AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సమ్మర్ టూర్ ప్లాన్ చేస్తున్నారా..? హైదరాబాద్ టూ విశాఖ, అరకు.. మీ బడ్జెట్‌లోనే సూపర్ ప్యాకేజీ.!

Summer Tour Packages: వేసవి సెలవుల్లో ఆకర్షణీయ ప్రదేశాల్లో పర్యటించి సేద తీరాలనుకుంటున్నారు. అయితే, మీ కోసం తెలంగాణ పర్యాటక శాఖ ఒక అద్భుతమైన టూర్ ప్యాకేజీని అందిస్తోంది. ఇది మీకు తక్కువ ధరలోనే ఆకర్షణీయమైన పర్యాటక ప్రదేశాలు, బీచ్ అందాలు, ప్రకృతి సోయగాలు వీక్షించే అవకాశం ఇస్తుంది. మరి, ఈ టూర్ ప్యాకేజీ ఏంటి? ఇందులో ఏయే ప్రాంతాలు ఉన్నాయి? టికెట్ ధరలు ఎంత? అన్నింటిని ఈ స్టోరీలో తెలుసుకుందాం.

సమ్మర్ టూర్ ప్లాన్ చేస్తున్నారా..? హైదరాబాద్ టూ విశాఖ, అరకు.. మీ బడ్జెట్‌లోనే సూపర్ ప్యాకేజీ.!
Summer Tour Plan
Rajashekher G
|

Updated on: Mar 01, 2026 | 3:37 PM

Share

వేసవి వస్తుందంటేనే చాలా మంది తమ సెలవులను ఉత్సాహంగా ప్లాన్ చేస్తారు. బడ్జెట్‌కి తగినట్లుగా.., ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ, పర్యాటక ప్రదేశాలను సందర్శించాలనుకుంటారు. మీరు కూడా ఈ వేసవిలో ఒక మంచి పర్యాటక ప్రదేశాన్ని చూడాలనుకుంటున్నారా? అయితే, తెలంగాణ పర్యాటక శాఖ ఒక అద్భుతమైన టూర్ ప్యాకేజీని అందిస్తోంది. ఇది మీకు తక్కువ ధరలోనే ఆకర్షణీయమైన పర్యాటక ప్రదేశాలు, బీచ్ అందాలు, ప్రకృతి సోయగాలు వీక్షించే అవకాశం ఇస్తుంది. మరి, ఈ టూర్ ప్యాకేజీ ఏంటి? ఇందులో ఏయే ప్రాంతాలు ఉన్నాయి? టికెట్ ధరలు ఎంత? అన్నింటిని ఈ స్టోరీలో తెలుసుకుందాం.

తెలంగాణ టూరిజం – Hyderabad – Vizag – Araku టూర్ ప్యాకేజీ

ఈ పర్యటన నాలుగు రాత్రులు, ఐదు రోజులుగా జరుగుతుంది. హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గం ద్వారా అరకు టూర్ ప్రారంభమవుతుంది.

డే 1: మొదటి రోజు సాయంత్రం 6 గంటలకు హైదరాబాద్ IRO పర్యాటక భవన్ నుంచి బస్సు బయలుదేరుతుంది. 6:30 గంటలకు CRO బషీర్‌బాగ్ వద్ద చేరుకుని, అక్కడ నుంచి అర్థ రాత్రి ప్రయాణం మొదలవుతుంది. మార్గమధ్యంలో భోజనం ఉంటుంది.

డే 2: రెండో రోజు ఉదయం 6 గంటలకు వైజాగ్ చేరుకుంటారు. అక్కడ ప్రైవేట్ హోటల్ లో ఫ్రెషప్ అయ్యి, టిఫిన్ తీసుకుని, సైట్ విజిటింగ్‌కు వెళ్ళిపోతారు. ఈ రోజున మీరు సందర్శించేది:

  • కైలాసగిరి
  • సింహాచలం దేవాలయం
  • రుషికొండ బీచ్
  • సబ్‌మెరైన్ మ్యూజియం
  • వైజాగ్ బీచ్ – సాయంత్రం ఎంజాయ్ చేయవచ్చు.
  • అంతటితో మీరు హోటల్‌కు చేరుకుని, అక్కడ రాత్రి భోజనం చేసి బస చేస్తారు.

డే 3: మూడో రోజు ఉదయం టిఫెన్ చేసి, రోడ్డు మార్గంలో అరకు పర్యటన ప్రారంభమవుతుంది. అక్కడ ట్రైబల్ మ్యూజియం, అనంతగిరి కాఫీ ప్లాంటేషన్స్, బొర్రా గుహలు సందర్శిస్తారు. సాయంత్రం ధింసా డ్యాన్స్ వీక్షించనున్నారు. ఆ రోజు రాత్రి అరకులోనే బస ఉంటుంది.

డే 4: నాలుగో రోజు, అరకు నుంచి అన్నవరానికి ప్రయాణం ప్రారంభమవుతుంది. అక్కడ సత్యనారాయణ టెంపుల్ సందర్శిస్తారు. అనంతరం హైదరాబాద్‌కు తిరిగి ప్రయాణం మొదలవుతుంది.

డే 5: ఐదో రోజు ఉదయం 7 గంటలకు హైదరాబాద్ చేరుకుంటారు, మీరు ముగించుకున్నట్లయితే, మీ అరకు పర్యటన పూర్తయింది.

ప్యాకేజీ వివరాలు:

టికెట్ ధరలు:

పెద్దలకు: ₹7,500 5 నుంచి 12 ఏళ్ల పిల్లల కోసం: ₹600

ప్యాకేజీలో ఏమి ఉంటుంది?

  • నాన్-ఏసీ వెహికల్‌లో ప్రయాణం
  • వైజాగ్‌లో ఏసీ హోటల్‌లో, అరకులో నాన్-ఏసీ హోటల్‌లో వసతి
  • సైట్ సీయింగ్, గైడ్ ఛార్జీలు
  • వైజాగ్, అరకు సైట్ విజిట్స్
  • హోటల్ బుకింగ్

ప్యాకేజీలో ఉండని అంశాలు: ఫుడ్, ఎంట్రీ టికెట్లు, దర్శన టికెట్లు, బోటింగ్ ఛార్జీలు, లాండ్రీ ఛార్జీలు

బుకింగ్, డేట్స్:

ప్రస్తుతం హైదరాబాద్ నుంచి అరకు టూర్ మార్చి 5వ తేదీన ప్రారంభం అవుతుంది. ఆ తర్వాత మార్చి 12, 19, 26, ఏప్రిల్ 2వ తేదీలలో కూడా పర్యాటకులకు అందుబాటులో ఉంటుంది.

మరిన్ని వివరాలు, బుకింగ్ కోసం  ఇక్కడ క్లిక్ చేసి తెలుసుకోండి.

Follow Us