ప్రపంచవ్యాప్తంగా యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్న వేళ ముడి చమురు నిల్వలపై ఆందోళన పెరుగుతోంది. జపాన్, సింగపూర్ వంటి దేశాలకు ఎక్కువ రోజులకు సరిపడా నిల్వలు ఉండగా, భారతదేశం కేవలం 25 రోజులు, పాకిస్తాన్ 3 రోజులకు సరిపడా నిల్వలతో ఆందోళనకరంగా ఉంది. ఈ నేపథ్యంలో ప్రత్యామ్నాయ ఏర్పాట్ల దిశగా ప్రభుత్వాలు అడుగులు వేస్తున్నాయి.