ఓటీటీలో దుమ్మురేపుతున్న బోల్డ్ మూవీ.. అలాంటి సీన్స్‌లో రెచ్చిపోయిన రాధికా ఆప్టే
ప్రతి శుక్రవారం ఓటీటీలో విడుదలయ్యే సినిమాలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. పదుల సంఖ్యలో సినిమాలు విడుదలై అభిమానులను అలరిస్తున్నాయి. ఇక ఓటీటీల్లో సినిమాలు చూడటానికి ఆడియన్స్ ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. థియేటర్స్ లో కొత్త సినిమాలు రిలీజ్ అవుతున్నా.. ఓటీటీలోనూ సినిమాలు చూడటానికి ప్రేక్షకులు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.

ఓటీటీలో రకరకాల సినిమాలు అందుబాటులో ఉన్నాయి. డిఫరెంట్ జోనర్స్ లో సినిమాలు ఓటీటీలో స్ట్రీమింగ్ లో ఉన్నాయి. ప్రతి శుక్రవారం థియేటర్స్ లో కొత్త సినిమాలు సందడి చేస్తున్నాయి. అలాగే శుక్రవారం వస్తే చాలు ఓటీటీలో పదుల సంఖ్యలో సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఇక ఓటీటీల్లో రొమాంటిక్, థ్రిల్లర్, హారర్ సినిమాలకు విపరీతమైన డిమాండ్ ఉంది. ఇక ఇటీవలే ఓటీటీలోకి ఓ బోల్డ్ సినిమా విడుదలైంది. ఈ రొమాంటిక్ సినిమా ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. ఈ రొమాంటిక్ క్రైమ్ థ్రిల్లర్ టాప్ రేటింగ్ లో దూసుకుపోతుంది. ఈ సినిమా ఒక బాలీవుడ్ లో మూవీ. ఈ సినిమాలో రాధికా ఆప్టే ప్రధాన పాత్రలో నటించింది.
ఇది కూడా చదవండి : ఒకప్పుడు సైడ్ డాన్సర్.. ఇప్పుడు ఇండస్ట్రీలో తోప్ హీరోయిన్.. ఆమె ఎవరంటే
ఈ సినిమా పేరు ది వెడ్డింగ్ గెస్ట్.. 2019లో విడుదలైన బ్రిటీష్-అమెరికన్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం. ఈ సినిమాలో రాధికా ఆప్టే, దేవ్ పటేల్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి మైఖేల్ వింటర్‌బాటమ్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా ఒక కిడ్నాప్ డ్రామాగా, రొమాంటిక్, థ్రిల్లర్ జోనర్‌ల కలిపి రూపొందించారు. ఇక ఈ సినిమా కథ విషయానికొస్తే..
ఇది కూడా చదవండి :థియేటర్స్ దద్దరిల్లాల్సిందే.. రామ్ చరణ్ పెద్ది సినిమాలో ఆ అమ్మడి స్పెషల్ సాంగ్..
జై (దేవ్ పటేల్) అనే బ్రిటీష్ యువకుడు, సమీరా (రాధికా ఆప్టే) అనే అమ్మాయిని పాకిస్తాన్ నుంచి ఇండియాకు తీసుకురావడానికి ఒక ఒప్పందం చేసుకుంటాడు. ఈ పని కోసం లాహోర్‌కు వెళ్లి, తన గుర్తింపు బయటపడకుండా కార్లు, సిమ్ కార్డులు మారుస్తూ, రెండు తుపాకులతో సమీరా ఉండే ప్రాంతానికి చేరుకుంటాడు. ఒక రాత్రి, ఆమెను కిడ్నాప్ చేస్తాడు. కానీ, కథలో ఊహించని మలుపులతో జై, సమీరా మధ్య సంబంధం ఏర్పడుతుంది. అలాగే వారి ప్రయాణం ఒక రొమాంటిక్ , ఉత్కంఠభరిత డ్రామాగా మారుతుంది. ఇక ఈ సినిమాలో రొమాంటిక్ సన్నివేశాలకు కొదవే ఉండదు. ముఖ్యంగా ఇంటిమేట్ సీన్స్ లో రాధికా ఆప్టే రెచ్చిపోయి నటించింది. ఓ సన్నివేశంలో ఏకంగా దుస్తులు లేకుండా నటించి షాక్ ఇచ్చింది రాధికా ఆప్టే.. సినిమాలో రాధికా ఆప్టే చేసిన కొన్నిరొమాంటిక్ సన్నివేశాలు, దుస్తులు లేకుండా నటించిన దృశ్యాలు లీక్ కావడంతో ఈ చిత్రం విడుదల సమయంలో భారీ చర్చనీయాంశంగా మారింది. రాధికా ఈ విషయంపై స్పందిస్తూ, బోల్డ్ సన్నివేశాల్లో నటించడంపై తనకు ఎలాంటి భయం లేదని, కథ డిమాండ్ చేస్తే అలాంటి సీన్స్‌లో నటించడం కామన్ అని చెప్పింది. 2019లో థియేటర్లలో విడుదలైంది, కానీ ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. 2024లో, సుమారు ఐదేళ్ల తర్వాత, ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌కు వచ్చింది. ఈ సినిమా ఇంగ్లీష్, హిందీ, తెలుగు భాషల్లో అందుబాటులో ఉంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




