- Telugu News Photo Gallery Cinema photos Kajal Aggarwal not getting any chances in the second innings
కాజల్ అగర్వాల్‌ను ఇండస్ట్రీ లైట్ తీసుకుందా..? సెకండ్ ఇన్నింగ్స్‌లో స్పీడ్ తగ్గిందిగా..!!
టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్. తెలుగులో ఒకప్పుడు తోపు హీరోయిన్ గా రాణించింది కాజల్ అగర్వాల్. తెలుగులోనే కాదు తమిళ్ ల్లోనూ సినిమాలు చేసింది ఈ అమ్మడు. తెలుగులో దాదాపు అందరు హీరోలతో నటించింది. కెరీర్ పీక్ లో ఉండగానే పెళ్లి చేసుకొని సినిమాలకు గ్యాప్ ఇచ్చింది.
Updated on: May 03, 2025 | 8:56 PM

టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్. తెలుగులో ఒకప్పుడు తోపు హీరోయిన్ గా రాణించింది కాజల్ అగర్వాల్. తెలుగులోనే కాదు తమిళ్ ల్లోనూ సినిమాలు చేసింది ఈ అమ్మడు. తెలుగులో దాదాపు అందరు హీరోలతో నటించింది.

కెరీర్ పీక్ లో ఉండగానే పెళ్లి చేసుకొని సినిమాలకు గ్యాప్ ఇచ్చింది. పెళ్లి ఆతర్వాత తల్లి అవ్వడంతో సినిమాలకు కాస్త పెద్ద గ్యాప్ వచ్చింది. ఇక ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టింది.

పెళ్లి తర్వాత సత్యభామ, బాలకృష్ణ భగవంత్ కేసరి సినిమాల్లో నటించి మెప్పించింది. ప్రస్తుతం ఈ బ్యూటీ బాలీవుడ్ లో సినిమాలు చేస్తుంది. రీసెంట్ గా వచ్చిన సల్మాన్ ఖాన్ ,మురగదాస్ కాంబినేషన్ లో వచ్చిన సికిందర్ సినిమాలో నటించింది.

భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఇక సోషల్ మీడియాలోనూ ఈ బ్యూటీ చాలా యాక్టివ్ గా ఉంటుంది. తాజాగా ఈ బ్యూటీ షేర్ చేసిన ఫోటోలు వైరల్ గా మారాయి.

అయితే మునుపటిలా కాజల్ జోరు చూపించలేకపోతుంది. సెకండ్ ఇన్నింగ్స్ లో కాజల్ సినిమాల స్పీడ్ తగ్గిందనే చెప్పాలి. ప్రస్తుతం ఈ బ్యూటీ కొత్త ప్రాజెక్ట్స్ ఏమీ అనౌన్స్ చేయలేదు. దాంతో కాజల్ ను లైట్ తీసుకున్నారా అంటూ ఫాన్స్ అనుమానం వ్యక్తం చేస్తున్నారు.




