AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇంట్లో కూతురి శవంతో తండ్రి.. దుర్వాసన రాకుండా సెంట్‌లు

ఇంట్లో కూతురి శవంతో తండ్రి.. దుర్వాసన రాకుండా సెంట్‌లు

Phani CH
|

Updated on: Apr 13, 2026 | 6:42 PM

Share

మీరట్‌లో దారుణం వెలుగుచూసింది. తండ్రి ఉదయభాను తన కూతురు ప్రియాంక అస్థిపంజరంతో నెలల తరబడి జీవించినట్లు పోలీసులు గుర్తించారు. మానసికంగా కుంగిపోయిన ప్రియాంక మృతదేహాన్ని బంధువులు కనుగొన్నారు. దుర్వాసన రాకుండా పర్ఫ్యూమ్‌లు వాడారు. తండ్రి అంగీకరించినా, మరణంపై పలు అనుమానాలున్నాయి. పోలీసులు లోతైన దర్యాప్తు చేస్తున్నారు.

ఉత్తర్‌ప్రదేశ్‌లోని మీరట్‌లో వింత ఘటన జరిగింది. 76 ఏళ్ల ఉదయభానుకి ఓ కుమార్తె ఉంది. ఆమె పేరు ప్రియాంక బిస్వాస్. ఆమె తండ్రితోనే ఉంటోంది. ఆమె డబుల్ ఎంఏ, ఎంటెక్ చిదివింది. ప్రియాంక ప్రైవేట్ టీచర్‌గా పనిచేస్తూ కంప్యూటర్ సబ్జెక్ట్ బోధించేది. 13 ఏళ్ల క్రితం తల్లి మరణం తర్వాత ప్రియాంక మానసికంగా కుంగిపోయింది. ఎవరితోనూ మాట్లాడకుండా, నిశ్శబ్దంగా ఉండేది. క్రమంగా ఆమె ఆరోగ్యం కూడా క్షీణించింది. ఆమెకు కామెర్ల సమస్య కూడా వచ్చింది. చికిత్స తర్వాత తండ్రి కూతురు ఇద్దరూ ఒక్కసారిగా కనిపించకుండా పోయారు. కొన్ని రోజుల తర్వాత ప్రత్యక్షమైన ఉదయ్​ భాను, కుమార్తెను చికిత్స కోసం డెహ్రాడూన్​ తీసుకెళ్లానని, ఇప్పడు ఆమె అక్కడే ఉంటుందని ఇతరులకు చెబుతుండేవాడు. అయితే ఏప్రిల్ 10న వృద్ధుడిని టీ దుకాణంలో చూసిన ఓ బంధువు, ప్రియాంక ఆరోగ్యం గురించి అడిగాడు. మొదట ఆయన అదే పాత కథ చెప్పినా, అనుమానం రావడంతో బంధువులు మరింతగా ప్రశ్నించారు. చివరికి కూతురు ఇంట్లోనే ఉందని చెప్పడంతో, వారు సాయంత్రం ఇంటికి వెళ్లారు. ఇంట్లో వారికి కనిపించిన దృశ్యం చూసి షాకయ్యారు. బెడ్‌పై ఒక అస్థిపంజరం ఉండగా, దానిపై క్లాత్ కప్పి ఉంది. అచ్చం ఎవరో నిద్రపోతున్నట్టుగా కనిపించింది. బంధువులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు అస్థిపంజరాన్ని స్వాధీనం చేసుకుని శవపరీక్ష కోసం ఆస్పత్రికి పంపించారు. ఇంట్లో పెద్ద సంఖ్యలో పర్ఫ్యూమ్ బాటిల్స్​ లభించాయని పోలీసులు చెప్పారు. మృతదేహం దుర్వాసన దాచేందుకు వాటిని ఉపయోగించినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఇంట్లో దొరికిన అస్థిపంజరం ప్రియాంకదేనని, ఐదు నెలల క్రితమే మరణించినట్లు పోలీసుల ఎదుట ఉదయ్ భాను ఒప్పుకున్నాడు. అయితే డిసెంబర్ 5న చివరిసారిగా ప్రియాంకను చూశామని, ఆ తర్వాత ఆమె కనిపించలేదని బంధువులు చెబుతున్నారు. అదే సమయంలో ప్రియాంకకు ఉదయ్​ భాను ఓ మత గురువు దగ్గర చికిత్స చేయించాడనే కొందరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగుతోందని పూర్తి వివరాలు వెలుగులోకి వచ్చిన తరువాత చర్యలు తీసుకుంటామని పోలీసులు చెప్పారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఆకలితో చిన్నారులుంటే.. 11,000 లీటర్ల పాలను నదిలో వదిలారు

హ‌ర్మూజ్‌లో తానే పెట్టిన సముద్ర మైన్‌లు.. వెతకలేక ఇరాన్ తంటాలు

మానవుల మధ్యే కాదు.. జంతువుల మధ్యా అంతర్యుద్ధం

2027 పొంగల్ ను టార్గెట్ చేసిన నలుగురు సీనియర్స్.. పోటీతో బాక్సాఫీస్‌కు నష్టాలా ??

Vishnupriya: విష్ణుప్రియపై ఫిర్యాదు.. మరోసారి వివాదంలో చిక్కుకున్న యాంకర్

Follow Us