AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Expressways: మీరు హైవేపై కారులో రయ్యుమంటూ స్పీడ్‌గా వెళ్తున్నారా? ఇది తెలుసుకోవాల్సిందే!

Expressways: నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా AI-ఆధారిత అధునాతన ట్రాఫిక్ నిర్వహణ వ్యవస్థను అమలు చేసింది. ఇందులో ఎక్స్‌ప్రెస్‌వేపై ఏర్పాటు చేసిన హై-రిజల్యూషన్ CCTV కెమెరాలు ఉన్నాయి. ఈ కెమెరాలలో AI వీడియో అనలిటిక్స్, ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ గుర్తింపు వంటి లక్షణాలు..

Expressways: మీరు హైవేపై కారులో రయ్యుమంటూ స్పీడ్‌గా వెళ్తున్నారా? ఇది తెలుసుకోవాల్సిందే!
Expressways
Subhash Goud
|

Updated on: Mar 01, 2026 | 3:36 PM

Share

Expressways: ఎక్స్‌ప్రెస్‌వేపై కారు నడపడం ఒక ఆనందం. కానీ ఈ ఆనందం మీకు నష్టాన్ని కూడా కలిగించవచ్చు. హైవేలపై వెళ్లే వాహనాలు స్పీడ్‌గా వెళ్తుంటాయి. ఎక్స్‌ప్రెస్‌వేపై వెళ్లే కార్లు తరచుగా హైస్పీడ్‌తో వెళ్తుంటాయి. ముఖ్యంగా యువకులు ఖాళీగా ఉన్న ఎక్స్‌ప్రెస్‌వే రోడ్డును చూసి ఉత్సాహంగా ఉంటారు. యాక్సిలరేటర్‌పై కాలుతో నొక్కారంటే చాలు కారు రయ్యుమం

టూ దూసుకెళ్లాల్సిందే. వేగం గంటకు 150 కిలోమీటర్ల మేర వెళ్లినా కూడా వారికి వేగం ఎంత ఉందో కూడా తెలియని పరిస్థితి ఉంటుంది. అందుకే ఎక్స్‌ప్రెస్‌వేపై వెళ్లేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. స్పీడ్‌కు మించి వెళ్లినట్లయితే మీరు పెనాల్టీ కట్టాల్సిందే. ఎందుకంటే ఇంటెలిజెంట్ ట్రాఫిక్ సిస్టమ్స్ (ITMS) అనేక ఎక్స్‌ప్రెస్‌వేలపై అమలు చేస్తోంది. ఇది మీకు తెలియకుండానే మీకు చలాన్ జారీ చేస్తుంది.

ITMS ద్వారా ట్రాఫిక్ విభాగం ఎక్స్‌ప్రెస్‌వేను 24 గంటలూ పర్యవేక్షిస్తుంది. కారు అతివేగంగా వెళుతుంటే స్వయంచాలకంగా చలాన్ జారీ అవుతుంది. ప్రతి ఎక్స్‌ప్రెస్‌వేపై వెళ్లేటప్పుడు వేగపరిమితి ఉంటుంది. వేగ పరిమితి మించి వెళ్లినట్లయితే మీకు చలాన్‌ జారీ అవుతుంది. దీంతో మీరు ఆర్థికంగా నష్టపోవాల్సి ఉంటుంది. వాహనాల వేగ పరిమితిని పర్యవేక్షించడానికి, ట్రాఫిక్ విభాగం ITMSను అమలు చేసింది. ఇది అతివేగంగా వెళ్లే వాహనాలకు స్వయంచాలకంగా చలాన్‌లను జారీ చేస్తుంది.

