Prince Yawar: హనీ ట్రాప్‌లో చిక్కుకున్న.. బిగ్ బాస్ ఫేమ్ ప్రిన్స్ యావర్
బిగ్ బాస్ తెలుగు ఫేమ్ ప్రిన్స్ యావర్ హనీ ట్రాప్‌లో చిక్కుకున్నారు. ఓ అమ్మాయి తనను మోసం చేసి ₹23-40 లక్షలు వసూలు చేసిందని, కెరీర్ దెబ్బతీస్తానని బెదిరించిందని స్వయంగా వెల్లడించారు. రాజకీయ నాయకుల పేర్లతో భయపెట్టిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎవరూ ఇలాంటి మోసాలకు గురికావద్దని ఆయన హెచ్చరించారు. అయితే, ఈ విషయంలో పోలీసులకు ఫిర్యాదు చేశారా లేదా అన్నది ఇంకా తెలియాల్సి ఉంది.
బిగ్ బాస్ తెలుగు ఫేమ్ ప్రిన్స్ యావర్.. హనీ ట్రాప్ వివాదంలో చిక్కుకున్నట్లు ఆయన మాటల ద్వారే బయటికి వచ్చింది. రెండు మూడు రోజుల క్రితం.. ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న యావర్.. స్వయంగా తాను ఓ అమ్మాయి చేతిలో మోసపోయినట్టు ఆవేదన వ్యక్తం చేశాడు. అంతేకాదు స్వయంగా తన సోషల్ మీడియాలో ఇదే విషయంగా ఓ వీడియోను కూడా పోస్ట్ చేశాడు. ఈ క్రమంలోనే ప్రిన్స్ యావర్ హనీ ట్రాప్‌లో చిక్కుకోవడం ఏంటనే? కామెంట్‌ను నెట్టింట వచ్చేలా చేసుకుంటున్నాడు. రీసెంట్‌గా ఓ ఇంటర్వ్యూకు వెళ్లిన ప్రిన్స్ యావర్.. తాను పోస్ట్ చేసిన వీడియోలో… తనకు తెలిసిన ఒక అమ్మాయి తనను ట్రాప్ చేసి సుమారు ₹23 లక్షల నుండి ₹40 లక్షల వరకు డబ్బు వసూలు చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు.తన కెరీర్‌ను దెబ్బతీస్తానని బెదిరించినట్టుగా కూడా చెప్పుకొచ్చాడు. అంతేకాదు రాజకీయ నాయకుల పేర్లు చెప్పి తనను భయపెడుతున్నారని ప్రిన్స్ యావర్ అన్నాడు. తన పరిస్థితిని వివరిస్తూ, ఎవరూ ఇలాంటి మోసాలకు గురికావద్దని హెచ్చరించాడు. అయితే ఈ కేసులో బాధితుడిగా తన వాదనను వినిపిస్తున్న ప్రిన్స్ యావర్, పోలీసులకు ఫిర్యాదు చేశారా లేదా అన్న వివరాలు తెలియాల్సి ఉంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Thanuja Puttaswamy: ‘నా వెనక ఉన్న శక్తి అతడే..’ కుండబద్దలు కొట్టిన తనూజ
Samantha: సమంత ‘యాంటీ ఇన్‌ఫ్లమేటరీ’ పై.. సోషల్ మీడియాలో చర్చ
పరిహారంలోనూ పక్షపాతమేనా? రాజీవ్ రహదారి బాధితుల ఆవేదన !
ఏం..పిచ్చిపిచ్చిగా ఉందా?.. ట్రంప్ ఆంక్షలపై ఇరాన్ ఫైర్! తగ్గేదే లే
ముంచుకొస్తున్న అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాలకు వానగండం..
వందేమాతరం గీతానికి అరుదైన గౌరవం!
భారత్‌కు టైఫూన్ 'డాల్ఫిన్' దెబ్బ..మన రుతుపవనాల పై ఎఫెక్ట్!
గొర్రెల మంద వద్ద వలలో చిక్కుకున్నది చూసి.. కాపరులు పరుగో పరుగు
అందమైన అమ్మాయి డీపీ చూసి టెంప్ట్ అయ్యాడు.. రూ.20 లక్షలు గోవింద!

