమా.. ఇన్నాళ్లకు దొరికిన అదృష్టాన్ని కూడా మరొకళ్లకు విడిచిపెట్టడమా..? డీలిమిటేషన్ ప్రతిపాదనతో భలే చిక్కొచ్చి పడింది కొన్ని రాష్ట్రాలకు, ఆ...

Follow Us

పూర్తి కథనాన్ని చదివేందుకు TV9 యాప్‌ని డౌన్‌లోడ్ చేయండి

ప్రత్యేకమైన కథనాలకు అపరిమితమైన యాక్సెస్ TV9 యాప్‌లో కొనసాగండి