Nayanthara: మెగాస్టార్ చిరంజీవితో సినిమా.. నయనతార రెమ్యునరేషన్ ఎంతో తెలుసా? మొదటి హీరోయిన్‌గా..
నయనతార గత కొన్ని దశాబ్దాలుగా చిత్ర పరిశ్రమలో ఉంది. ఆమెను అభిమానులు లేడీ సూపర్ స్టార్ అని కూడా పిల్చుకుంటారు. ఈ మధ్యన కాస్త సినిమాలు తగ్గించినా నయన్ క్రేజ్, డిమాండ్ ఏ మాత్రం తగ్గడం లేదు. ఇప్పటికీ భారతదేశంలోనే అత్యధిక పారితోషికం తీసుకుంటోన్న హీరోయిన్లలో ఈ బ్యూటీ కూడా ఒకరు.

కోలీవుడ్ స్టార్ నటి, లేడీ సూపర్ స్టార్ నయనతారకు దక్షిణ భారతదేశంలో విపరీతమైన డిమాండ్ ఉంది. ఓ వైపు స్టార్ హీరోల సినిమాలు చేస్తూనే మరో వైపు లేడీ ఓరియెంటెడ్ చిత్రాలు చేస్తోందీ అందాల తార. నయనతారను ‘లేడీ సూపర్ స్టార్’ అని పిలవడానికి కారణం ఆమె పోషించిన పాత్రలే అని చెప్పవచ్చు. తాజాగా ఈ ముద్దుగుమ్మ దక్షిణ భారతదేశంలో అత్యధిక పారితోషికం తీసుకునే నటిగా మారిందని సమాచారం. భారీ బడ్జెట్ చిత్రాలకు నయనతార సుమారు 10 కోట్ల రూపాయల పారితోషికం తీసుకుంటుంది. గతంలో షారుఖ్ ఖాన్ జవాన్ సినిమాలో నటించినందుకు ఆమె ఇదే స్థాయిలో పారితోషికం అందుకుంది. ఇప్పుడు కూడా దీనిని కొనసాగిస్తోందీ అందాల తార. అయితేఇది ఇప్పుడు దాదాపు రెట్టింపు అయ్యిందని తెలుస్తోంది. ప్రస్తుతం నయనతార మెగాస్టార్ చిరంజీవితో ఒక సినిమా చేయనుందని తెలుస్తోంది. ఈ పాత్ర కోసం ఆమె తన కెరీర్‌లో అత్యధిక పారితోషికం అందుకుంటోందని తెలుస్తోంది.
చిరంజీవి సినిమా కోసం నయనతార 18 కోట్ల రూపాయలు అడిగిందని సమాచారం. ఈ సినిమాలో ఆమె పాత్రకు ప్రాధాన్యంతో పాటు నిడివి ఎక్కువగా ఉన్నట్లు అనిపిస్తుంది. అందుకే నయన్ అంత పెద్ద మొత్తాన్ని డిమాండ్ చేసినట్లు సమాచారం. దీని గురించి నిర్మాతలు ప్రస్తుతం లేడీ సూపర స్టార్ తో చర్చలు జరుపుతున్నారు. ఒక వేళ ఇదే నిజమైతే, ఆమె దక్షిణ భారతదేశంలో అత్యధిక పారితోషికం తీసుకునే నటి నయనతారే అవుతుంది.
#MegastarChiranjeevi and #Nayanthara all set to pair up once again. The actress has come onboard for #ChiruAnil
Shoot to start in June. Produced by @Shine_Screens pic.twitter.com/ZR3bZ0idSG
— Cinema Scroll (@scrollcinema) May 3, 2025
ప్రియాంక చోప్రా భారతదేశంలో అత్యధిక పారితోషికం తీసుకునే నటిగా గుర్తింపు పొందింది. రాజమౌళి-మహేష్ బాబు సినిమాకు ఆమె 30 కోట్ల తీసుకుంటోందని తెలుస్తోంది. ఇక దీపిక, అలియా, కంగనా రనౌత్ కూడా 15-20 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు సమాచారం. ఆ తర్వాతి స్థానంలో నయనతార ఉందని చెబుతున్నారు. అయితే దక్షిణాన మాత్రం నయన తారే టాప్ లో ఉంటోందని టాక్.
నెట్ ఫ్లిక్స్ లో నయనతార లేటెస్ట్ సినిమా..
From Today 🎦
Watch TEST, out now in Tamil, Telugu, Malayalam, Kannada and Hindi, only on Netflix!#TESTOnNetflix pic.twitter.com/YRisCBhLCu
— Nayanthara✨ (@NayantharaU) April 4, 2025
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.