Income Tax: మీరు మీ బంధువుల ఇంటిని అద్దెకు తీసుకుంటున్నారా? ఇక కొత్త నిబంధనలు

ఈ వ్యవస్థ ఎలా పనిచేస్తుంది:

నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా AI-ఆధారిత అధునాతన ట్రాఫిక్ నిర్వహణ వ్యవస్థను అమలు చేసింది. ఇందులో ఎక్స్‌ప్రెస్‌వేపై ఏర్పాటు చేసిన హై-రిజల్యూషన్ CCTV కెమెరాలు ఉన్నాయి. ఈ కెమెరాలలో AI వీడియో అనలిటిక్స్, ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ గుర్తింపు వంటి లక్షణాలు ఉన్నాయి. ఈ కెమెరాలు ఎక్స్‌ప్రెస్‌వేపై ప్రయాణించే వాహనాల వేగాన్ని లెక్కిస్తాయి. వివిధ ప్రదేశాలలో రెండు పాయింట్ల మధ్య సగటు దూరాన్ని కొలుస్తారు. వేగ పరిమితి నిర్దేశించిన ప్రమాణాన్ని మించి ఉంటే ఇ-చలాన్ జారీ చేస్తారు.

ఇది కూడా చదవండి: Scooters Warranty: 10 సంవత్సరాల పాటు వారంటీతో వచ్చే స్కూటర్లు!

Lifestyle: మీకు మద్యం తాగే అలవాటు ఉందా..? ఈ తప్పు అస్సలు చేయకండి!

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
భారత ట్రక్కు డ్రైవర్లు.. వెళ్లిపొండి! సిక్కు సంఘాలు సీరియస్
భారత ట్రక్కు డ్రైవర్లు.. వెళ్లిపొండి! సిక్కు సంఘాలు సీరియస్
పుతిన్, జిన్‌పింగ్‌కు స్పెషల్ సెక్యూరిటీ.. ఏ రేంజ్‌లో ఉందంటే!
పుతిన్, జిన్‌పింగ్‌కు స్పెషల్ సెక్యూరిటీ.. ఏ రేంజ్‌లో ఉందంటే!
మరో వారంలో వీరికి జాక్‌పాట్.. కెరీర్‌లో పురోగతి, చేతిలో డబ్బు!
మరో వారంలో వీరికి జాక్‌పాట్.. కెరీర్‌లో పురోగతి, చేతిలో డబ్బు!
SBIలో ఎఫ్‌డీపై రూ. 1 లక్ష డిపాజిట్‌ చేస్తే మెచ్యూరిటీ సమయంలో ఎంత?
SBIలో ఎఫ్‌డీపై రూ. 1 లక్ష డిపాజిట్‌ చేస్తే మెచ్యూరిటీ సమయంలో ఎంత?
రైలు పట్టాల కింద కంకర రాళ్లు ఎందుకు పోస్తారో తెలుసా?
రైలు పట్టాల కింద కంకర రాళ్లు ఎందుకు పోస్తారో తెలుసా?
బొజ్జ గణపయ్యకి ఇష్టమైన బెల్లం కుడుములు..ఇలా చేస్తే రుచి అద్భుతమే
బొజ్జ గణపయ్యకి ఇష్టమైన బెల్లం కుడుములు..ఇలా చేస్తే రుచి అద్భుతమే
కనకాంబరం మొక్క పూలు పూయట్లేదా? ఇంట్లో దొరికే ఈ మూడు కలిపి వేయండి
కనకాంబరం మొక్క పూలు పూయట్లేదా? ఇంట్లో దొరికే ఈ మూడు కలిపి వేయండి
భారత్‌ అమ్ములపొదిలో 190 అణు వార్‌హెడ్లు.. తయారీ దశలో మరో 35
భారత్‌ అమ్ములపొదిలో 190 అణు వార్‌హెడ్లు.. తయారీ దశలో మరో 35
ఎండుమిరపకాయల పప్పు.. వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసి తింటే.. అబ్బో
ఎండుమిరపకాయల పప్పు.. వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసి తింటే.. అబ్బో
నిమ్మకాయలు నెల రోజులైనా ఫ్రెష్‌గా ఉంటాయ్.. ఈ సింపుల్ ట్రిక్స్..
నిమ్మకాయలు నెల రోజులైనా ఫ్రెష్‌గా ఉంటాయ్.. ఈ సింపుల్ ట్రిక్స్..