పల్నాడు జిల్లా చిలకలూరిపేటలోని విజయ బ్యాంక్ సెంటర్ వద్ద ఒక కారు బీభత్సం సృష్టించింది. అతివేగంగా వచ్చిన కారు అదుపుతప్పి పక్కనే ఉన్న టిఫిన్ హోటల్లోకి దూసుకెళ్లింది. దీంతో హోటల్లోని వస్తువులు ధ్వంసమయ్యాయి. కారులో ఉన్న ఇద్దరు యువకులు, ముగ్గురు యువతులు గంజాయి మత్తులో ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. అదృష్టవశాత్తు హోటల్లో ఎవరికీ గాయాలు కాలేదు.