AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ISRO Jobs 2026: ఇస్రోలో ఉద్యోగాలు.. GATE స్కోర్ ఉంటే సూపర్ ఛాన్స్! ఆగస్టు 1 నుంచి దరఖాస్తులు

ISRO Recruitment 2026: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో)లో 92 సైంటిస్ట్/ఇంజినీర్ 'ఎస్‌సీ' పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. GATE స్కోర్‌తో బీఈ/బీటెక్ అభ్యర్థులు ఆగస్టు 1 నుంచి 17 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన వివరాలు తెలుసుకోండి.

ISRO Jobs 2026: ఇస్రోలో ఉద్యోగాలు.. GATE స్కోర్ ఉంటే సూపర్ ఛాన్స్! ఆగస్టు 1 నుంచి దరఖాస్తులు
Isro Recruitment 2026
Rajashekher G
|

Updated on: Jul 29, 2026 | 1:29 PM

Share

ISRO Recruitment 2026 Telugu: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో)లో ఉద్యోగం చేయాలనుకునే ఇంజినీరింగ్ అభ్యర్థులకు శుభవార్త. అంతరిక్ష సంస్థ ఇస్రో (ISRO) వివిధ ఇంజినీరింగ్ విభాగాల్లో సైంటిస్ట్/ఇంజినీర్ ‘ఎస్‌సీ’ (Scientist/Engineer ‘SC’) పోస్టుల భర్తీకి అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నియామక ప్రక్రియ ద్వారా మొత్తం 92 ఖాళీలను భర్తీ చేయనుంది. అర్హత కలిగిన అభ్యర్థులు 2026 ఆగస్టు 1 నుంచి ఆగస్టు 17 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

పోస్టు వివరాలు

  • పోస్టు పేరు: సైంటిస్ట్/ఇంజినీర్ ‘ఎస్‌సీ’
  • మొత్తం ఖాళీలు: 92

విభాగాల వారీగా ఖాళీలు

  • ఎలక్ట్రానిక్స్ – 34
  • మెకానికల్ – 26
  • కంప్యూటర్ సైన్స్ – 13
  • సివిల్ – 10
  • ఎలక్ట్రికల్ – 4
  • రిఫ్రిజిరేషన్ & ఎయిర్ కండీషనింగ్ – 2
  • ఆర్కిటెక్చర్ – 2
  • సివిల్ (అటానమస్ బాడీ – పీఆర్‌ఎల్) – 1

విద్యార్హత

అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత ఇంజినీరింగ్ విభాగంలో బీఈ/బీటెక్ పూర్తి చేసి ఉండాలి. కనీసం 65 శాతం మార్కులు లేదా CGPA 6.84/10 సాధించి ఉండాలి. అదనంగా సంబంధిత విభాగంలో చెల్లుబాటు అయ్యే GATE స్కోర్ తప్పనిసరి.

వయోపరిమితి

2026 ఆగస్టు 17 నాటికి అభ్యర్థుల వయస్సు 28 సంవత్సరాలకు మించకూడదు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, పీడబ్ల్యూబీడీ తదితర రిజర్వ్డ్ వర్గాలకు కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

దరఖాస్తు విధానం

  • అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేయాలి.
  • దరఖాస్తుల ప్రారంభ తేదీ: ఆగస్టు 1, 2026
  • చివరి తేదీ: ఆగస్టు 17, 2026

దరఖాస్తు ఫీజు

  • ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ, మహిళా అభ్యర్థులు: ఫీజు మినహాయింపు
  • ఇతర అభ్యర్థులు: రూ.250

ఎంపిక విధానం

అభ్యర్థుల ఎంపిక GATE వాలిడ్ స్కోర్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా జరుగుతుంది. ఇస్రోలో ఉద్యోగం చేయాలనుకునే ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్లకు ఇది మంచి అవకాశం. ముఖ్యంగా GATE అర్హత కలిగిన అభ్యర్థులు నిర్ణీత గడువులోపు దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు.

మరిన్ని వివరాలు, అధికారిక నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. 

Follow Us