AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఎలన్ మస్క్ సంచలన నిర్ణయం.. ఇక Xలోనే డబ్బుల లావాదేవీలు.. !

సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ X (గతంలో ట్విట్టర్)ను ‘ఎవ్రీథింగ్ యాప్’గా తీర్చిదిద్దాలన్న ఎలాన్ మస్క్ లక్ష్యంలో మరో కీలక అడుగు పడింది. వినియోగదారులు ఒకరికొకరు తక్షణమే డబ్బు పంపించుకునేలా ‘X Money’ పేరుతో కొత్త ఆర్థిక సేవను సంస్థ ప్రారంభించింది. ప్రస్తుతం ఈ సేవను పరిమిత స్థాయిలో, కేవలం ఆహ్వానం పొందిన వినియోగదారులకు మాత్రమే అందుబాటులోకి తీసుకొచ్చింది.

ఎలన్ మస్క్ సంచలన నిర్ణయం.. ఇక Xలోనే డబ్బుల లావాదేవీలు.. !
Elon Musk Launches X Money
Balaraju Goud
|

Updated on: Jul 29, 2026 | 1:18 PM

Share

సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ X (గతంలో ట్విట్టర్)ను ‘ఎవ్రీథింగ్ యాప్’గా తీర్చిదిద్దాలన్న ఎలాన్ మస్క్ లక్ష్యంలో మరో కీలక అడుగు పడింది. వినియోగదారులు ఒకరికొకరు తక్షణమే డబ్బు పంపించుకునేలా ‘X Money’ పేరుతో కొత్త ఆర్థిక సేవను సంస్థ ప్రారంభించింది. ప్రస్తుతం ఈ సేవను పరిమిత స్థాయిలో, కేవలం ఆహ్వానం పొందిన వినియోగదారులకు మాత్రమే అందుబాటులోకి తీసుకొచ్చింది. దీంతో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ నుంచి డిజిటల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రంగంలోకి X అధికారికంగా అడుగుపెట్టినట్లైంది.

X Money సాధారణ బ్యాంక్ ఖాతాల మాదిరిగా పనిచేసినా, ఇది స్వతంత్ర బ్యాంక్ కాదు. అమెరికాకు చెందిన క్రాస్ రివర్ బ్యాంక్ అందించే బ్యాంకింగ్ మౌలిక సదుపాయాలపై ఈ సేవ ఆధారపడి పనిచేస్తుంది. అయితే వినియోగదారులకు కనిపించే అన్ని సేవలు, అనుభవం పూర్తిగా X Money బ్రాండ్‌తోనే ఉంటాయి.

ప్రస్తుతానికి ఈ సేవను X Premium సబ్‌స్క్రైబర్లకు మాత్రమే అందిస్తున్నారు. అర్హులైన వారికి ఆహ్వానాలు పంపించి సేవలో చేర్చుకుంటున్నారు. సేవలో చేరిన వినియోగదారులకు X బ్రాండెడ్ Visa డెబిట్ కార్డు కూడా అందజేస్తున్నారు. ఈ కార్డును Visa ఆమోదించే ఏటీఎంలు, వ్యాపార సంస్థల్లో ఉపయోగించుకోవచ్చు. అలాగే ఇతర X వినియోగదారులకు తక్షణమే డబ్బు బదిలీ చేసే పీర్-టు-పీర్ చెల్లింపుల సౌకర్యం కూడా అందుబాటులో ఉంటుంది.

వినియోగదారులను ఆకర్షించేందుకు X Money ప్రత్యేక ఆఫర్లను ప్రకటించింది. ఖాతాలో కనీసం 1,000 డాలర్ల బ్యాలెన్స్ కొనసాగిస్తే ఏడాదికి 6 శాతం వడ్డీ అందిస్తామని తెలిపింది. అదనంగా X Premium సభ్యత్వం తప్పనిసరి. డెబిట్ కార్డు ద్వారా చేసే అర్హత కలిగిన కొనుగోళ్లపై 3 శాతం క్యాష్‌బ్యాక్ కూడా అందించనుంది. ఈ ఆఫర్లు వినియోగదారులను తమ ప్లాట్‌ఫామ్‌లోనే ఆర్థిక లావాదేవీలు నిర్వహించేలా ప్రోత్సహించేందుకు ఉద్దేశించినవిగా కంపెనీ చెబుతోంది.

ఎలాన్ మస్క్‌కు డిజిటల్ బ్యాంకింగ్ రంగం కొత్తది కాదు. టెస్లా, స్పేస్‌ఎక్స్‌కు ముందు ఆయన స్థాపించిన X.com సంస్థే తర్వాత పేపాల్‌గా రూపాంతరం చెందింది. ఇప్పుడు అదే అనుభవాన్ని ఆధారంగా చేసుకుని Xను సోషల్ మీడియాతో పాటు చెల్లింపులు, బ్యాంకింగ్, వాణిజ్య సేవలు అందించే సమగ్ర డిజిటల్ వేదికగా మార్చాలని ఆయన లక్ష్యంగా పెట్టుకున్నారు. అయితే X Moneyకి ముందున్న సవాళ్లు కూడా తక్కువ కావు. ప్రస్తుతం Venmo, Zelle, Cash App వంటి ప్రముఖ పీర్-టు-పీర్ చెల్లింపు సేవలకు కోట్లాది మంది వినియోగదారులు ఉన్నారు. అలాంటి సంస్థలతో పోటీ పడుతూ వినియోగదారులను X ఎకోసిస్టమ్‌లోనే నిలబెట్టడం మస్క్‌కు పెద్ద పరీక్షగా మారనుంది.

అయినా, సోషల్ మీడియా, డిజిటల్ చెల్లింపులు, అధిక వడ్డీ, క్యాష్‌బ్యాక్ వంటి సేవలను ఒకే వేదికపై అందించడం ద్వారా X Money వినియోగదారులను ఆకర్షించే అవకాశం ఉందని మార్కెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రస్తుతం ఆహ్వానం ద్వారా మాత్రమే సేవను ప్రారంభించిన X, దశలవారీగా ప్రపంచవ్యాప్తంగా మరింత విస్తరించే ప్రణాళికతో ముందుకెళ్తోంది. ఈ ప్రయోగం విజయవంతమైతే, X కేవలం సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌గా కాకుండా డిజిటల్ ఫైనాన్స్ రంగంలోనూ కీలక సంస్థగా ఎదిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us