AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs WI: విండీస్‌తో మ్యాచ్‌ నుంచి సంజు శాంసన్ ఔట్..? అసిస్టెంట్ కోచ్ కీలక అప్‌డేట్..

Sanju Samson Playing XI Update: టీమిండియా వెస్టిండీస్ జట్టుతో కీలక మ్యాచ్ ఆడేందుకు సిద్ధమైంది. అయితే, ఎలాంటి ప్లేయింగ్ 11తో బరిలోకి దిగనుందోననే ఆసక్తి అందరిలో నెలకొంది. ఎందుకంటే, టీమిండియా బ్యాడ్ లక్ ప్లేయర్ సంజూ శాంసన్ ఈ మ్యాచ్ ఆడతాడా లేదా అనేది సందిగ్ధంగా నెలకొంది.

IND vs WI: విండీస్‌తో మ్యాచ్‌ నుంచి సంజు శాంసన్ ఔట్..? అసిస్టెంట్ కోచ్ కీలక అప్‌డేట్..
Ind Vs Wi Playing 11
Venkata Chari
|

Updated on: Mar 01, 2026 | 3:55 PM

Share

Sanju Samson Playing XI Update: ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2026లో టీమిండియా ఇప్పుడు సెమీఫైనల్ కోసం ‘డూ ఆర్ డై’ మ్యాచ్‌లో వెస్టిండీస్‌ను ఎదుర్కొనబోతోంది. సెమీస్‌కి చేరాలంటే భారత్ తప్పనిసరిగా ఈ మ్యాచ్ గెలవాలి. ఈ కీలక పోరుకు సంజు శాంసన్ ప్లేయింగ్ ఎలెవన్‌లో ఉంటాడా? లేదా అన్న ప్రశ్నకు అసిస్టెంట్ కోచ్ రయాన్ టెన్ డస్కాటే క్లారిటీ ఇచ్చాడు. ఆ వివరాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

సంజు శాంసన్‌పై కీలక అప్‌డేట్..

ఇటీవల ఓపెనింగ్‌లో ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ వంటి ఎడమచేతి బ్యాటర్లు ఆశించిన స్థాయిలో రాణించలేదు. దీంతో జింబాబ్వేపై జరిగిన మ్యాచ్‌లో టీమ్ మేనేజ్‌మెంట్ రింకు సింగ్‌ను బెంచ్‌పై ఉంచి, సంజు శాంసన్‌ను ఓపెనర్‌గా పంపింది.

అభిషేక్ శర్మతో కలిసి సంజు శాంసన్ 48 పరుగుల వేగవంతమైన భాగస్వామ్యాన్ని నమోదు చేశాడు. ఆ ఆరంభం కారణంగా భారత్ భారీ స్కోర్ వైపు దూసుకెళ్లింది.

ఈ నేపథ్యంలో సంజు ప్లేయింగ్ ఎలెవన్‌లో కొనసాగుతాడా? అన్న ప్రశ్నకు రయాన్ టెన్ డస్కాటే క్లారిటీ ఇచ్చాడు. “మా ఆటగాళ్ల బలం వారి వెర్సటిలిటీ. పరిస్థితులకు అనుగుణంగా వారు తమ ఆటను మార్చుకోగలరు. ముందుగా పిచ్‌ను పరిశీలిస్తాం. ఆ తర్వాత కాంబినేషన్‌పై నిర్ణయం తీసుకుంటాం. సంజు మంచి టచ్‌లో ఉన్నాడు. భాగస్వామ్యాలపై దృష్టి పెట్టాలి. గత మ్యాచ్‌లో చేసినదే మళ్లీ చేస్తాం” అంటూ చెప్పుకొచ్చాడు. దీంతో సంజు శాంసన్ వెస్టిండీస్‌పై కూడా ఓపెనర్‌గా కొనసాగే అవకాశాలు ఉన్నాయని సంకేతాలు ఇచ్చాడు.

భారత్ సెమీఫైనల్‌కు చేరాలంటే ఏం చేయాలి?

దక్షిణాఫ్రికా చేతిలో 76 పరుగుల తేడాతో ఓడిపోయిన తర్వాత భారత్ జింబాబ్వేపై ఘనంగా పుంజుకుంది. అభిషేక్ శర్మ 55 పరుగులతో ఫామ్‌లోకి వచ్చాడు. హార్దిక్ పాండ్యా, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ దూకుడైన ఇన్నింగ్స్‌లతో భారత్ 256 పరుగుల భారీ స్కోర్ నమోదు చేసింది.

72 పరుగుల తేడాతో గెలిచి సెమీఫైనల్ ఆశలు సజీవంగా ఉంచుకున్న టీమిండియా, ఇప్పుడు వెస్టిండీస్‌పై విజయం సాధించాల్సిందే.

మొత్తానికి, సంజు శాంసన్‌పై తుది నిర్ణయం పిచ్ పరిస్థితులు, జట్టు వ్యూహాల ఆధారంగా టాస్ సమయంలో తీసుకోబడుతుంది. కానీ, ప్రస్తుతం ఆయన మంచి ఫామ్‌లో ఉన్నందున మరోసారి అవకాశమివ్వడం ఖాయం అన్న సంకేతాలు కనిపిస్తున్నాయి.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us