AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Asha Bhosle: గాయనిగా ఆశా భోంస్లే ప్రస్థానమిది

Asha Bhosle: గాయనిగా ఆశా భోంస్లే ప్రస్థానమిది

Lakshminarayana Varanasi
| Edited By: |

Updated on: Apr 13, 2026 | 7:09 PM

Share

భారతీయ సంగీత ప్రపంచానికి తీరని లోటు. లెజెండరీ గాయని ఆశా భోస్లే కన్నుమూశారు. దశాబ్దాల పాటు తన మధుర స్వరంతో కోట్లాదిమంది హృదయాలను గెలుచుకున్న ఆశా, వేలాది పాటలు పాడి గిన్నిస్ రికార్డు సృష్టించారు. పద్మ విభూషణ్, జాతీయ అవార్డులు అందుకున్న ఆమె, ఎప్పటికీ నిలిచిపోయే సంగీత వారసత్వాన్ని వదిలి వెళ్లారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుందాం.

భారతీయ సంగీత ప్రపంచంలో మధురమైన స్వరంతో దశాబ్దాల పాటు ఉర్రూతలూగించిన ఆశా భోస్లే కన్నుమూసారు. భౌతికంగా ఆమె మనల్ని వదిలి వెళ్లిపోయినా ఎప్పటికీ చెరిగిపోని అద్భుతమైన పాటల రూపంలో మన గుండెల్లో ఎప్పటికీ సజీవంగానే ఉంటారు. ఆ మహాగాయని ఆత్మకు శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ.. ఓసారి ఆమె ఘనతలను స్మరించుకుందాం. 1933, సెప్టెంబర్ 8న జన్మించిన ఆశా భోస్లే.. తొమ్మిదేళ్ల వయసులోనే తండ్రి దీనానాథ్ మంగేష్కర్‌ని కోల్పోయారు. కుటుంబ పోషణ కోసం అతి చిన్న వయసులోనే మైక్ పట్టుకున్నారు. 1943లో మరాఠీ చిత్రం మాఝా బాల్‌‌తో పదేళ్ల వయసులోనే గాయనిగా కెరీర్ మొదలుపెట్టి ఎన్నో కష్టాలను దాటుకుని సంగీతాన్నే నమ్ముకుని అంచెలంచెలుగా ఎదిగారు ఆశా. 1957లో వచ్చిన నయా దౌర్ సినిమా ఆశా భోస్లేకి అతిపెద్ద బ్రేక్ ఇవ్వగా ఆ తర్వాత హిందీలో రొమాంటిక్ పాటలకే కాదు క్యాబరే సాంగ్స్‌ కు కూడా తన గాత్రంతో ప్రాణం పోశారు. పియా తూ అబ్ తో ఆజా, దమ్ మారో దమ్ లాంటి ఎన్నో అద్భుతమైన పాటలతో పాటు తెలుగులోనూ చందమామ చిత్రంలో పాడి దక్షిణాది ప్రేక్షకులకు సైతం ఆమె మరింత దగ్గరయ్యారు. ఎనిమిది దశాబ్దాలకు పైగా సాగిన ఆమె ప్రయాణంలో పదుల సంఖ్యల భాషల్లో వేలాది పాటలు పాడి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌‌లో చోటు దక్కించుకున్నారు. తన గాత్రంతో ఏకంగా ఏడు సార్లు ఫిల్మ్ ఫేర్ అవార్డులు, రెండు సార్లు జాతీయ పురస్కారాలతో పాటు భారత ప్రభుత్వం నుంచి అత్యున్నత పద్మ విభూషణ్ సైతం అందుకున్నారు. సంగీత సామ్రాజ్యానికి రారాణిగా వెలుగొందిన ఆశా భోస్లే ప్రయాణం ముగియడం భారతీయ సంగీత ప్రపంచానికి ఎన్నటికీ తీరని లోటు. ఆమె స్వరం మూగబోయినా దశాబ్దాల పాటు కోట్లాదిమంది సంగీత ప్రియుల మనసులను దోచుకున్నారు. ఆ మధురమైన పాటల రూపంలో ఆశా స్వరం ఎప్పటికీ చిరంజీవిగానే నిలిచిపోతుంది. ఆమె ఆత్మకు శాంతి కలగాలని మనస్పూర్థిగా కోరుకుందాం.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Yash: ఏక్ విలన్.. యశ్ ప్లానింగ్ అదిరింది కదా

చరణ్, బన్నీ, తారక్ మధ్య వార్.. కారణం అతడే

దేవుడి దగ్గర అత్యంత భక్తి శ్రద్ధలతో టాలీవుడ్ భామలు

ఇంట్లో కూతురి శవంతో తండ్రి.. దుర్వాసన రాకుండా సెంట్‌లు

ఆకలితో చిన్నారులుంటే.. 11,000 లీటర్ల పాలను నదిలో వదిలారు

Follow Us