AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral video: భూకంపం రావడానికి ముందే పసిగట్టిన పిల్లి.. ఏం చేసిందో చూస్తే షాక్‌ అవుతారు..వీడియో వైరల్‌

భూకంపానికి సంబంధించిన ఒక విచిత్రమైన, ఆసక్తికరమైన వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. భూకంపం సంభవించి గది ఊగడానికి కొన్ని క్షణాల ముందే, ఒక పిల్లి ప్రమాదాన్ని పసిగట్టి అప్రమత్తమైంది. గదిలోని వస్తువులు కదలడానికి ముందే ఆ పిల్లి తన చెవులను రిక్కించి, ఏదో అనూహ్యమైన మార్పును గ్రహించి భయంతో ఇటూ అటూ పరుగులు తీసింది. జంతువులు భూకంపాలను లేదా ప్రకృతి విపత్తులను మానవుల కంటే ముందే ఎలా గ్రహించగలవు అనేదానికి ఈ సంఘటన సజీవ సాక్ష్యంగా నిలిచింది.

Viral video: భూకంపం రావడానికి ముందే పసిగట్టిన పిల్లి.. ఏం చేసిందో చూస్తే షాక్‌ అవుతారు..వీడియో వైరల్‌
Cat Senses Earthquake
Jyothi Gadda
|

Updated on: Jul 29, 2026 | 1:06 PM

Share

ప్రకృతి విపత్తులను, ముఖ్యంగా భూకంపాలను మానవులు గుర్తించేసరికే జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. కానీ, మూగజీవాలు ముఖ్యంగా జంతువులు ప్రకృతిలో జరిగే చిన్నచిన్న మార్పులను కూడా చాలా సులభంగా పసిగట్టగలవు. తాజాగా జపాన్‌లో చోటుచేసుకున్న ఒక సంఘటన ఈ విషయాన్ని మరోసారి రుజువు చేసింది. జపాన్‌లో భూకంపం వచ్చి గది తీవ్రంగా ఊగడానికి కొద్ది క్షణాల ముందే, ఒక పిల్లి ఆ ప్రమాదాన్ని ముందే గ్రహించిన దృశ్యాలు సిసిటీవీ కెమెరాలో రికార్డయ్యాయి. ఇప్పుడు ఆ వీడియో ఇంటర్‌ నెట్‌లో విపరీతంగా వైరల్‌ అవుతోంది.

వీడియోలో ఏం జరిగింది?

వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. ఒక ఇంట్లోని గదిలో పిల్లి చాలా ప్రశాంతంగా కూర్చుని ఉంది. హఠాత్తుగా ఆ పిల్లి తన చెవులను రిక్కించి, చుట్టూ వింతగా చూడటం ప్రారంభించింది. కొద్ది క్షణాల్లోనే ఏదో ప్రమాదం రాబోతోందని గ్రహించి భయంతో దిక్కుతోచక అటూ ఇటూ పరుగులు తీసింది. ఆ పిల్లి పరిగెత్తిన కొన్ని సెకన్ల వ్యవధిలోనే గదిలోని పర్నిచర్, వస్తువులు తీవ్రంగా ఊగడం భూకంప ప్రకంపనలు కనిపించింది. గది ఊగడానికంటే ముందే పిల్లి ఈ ప్రమాదాన్ని గ్రహించడం గమనార్హం.

ఇవి కూడా చదవండి

జంతువులు భూకంపాలను ఎలా పసిగట్టగలవు?

శాస్త్రవేత్తల ప్రకారం, భూకంపం సంభవించే సమయంలో రెండు రకాల తరంగాలు ఉద్భవిస్తాయి:

P-తరంగాలు: ఇవి చాలా వేగంగా ప్రయాణిస్తాయి. కానీ, చాలా సూక్ష్మంగా ఉంటాయి. వీటిని మనుషులు గ్రహించలేరు.

S-తరంగాలు: ఇవి పి-తరంగాల తర్వాత వస్తాయి. ఇవే నేలను, భవనాలను తీవ్రంగా ఊపేస్తాయి.

