- Telugu News Photo Gallery Cinema photos Actress Poorna Alias Shamna Kasim Son Birthday Celebrations In Dubai, See Photos
Actress Poorna: నటి పూర్ణ కుమారుడిని చూశారా? దుబాయ్‌లో పుట్టిన రోజు సెలబ్రేషన్స్.. ఫొటోస్ ఇదిగో
ప్రముఖ నటి పూర్ణ అలియాస్ షమ్నా ఖాసీం దుబాయ్ కు చెందిన వ్యాపార వేత్తను పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా పూర్ణ ముద్దుల కుమారుడు హమదన్ అసిఫ్ అలీ రెండో పుట్టిన రోజు వేడుకలను దుబాయ్ లో గ్రాండ్ గా నిర్వహించారు.
Updated on: May 03, 2025 | 5:32 PM

టాలీవుడ్ ప్రముఖ నటి పూర్ణ గురించి తెలుగు ఆడియెన్స్ కు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. పలు సూపర్ హిట్ సినిమాల్లో నటించి మెప్పించిందీ అందాల తార

శ్రీ మహాలక్ష్మి సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైంది పూర్ణ. సీమ టపాకాయ్, అవును తదితర సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది.

హీరోయిన్ గానే కాకుండా దసరా, అఖండ, గుంటూరు కారం, డెవిల్ తదితర సినిమాల్లో సపోర్టింగ్ రోల్స్ పోషించింది. అలాగే పలు టీవీ షోల్లోనూ మెరిసింది.

సినిమాలు, టీవీ షోల సంగతి పక్కన పెడతే దుబాయ్ కు చెందిన వ్యాపారవేత్త షానిద్ అసిఫ్ అలీతో పెళ్లి పీటలెక్కంది పూర్ణ. 2022 జూన్ 12న దుబాయిలోనే తన పెళ్లి జరిగినట్లు ఒక సందర్భంలో చెప్పుకొచ్చింది పూర్ణ.

ఇక 2023 ఏప్రిల్‌లో హమ్దాన్ అసిఫ్ అలీ అనే పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది పూర్ణ. తాజాగా తన కుమారుడి రెండో పుట్టిన రోజు వేడుకలను గ్రాండ్ గా నిర్వహంచారు పూర్ణ దంపతులు.

ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో తెగ వైరలవుతున్నాయి. వీటిని చూసిన నెటిజన్లు పూర్ణ కుమారుడికి బర్త్ డే విషెస్ చెబుతున్నారు.




