AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మద్యం మత్తులో బైక్‌ను ఢీకొట్టిన తాగుబోతులు.. అడ్డుకున్న వారిపై కర్రలు, రాడ్లతో దాడి

మద్యం మత్తులో మందుబాబులు వీరంగం సృష్టించారు. ఫుల్లుగా తాగి డ్రైవ్ చేస్తూ.. బైక్‌‌ను ఢీ కొట్టడమే కాదు.. యాక్సిడెంట్ ఎందుకు చేశావని ప్రశ్నించినందుకు ఇనుప రాడ్లతో, కర్రలతో తిరగబడి దాడి చేశారు. మందుబాబుల వీరంగంతో జాతీయ రహదారిపై అర గంటకు పైగా ఉద్రిక్తత నెలకొంది. పోలీసుల రంగ ప్రవేశంలో తాగుబోతులు పారిపోయారు.

మద్యం మత్తులో బైక్‌ను ఢీకొట్టిన తాగుబోతులు.. అడ్డుకున్న వారిపై కర్రలు, రాడ్లతో దాడి
Drunk People Attack
M Revan Reddy
| Edited By: |

Updated on: Mar 05, 2026 | 11:21 PM

Share

మద్యం మత్తులో మందుబాబులు వీరంగం సృష్టించారు. ఫుల్లుగా తాగి డ్రైవ్ చేస్తూ.. బైక్‌‌ను ఢీ కొట్టడమే కాదు.. యాక్సిడెంట్ ఎందుకు చేశావని ప్రశ్నించినందుకు ఇనుప రాడ్లతో, కర్రలతో తిరగబడి దాడి చేశారు. మందుబాబుల వీరంగంతో జాతీయ రహదారిపై అర గంటకు పైగా ఉద్రిక్తత నెలకొంది.

నల్గొండ జిల్లా చిట్యాల మండలం గుండ్రంపల్లి శివారులో హైదరాబాద్ – విజయవాడ జాతీయ రహదారిపై బైక్ ను వెనుక నుండి కారు ఢీకొట్టింది. ఖమ్మం జిల్లాకు చెందిన ఇద్దరు యువకులు బైక్‌పై హైదరాబాద్ కు వెళ్తున్నారు. చిట్యాల మండలం గుండ్రాంపల్లి శివారు వద్ద బైక్‌ను వేగంగా దూసుకు వచ్చిన కారు ఢీ కొట్టింది. దీంతో బైక్‌పై ఉన్న ఇద్దరు యువకులు కింద పడిపోయారు. ఎందుకు ఢీ కొట్టారని కారులోని యువకులను ప్రశ్నించారు. దీంతో మద్యం మత్తులో ఉన్న నలుగురు మందుబాబులు కారులోని కర్రలు, రాడ్ లతో ఇద్దరు యువకులను విచక్షణారహితంగా దాడి చేశారు.

దూరంగా ఉన్న గుండ్రాంపల్లి వాసులు ఈ గొడవను గమనించి, పరిగెత్తుకుంటూ అక్కడికి చేరుకున్నారు. తీవ్రంగా గాయపడిన వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉండడంతో అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించారు. అప్పటికే మద్యం మత్తులో ఉన్న నలుగురు మందుబాబులను నిలదీసిన గ్రామస్తులపై దాడికి తెగబడ్డారు. కారులోని కర్రలు, రాడ్లతో స్థానికులపై వీరంగం సృష్టించారు. ఇష్టం వచ్చినట్లు బూతులు తిడుతూ స్థానికులపై యదేచ్ఛగా దాడి చేశారు. స్థానికులపై మందుబాబుల వీరంగాన్ని గమనించిన మరికొందరు గ్రామస్తులు అక్కడికి చేరుకోవడంతో హైదరాబాద్ – విజయవాడ జాతీయ రహదారిపై దాదాపు అర గంటకు పైగా ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. గుండ్రాంపల్లి వాసులు పెద్ద సంఖ్యలో రావడంతో మందుబాబులు కారులో పరారయ్యారు. గ్రామస్తుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. పంతంగి టోల్ ప్లాజా వద్ద సిసి కెమెరా ఫుటేజీ ఆధారంగా నిందితులను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

Follow Us