పిల్లులు, కుక్కలు, ఇతర జంతువుల శ్రవణశక్తి, శరీరంపై ఉండే సూక్ష్మ జ్ఞానేంద్రియాలు పి-తరంగాల వల్ల కలిగే అతి చిన్న కంపనాలను లేదా శబ్దాలను వెంటనే గ్రహించగలవు. అందుకే మనుషులకు ఎస్-తరంగాలు తగిలి భవనాలు ఊగే లోపే జంతువులు అప్రమత్తమవుతాయి. సోషల్ మీడియాలో వీడియో వైరల్‌ గా మారడంతో నెటిజన్లు పెద్ద ఎత్తున తమ స్పందనలు తెలియజేశారు.

వీడియో ఇక్కడ చూడండి..

సోషల్ మీడియాలో నెటిజన్ల స్పందన:

ఈ వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేయబడిన కొద్ది సమయంలోనే లక్షలాది వీక్షణలు సాధించింది. జంతువులకు ఉండే ఈ అద్భుతమైన ఆరవ ఇంద్రియం గురించి నెటిజన్లు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రకృతి ఆపదలను పసిగట్టడంలో సాంకేతికత కంటే జంతువుల సహజ సిద్ధమైన జ్ఞానమే వేగవంతమైనదని ఈ సంఘటన నిరూపిస్తోంది.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us
తొలిరాత్రే షాక్ ఇచ్చిన భార్య.. విడాకుల కోసం రెండేళ్లు తిరిగి
తొలిరాత్రే షాక్ ఇచ్చిన భార్య.. విడాకుల కోసం రెండేళ్లు తిరిగి
జాలరి ముఖాన్ని చుట్టేసిన ఆక్టోపస్., ఊపిరాడక మృత్యువు అంచుల్లోకి..
జాలరి ముఖాన్ని చుట్టేసిన ఆక్టోపస్., ఊపిరాడక మృత్యువు అంచుల్లోకి..
వరాలు కురిపిస్తున్న వర మహాలక్ష్మీ.. వీరి జీవితాల్లో గొప్ప మార్పు
వరాలు కురిపిస్తున్న వర మహాలక్ష్మీ.. వీరి జీవితాల్లో గొప్ప మార్పు
10 వేల అడుగుల వాకింగ్ వెనుక పెద్ద బిజినెస్ సీక్రెట్..
10 వేల అడుగుల వాకింగ్ వెనుక పెద్ద బిజినెస్ సీక్రెట్..
రాఖీ పౌర్ణమి 27 లేదా 28నా.. గ్రహణం రోజు రాఖీ కట్టవచ్చా?
రాఖీ పౌర్ణమి 27 లేదా 28నా.. గ్రహణం రోజు రాఖీ కట్టవచ్చా?
ATM మిషన్ మీ కార్డును లోపలే ఎందుకు పట్టుకుంటుంది? అసలు కారణం ఇదే!
ATM మిషన్ మీ కార్డును లోపలే ఎందుకు పట్టుకుంటుంది? అసలు కారణం ఇదే!
వీరి ఇంటికి పరిగెత్తుక వస్తున్న అదృష్ట లక్ష్మీ.. చేతినిండా డబ్బే
వీరి ఇంటికి పరిగెత్తుక వస్తున్న అదృష్ట లక్ష్మీ.. చేతినిండా డబ్బే
ఎనిమిది మంది కొడుకులు, ఐదుగురు కూతుళ్లు ఉన్నా భిక్షాటనే దిక్కు..
ఎనిమిది మంది కొడుకులు, ఐదుగురు కూతుళ్లు ఉన్నా భిక్షాటనే దిక్కు..
మెయిడెన్ ఓవర్ల మొనగాడు.. వరుసగా 21 ఓవర్లలో 0 పరుగులు!
మెయిడెన్ ఓవర్ల మొనగాడు.. వరుసగా 21 ఓవర్లలో 0 పరుగులు!
చంద్రుడి అనుగ్రహం..ఆ రాశులను అదృష్టం తలుపు తట్టే ఛాన్స్..!
చంద్రుడి అనుగ్రహం..ఆ రాశులను అదృష్టం తలుపు తట్టే ఛాన్స్..!
సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ
సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ
రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..
రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?
రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే
రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే
బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..
బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..
భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా
భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా
బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ
బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ
రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!
రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!
మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర
మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర