AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆకలితో చిన్నారులుంటే.. 11,000 లీటర్ల పాలను నదిలో వదిలారు

ఆకలితో చిన్నారులుంటే.. 11,000 లీటర్ల పాలను నదిలో వదిలారు

Phani CH
|

Updated on: Apr 13, 2026 | 6:40 PM

Share

మధ్యప్రదేశ్‌లో ఆధ్యాత్మిక కార్యక్రమంలో భాగంగా 11,000 లీటర్ల పాలను నర్మదా నదిలోకి వదిలారు. రాష్ట్రంలో లక్షల మంది చిన్నారులు పోషకాహార లోపంతో బాధపడుతుంటే, ఈ పాలను వృథా చేయడంపై పర్యావరణవేత్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నదిలో పాలు చేరడం వల్ల BOD పెరిగి, ఆక్సిజన్ స్థాయిలు తగ్గి జలచరాలకు తీవ్ర ముప్పు వాటిల్లుతుందని నిపుణులు ఆందోళన చెందుతున్నారు. ఇది పర్యావరణానికి, సమాజానికి హానికరం.

మధ్యప్రదేశ్‌లో ఓ ఆధ్మాత్మిక కార్యక్రమంలో భాగంగా 11 వేల లీటర్ల పాలను నర్మదా నదిలోకి వదిలేశారు. రాష్ట్రంలో చిన్నారులు పోషకాహారంలోపంతో బాధపడుతుంటే.. పాలను వృథాచేయడం ఏంటని, వాటిని ఆకలితో ఉన్న పిల్లలకు అందచేస్తే బాగుండేదని పర్యావరణవేత్తలు అంటున్నారు. నదిలో పాలు పోయడం వల్ల బయోకెమికల్ ఆక్సిజన్ డిమాండ్ BOD పెరిగి, ఆక్సిజన్ స్థాయిలు తగ్గి జలచరాలకు ముప్పు ఏర్పడుతుందన్నారు. నీటిలో పాలు కుళ్లి బ్యాక్టీరియా వృద్ధి చెంది, చేపలు, ఇతర జీవులకు విషపూరితంగా మారుతుందని పర్యావరణ నిపుణులు ఆందోళన చెందుతున్నారు. సీహోర్ జిల్లాలోని సత్‌దేవ్ గ్రామంలో శ్రీ దాదాజీ దర్బార్ పాతాళేశ్వర్ మహాదేవ్ ఆలయంలో చైత్ర నవరాత్రులు నిర్వహించారు. మార్చి 18 నుంచి ఏప్రిల్ 7 వరకు జరిగిన ఈ వేడుకలో మహాయజ్ఞం కోసం 41 టన్నుల నెయ్యిని ఉపయోగించారు. ఆ తర్వాత నర్మదా నదిలోకి 11,000 లీటర్ల పాలను పవిత్ర సమర్పణ కింద వదిలారు. నర్మదా మాతాకు అభిషేకం, ప్రజలకు అన్నదానం చేయడమే బాబా లక్ష్యమని, మొదటి రోజు 151 లీటర్లు, తర్వాత 1,100 లీటర్లు, ఏప్రిల్ 7 ఏకంగా 11,000 లీటర్లు పాలతో అభిషేకం చేశారని ఓ భక్తుడు తెలిపారు. నది ప్రక్షాళన కోసం ప్రార్థనలు చేసి, ట్యాంకర్లతో పాలను నర్మదకు సమర్పించినట్లు చెప్పారు. ఇది కాలుష్య కారకంగా మారి నీటిలో ఆక్సిజన్‌‌ను తగ్గిస్తుందని, నర్మదపై ఆధారపడిన స్థానికులు, జలచరాలు ప్రమాదంలో పడతాయని పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మధ్యప్రదేశ్ ఎదుర్కొంటున్న పోషకాహార సవాళ్ల నడుమ ఈ వివాదం మరింత తీవ్రమవుతోంది. పోషణ్ ట్రాకర్, ఆరోగ్య సర్వేల నుంచి సేకరించిన డేటాను ఉటంకిస్తూ.. హైకోర్టులో దాఖలైన ఒక ప్రజా ప్రయోజన వ్యాజ్యం పిల్‌ ప్రకారం రాష్ట్రంలో 10 లక్షలకు పైగా పిల్లలు పోషకాహార లోపంతో బాధపడుతున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

హ‌ర్మూజ్‌లో తానే పెట్టిన సముద్ర మైన్‌లు.. వెతకలేక ఇరాన్ తంటాలు

మానవుల మధ్యే కాదు.. జంతువుల మధ్యా అంతర్యుద్ధం

2027 పొంగల్ ను టార్గెట్ చేసిన నలుగురు సీనియర్స్.. పోటీతో బాక్సాఫీస్‌కు నష్టాలా ??

Vishnupriya: విష్ణుప్రియపై ఫిర్యాదు.. మరోసారి వివాదంలో చిక్కుకున్న యాంకర్

బంగారం లాంటి అవకాశాలను చేజార్చుకున్న టాలీవుడ్ దర్శకులు

Follow Us