వరుస సినిమాలతో దూసుకుపోతున్న కుర్ర భామ

Rajeev 

05  march 2026

టాలీవుడ్ లో కొత్త అందాలు ప్రేక్షకులను కవ్విస్తున్నాయి. ఈ క్రమంలోనే  శివాని నాగరం అనే ముద్దుగుమ్మ వరుస సినిమాలతో దూసుకుపోతుంది.

ఈ అమ్మడు నటి మాత్రమే కాదు గాయని , కూచిపూడి నృత్యకారిణి కూడా..  2024లో విడుదలైన "అంబాజీపేట మ్యారేజి బ్యాండు" చిత్రంతో పరిచయమైంది శివాని.

అంబాజీపేట మ్యారేజి బ్యాండు చిత్రంలో ఆమె సుహాస్ సరసన లక్ష్మి పాత్రలో నటించి, తన నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకుంది. 

శివాని ఈ అవకాశాన్ని ఇన్‌స్టాగ్రామ్ ద్వారా వచ్చిన ఆడిషన్ మెసేజ్ ద్వారా పొందింది, మొదట హీరోయిన్ స్నేహితురాలి పాత్ర కోసం వెళ్లి, తర్వాత హీరోయిన్‌గా ఎంపికైంది.

ఇక ఆమె నటించిన రెండో సినిమా లిటిల్ హార్ట్స్ సూపర్ హిట్ గా నిలిచింది. ఇందులో శివానీ పోషించిన కాత్యాయని పాత్ర బాగా హైలెట్ అయ్యింది.

ఇక లేటెస్ట్ గా హే బలవంత్ అనే సినిమాతో మరోసారి ఆడియెన్స్ ను పలకరించింది ఈ అందాల తార  

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ చిన్నది క్రేజీ ఫొటోలతో కవ్విస్తుంది. బ్యూటీఫుల్ ఫొటోస్ ఆకట్టుకుంటుంది.