AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కోటి రూపాయల జీతం ఉన్న ఐఐటీయన్.. రూ. 15 వేల కోసం అప్పులు..! ఇది మనందరికీ గుణపాఠం..?

భారీ వేతనం, అనేక ఆస్తులు ఉన్నంత మాత్రాన ఒక వ్యక్తి ఆర్థికంగా సురక్షితంగా ఉన్నట్లు కాదని నిరూపించే ఒక విచిత్ర ఘటన ఇటీవల వెలుగులోకి వచ్చింది. ఏటా రూ. 1 కోటి ప్యాకేజీ పొందుతున్న ఒక ఐఐటీ పూర్వ విద్యార్థి, తన ఆదాయపు పన్ను చెల్లించడానికి అవసరమైన రూ. 15,000 తక్షణ నగదు లేక స్నేహితుడి నుంచి అప్పు తీసుకోవాల్సి వచ్చింది. అతని ఆర్థిక పరిస్థితిని వివరిస్తూ ఒక చార్టర్డ్ అకౌంటెంట్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన పాఠం ఇప్పుడు పర్సనల్ ఫైనాన్స్ విభాగంలో చర్చనీయాంశంగా మారింది.

కోటి రూపాయల జీతం ఉన్న ఐఐటీయన్.. రూ. 15 వేల కోసం అప్పులు..! ఇది మనందరికీ గుణపాఠం..?
Asset Rich Cash Poor
Jyothi Gadda
|

Updated on: Jul 29, 2026 | 1:28 PM

Share

చాలామంది దృష్టిలో రూ. 1 కోటి జీతం, విలాసవంతమైన ఇళ్ళు ఉంటే ఆర్థికంగా తిరుగులేని స్థాయిలో ఉన్నట్లే. కానీ, ఆర్థిక నిర్వహణలో చిన్న పొరపాటు జరిగితే, అంత భారీ ఆదాయం ఉన్నవారు కూడా తీవ్రమైన నగదు కొరతను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఒక ఐఐటీ పూర్వ విద్యార్థికి ఎదురైన ఈ విచిత్రమైన పరిస్థితి ఇప్పుడు సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

సదరు ఐఐటీయన్ సంపాదన కోట్లలో ఉన్నప్పటికీ, అతను తన ఆదాయంలో మెజారిటీ భాగాన్ని రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడిగా పెట్టాడు. మూడు విలాసవంతమైన ఇళ్లను కొనుగోలు చేసి, వాటికి నెలానెలా భారీ మొత్తంలో ఈఎంఐలు చెల్లిస్తున్నాడు. వచ్చే జీతమంతా రుణాల వాయిదాలకే సరిపోవడం వల్ల అతని బ్యాంకు ఖాతాలో ద్రవ్య రూపంలో సేవింగ్స్ చాలా తక్కువగా ఉండేవి. పన్నుల బకాయిలు చెల్లించాల్సిన సమయం నాటికి చేతిలో కనీస నగదు లేకపోవడంతో ఈ పరిస్థితి ఎదురైంది.

ఇవి కూడా చదవండి

ఈ పరిస్థితిని ఆర్థిక నిపుణులు అస్సెట్ రిచ్, క్యాష్ పూర్ అని పిలుస్తారు. ఇళ్ళు లేదా స్థలాలు వంటి ఆస్తుల విలువ కోట్లలో ఉంటుంది.. కానీ, వాటిని తక్షణమే నగదుగా మార్చడం సాధ్యం కాదు. హఠాత్తుగా వచ్చే ఖర్చులు లేదా పన్నుల చెల్లింపుల కోసం కొంత డబ్బును సేవింగ్స్ రూపంలో పక్కన పెట్టకపోవడం అతిపెద్ద పొరపాటు అంటున్నారు ఆర్థిక విశ్లేషకులు.

సీఏ సూచిస్తున్న ముఖ్యమైన ఫైనాన్షియల్ లెసన్స్:

నగదు నిర్వహణ: మన సంపాదనలో కొంత భాగం ఎప్పుడూ తక్షణమే వాడుకోవడానికి వీలుగా సాధారణ సేవింగ్స్ లేదా లిక్విడ్ ఫండ్స్‌లో అందుబాటులో ఉండాలి.

రుణాల పరిమితి: ఆదాయంలో అత్యధిక శాతం ఈఎంఐలకే పోయేలా ప్లాన్ చేసుకోకూడదు.

ఆస్తుల వైవిధ్యం: మొత్తం డబ్బును కేవలం రియల్ ఎస్టేట్‌లోనే కాకుండా, గోల్డ్, స్టాక్స్ లేదా మ్యూచువల్ ఫండ్స్ వంటి త్వరగా నగదుగా మారే రంగాల్లో కూడా ఇన్వెస్ట్ చేయాలి.

అత్యధిక ఆదాయం కలిగి ఉండటం ఎంత ముఖ్యమో, దాన్ని సమర్థవంతంగా నిర్వహించడం అంతకంటే ముఖ్యం. సంపాదన పెరిగే కొద్దీ ఆస్తులను పెంచుకోవడంతో పాటు, అత్యవసర సమయాలకు సరిపడా నగదు లభ్యత ఉండేలా చూసుకోవడమే సరైన ఆర్థిక ప్రణాళిక.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us