AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

US-Israel-Iran War: ఇజ్రాయెల్, అమెరికా Vs ఇరాన్.. దాడులు చేసుకున్న ప్రదేశాలివే

US-Israel-Iran War: ఇజ్రాయెల్, అమెరికా Vs ఇరాన్.. దాడులు చేసుకున్న ప్రదేశాలివే

Phani CH
|

Updated on: Mar 05, 2026 | 10:11 PM

Share

ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ ఆరో రోజున ఇరాన్‌లోని టెహ్రాన్, ఇస్ఫాహాన్, ఖోమ్, బందర్ అబ్బాస్‌లపై అమెరికా, ఇజ్రాయెల్ దాడులు చేశాయి. ఇరాన్ ప్రతిగా ఇజ్రాయెల్, సౌదీ అరేబియా, కువైట్, ఖతార్, బహ్రెయిన్, అజర్‌బైజాన్‌లపై డ్రోన్ దాడులు చేసింది. ఈ ఉద్రిక్తతల మధ్య గల్ఫ్ దేశాల్లోని కోటి మంది భారతీయుల భద్రతపై ఆందోళన వ్యక్తమవుతోంది.

మార్చి 5, 2026న “ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ” ఆరో రోజుకు చేరుకోగా, మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు తీవ్రమయ్యాయి. అమెరికా, ఇజ్రాయెల్ సేనలు ఇరాన్ రాజధాని టెహ్రాన్‌, బందర్ అబ్బాస్ పోర్టుపై దాడులు చేశాయి. ఇస్ఫాహాన్, ఖోమ్ ప్రాంతాలతో పాటు లెబనాన్‌లోని కొన్ని ప్రదేశాలను కూడా లక్ష్యంగా చేసుకున్నాయి. దీనికి ప్రతిగా, ఇరాన్ డ్రోన్లతో విస్తృత దాడులకు పాల్పడింది. ఇజ్రాయెల్‌తో పాటు సౌదీ అరేబియా, కువైట్, ఖతార్, బహ్రెయిన్, అజర్‌బైజాన్‌లను కూడా లక్ష్యంగా చేసుకుంది. గల్ఫ్ దేశాలపై ఇరాన్ దాడులు అమెరికా, ఇజ్రాయెల్ కంటే ఎక్కువగా జరిగాయి. ఈ పరిణామాలతో గల్ఫ్ దేశాల్లో నివసిస్తున్న భారతీయ పౌరుల పరిస్థితి ఆందోళన కలిగిస్తోంది. భారత రాయబార కార్యాలయాలు అప్రమత్తంగా ఉండాలని అడ్వైజరీలు జారీ చేశాయి. సుమారు కోటి మంది భారతీయులు ఈ ప్రాంతంలో నివసిస్తున్నట్లు అంచనా.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Ayodhya: అయోధ్య దశదిశ మార్చేసిన రామమందిరం

US-Israel-Iran War: షియా Vs సున్నీ.. యుద్ధ రంగంలోకి సౌదీ అరేబియా

Nitish Kumar: సీఎం పదవికి త్వరలో నితీష్ రాజీనామా

Gold Price Today: స్వల్పంగా తగ్గిన బంగారం.. స్థిరంగా వెండి ధర !

US-Israel-Iran War: భారత్ తిరిగి వస్తున్న వారికి ఊహించని కష్టాలు

Follow Us