AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold Price Today: స్వల్పంగా తగ్గిన బంగారం.. స్థిరంగా వెండి ధర !

Gold Price Today: స్వల్పంగా తగ్గిన బంగారం.. స్థిరంగా వెండి ధర !

Phani CH
|

Updated on: Mar 05, 2026 | 9:17 PM

Share

ప్రపంచ ఉద్రిక్తతలు, ముఖ్యంగా అమెరికా-ఇరాన్ వివాదం కారణంగా బంగారం ధరలు భారీగా హెచ్చుతగ్గులకు లోనవుతున్నాయి. మార్చి 5న 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.980 తగ్గి రూ.1,63,530లకు చేరగా, వెండి ధర స్థిరంగా ఉంది. డాలర్ బలం, పెట్టుబడిదారుల సురక్షిత మార్గాల అన్వేషణ ధరలపై ప్రభావం చూపుతున్నాయి. కొనుగోలుకు ముందు ధరలను తనిఖీ చేసుకోవడం ముఖ్యం.

బంగారం ధరలు భారీ మార్పులకు లోనవుతున్నాయి. నిన్న పెరిగిన ధరలు ఈరోజు తగ్గుతున్నాయి. అదే సమయంలో రేపు ఊహించని పెరుగుదలకు రెడీ అవుతున్నాయి. దీనికి ప్రధాన కారణం ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న ఉద్రిక్తతలు. అమెరికా – ఇరాన్ మధ్య వివాదం చిలికి చిలికి యుద్ధంగా మారడం ముఖ్యమైన కారణంగా చెప్పవచ్చు. ఈ నేపథ్యంలోనే పెట్టుబడిదారులు కొన్నిసార్లు సురక్షిత మార్గాల వైపు తమ పెట్టుబడులను మళ్లిస్తున్నారు. కొన్నిసార్లు డాలర్ బలపడటంతో బంగారం నుంచి పెట్టుబడులను విరమించుకుంటున్నారు. ఈ క్రమంలో మార్చి 5 గురువారం కూడా బంగారం ధర తగ్గగా.. వెండి ధరమాత్రం స్థిరంగా కొనసాగుతోంది. ఇవాళ 24 క్యారెట్ల పది గ్రాముల బంగారంపై రూ.980లు తగ్గి, రూ.1,63,530లు పలుకుతోంది. 22 క్యారెట్ల బంగారం ధర రూ.900 తగ్గి, రూ. 1,49,900 పలుకుతోంది. వెండి కేజీ రూ.2,95,000 పలుకుతోంది. మార్చి 5, గురువారం వివిధ నగరాల్లో బంగారం, వెండి ధరలను పరిశీలిస్తే.. దేశరాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,63,680 వద్ద ట్రేడవుతోంది. అలాగే 22 క్యారట్ల బంగారం ధర రూ.1,50,050 పలుకుతోంది. ముంబై, కోల్‌కతాలో 24 క్యారెట్ల బంగారం రూ.1,63,530 ఉంటే, 22 క్యారెట్ల బంగారం రూ.1,49,900 పలుకుతోంది. చెన్నైలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,64,950 ఉంటే, 22 క్యారెట్ల బంగారం ధర రూ. రూ.1,51,200 గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్‌, విజయవాడ, విశాఖపట్నంలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,63,530 ఉంటే, 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,49,900 లు పలుకుతోంది. వెండి ధర కిలోకి రూ.2,95,000 గా కొనసాగుతోంది. ఈ ధరలు పెరగవచ్చు, తగ్గవచ్చు.. బంగారం కొనడానికి వెళ్లేముందు ధరలు మరోసారి చెక్‌చేసుకొని వెళ్తే మంచిది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

US-Israel-Iran War: భారత్ తిరిగి వస్తున్న వారికి ఊహించని కష్టాలు

Hyderabad: ఒక్కసారిగా జిమ్ లో కుప్పకూలిన టెకీ.. ఆసుపత్రికి తీసుకెళ్లగా ?

గన్నవరం ఎయిర్ పోర్ట్ లో ఇండిగో విమానం రద్దు

లంచం అడిగిన తహశీల్దార్.. కోపం తో తిరగబడ్డ రైతులు

Telangana: తెలంగాణ టీచర్ల జీతాల కోతపై ప్రభుత్వ స్పష్టత..

Follow Us