తక్కిన ఆకుకూరలతో పోలిస్తే పాలకూర ఆరోగ్యానికి ఎక్కువ మేలు చేస్తుందని తెలుసా? యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉండే పాలకూర ఆరోగ్యాన్ని కాపాడటంలో ఎంతో తోడ్పడుతుంది. కెరాటిన్, కొలాజిన్ ఈ రెండూ జుట్టు ఎదగడానికి చాలా అవసరం
TV9 Telugu
విటమిన్ బి, సిలు పుష్కలంగా ఉండే పాలకూర ఈ రెండింటినీ సమృద్ధిగా అందించి రాలిన జుట్టు రావడానికీ, వేగంగా పెరగడానికీ సాయం చేస్తుంది. దీనిలోని యాంటీ ఆక్సిడెంట్లు మాడు ఆరోగ్యంగా ఉండటానికి సహకరిస్తాయి
TV9 Telugu
పాలకూరలో పుష్కలంగా ఉండే ఇనుము వెంట్రుక మొదళ్లకు ఆక్సిజన్ అందించి అవి రాలకుండా చూస్తుంది. అలాగే వారంలో ఒకటి, రెండు సార్లు ఈ స్మూథీని తాగి చూడండి. శిరోజాలు ఆరోగ్యంగా, బలంగా మారతాయి. పాలకూరకు రక్తాన్ని శుద్ధి చేసే తత్వం ఉంటుంది
TV9 Telugu
పాలకూరలో విటమిన్ సి, ఏ, మెగ్నీషియం, ఫోలిక్ యాసిడ్ వంటివి క్యాన్సర్ వంటి వ్యాధులను నివారించడంలో తోడ్పడతాయి. ముఖ్యంగా ఊపిరితిత్తులు, రొమ్ము క్యాన్సర్‌ను అదుపుచేయడంలో పాలకూర ప్రముఖ పాత్ర పోషిస్తుంది
TV9 Telugu
ఈ ఆకుకూర వాత, పిత్త, కఫ దోషాలను నివారిస్తుంది. ఆకుకూరలో కాల్షియం, మెగ్నీషియం, ఐరన్, పీచు, సోడియం, పొటాషియం, ఫోలిక్ ఏసిడ్, ఎ,సి,కె విటమిన్లు ఉన్నాయి. ఇది రక్తపోటును నియంత్రణలో ఉంచుతుంది. చూపును మెరుగుపరుస్తుంది
TV9 Telugu
రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఉబ్బసం, ఆస్టియోపోరోసిస్, ఆర్థరైటిస్, టైప్ 2 డయాబెటిస్, మైగ్రేన్‌లను నిరోధిస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిని అదుపులో ఉంచుతుంది. ఎముకలు దృఢంగా, ఆరోగ్యంగా ఉంటాయి. ఊబకాయం రాదు
TV9 Telugu
గుండెజబ్బులు వచ్చే అవకాశం తగ్గుతుంది. పాలకూర తరచూ తినేవారిలో మెదడు పనితీరు మెరుగ్గా ఉంటుంది. శరీరం ప్రశాంతంగా ఉంటుంది. ఒత్తిడి, ఆందోళనల నుంచి ఉపశమనం కలుగుతుంది. పాలకూరలో యాంటీ ఏజింగ్ గుణాలు ఉన్నందున చర్మం కాంతిమంతంగా ఉంటుంది
TV9 Telugu
ఇది క్యాన్సర్లను సైతం నిరోధిస్తుంది. పాలకూరతో ఇన్ని లాభాలున్న మాట నిజమే కానీ మూత్రపిండాల్లో రాళ్లు, బ్లడ్ క్లాట్స్ లాంటి సమస్యలు ఉన్నవారికి మాత్రం ఇది మేలు కంటే కీడే చేస్తుంది. వాళ్లు దీన్ని వీలైనంత తక్కువ తినడమే మంచిది