AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sujeeth: సుజీత్ మాస్టర్ ప్లాన్.. పవన్ ఓకే అంటారా..

Sujeeth: సుజీత్ మాస్టర్ ప్లాన్.. పవన్ ఓకే అంటారా..

Lakshminarayana Varanasi
| Edited By: |

Updated on: Apr 13, 2026 | 7:14 PM

Share

డైరెక్టర్ సుజీత్ తన తదుపరి రెండు భారీ ప్రాజెక్టులైన నానితో 'బ్లడీ రోమియో' మరియు పవన్ కళ్యాణ్ 'ఓజీ 2'లకు పక్కా ప్లానింగ్‌తో సిద్ధమయ్యారు. నాని సినిమా ఆరు నెలల్లో పూర్తి చేసి, 2027 చివరిలో 'ఓజీ 2'ను ప్రారంభిస్తారు. 'ఓజీ 2'ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ సంయుక్తంగా నిర్మిస్తాయి. పవన్ కళ్యాణ్ స్వయంగా ఈ ప్రాజెక్ట్ ప్రారంభ తేదీని ప్రకటిస్తారు.

ఓజీతో ఇండస్ట్రీని షేక్ చేసిన డైరెక్టర్ సుజీత్ తన నెక్స్ట్ ప్రాజెక్టుల కోసం ఎలాంటి క్రేజీ ప్లాన్‌తో రాబోతున్నారు..? న్యాచురల్ స్టార్ నానితో చేయబోయే బ్లడీ రోమియోతో పాటు పవన్ కళ్యాణ్ ఓజీ 2కి సంబంధించి ఈ దర్శకుడు ఎలాంటి మాస్టర్ ప్లాన్ వేశారు..? అసలు ఈ రెండు సినిమాలు ఒకేసారి పూర్తి చేస్తారా… వీటికి ఎప్పుడు ముహూర్తం..? సుజీత్ చేతిలో రెండు సినిమాలున్నా.. హీరోల బిజీ కారణంగా ఆయన ఖాళీగా ఉన్నారిప్పుడు. నాని ప్రస్తుతం నటిస్తున్న ప్యారడైజ్ సినిమా పూర్తవ్వగానే ఏమాత్రం గ్యాప్ లేకుండా సుజీత్ తో బ్లడీ రోమియో ప్రాజెక్ట్ సెట్స్‌పైకి వెళ్లనుంది. దీనికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులను పూర్తి చేసి.. కేవలం ఆర్నెళ్లలోనే షూటింగ్ పూర్తి చేసేలా సుజీత్ పక్కా ప్లానింగ్‌తో ఉన్నారు. నానితో ప్రాజెక్ట్ పూర్తయిన తర్వాత 2027 చివర్లో పవర్ స్టార్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఓజీ 2 సీక్వెల్ పట్టాలెక్కే అవకాశం ఉంది. దీనికి ఓజి రిటర్న్స్ అనే టైటిల్ పరిశీలనలో ఉంది. అయితే ఈ మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందనే బిగ్ అప్డేట్ స్వయంగా పవన్ కళ్యాణ్ తన అభిమానులకు అనౌన్స్ చేయనున్నారు. భారీ అంచనాల మధ్య రాబోతున్న ఓజీ 2 చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీతో పాటు పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ సంయుక్తంగా నిర్మించబోతున్నాయి. ఇప్పటికే ఈ రెండు ప్రొడక్షన్ హౌజులు కలిసి పని చేస్తామని ప్రకటించాయి. సుజీత్ ప్లానింగ్ చూస్తుంటే ముందు నానితో హిట్ కొట్టి.. ఆ తర్వాత పవన్‌తో మరో సెన్సేషన్ క్రియేట్ చేయడానికి సిద్ధమైనట్లు అర్థమవుతోంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Jr NTR: ధురంధర్‌ను ఫాలో అవుతున్న ఎన్టీఆర్.. 6 నెలల్లో రెండు భాగాలు

Asha Bhosle: గాయనిగా ఆశా భోంస్లే ప్రస్థానమిది

Yash: ఏక్ విలన్.. యశ్ ప్లానింగ్ అదిరింది కదా

చరణ్, బన్నీ, తారక్ మధ్య వార్.. కారణం అతడే

దేవుడి దగ్గర అత్యంత భక్తి శ్రద్ధలతో టాలీవుడ్ భామలు

Follow Us